Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: పక్కింటి మహిళ గొంతుకోసి చంపేసిన ప్రేమికులు, అసలు విషయం తెలిస్తే !

బెంగళూరు: అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళ, ఆమె ప్రియుడు డబ్బు, నగల ఆశ కోసం పక్కింటి మహిళను అతిదారుణంగా హత్య చెయ్యడం ఐటీ హబ్ లో కలకలం రేపింది. నమ్మి ఇంటికి వచ్చి వెలుతున్న మహిళను నమ్మినపాపానికి మహిళ హత్యకు గురైయ్యింది. కరోనా వైరస్, లాక్ డౌన్ సమస్యలతో, వ్యాపారంలో నష్టం రావడంతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీ, ఆమె ప్రియుడు దారుణానికి పాల్పడ్డారు. పక్కింటి మహిళను పక్కాప్లాన్ తో హత్య చేసిన మహిళ, ఆమె ప్రియడు సినిమా స్కెచ్ వేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఇప్పుడు అడ్డంగా బుక్కైపోయి కటకటాలపాలైనారు.

 అక్రమ సంబంధం

అక్రమ సంబంధం

ఐటీ హబ్ బెంగళూరు సిటీలోని జ్ఞానజ్యోతి నగర్ లో ఇందిరమ్మ (42) అనే మహిళ నివాసం ఉంటున్నది. బెంగళూరులోనే నివాసం ఉంటున్న రాజశేఖర్ (37) అనే వ్యక్తితో ఇందిరమ్మకు అక్రమ సంబంధం ఉంది. ఇందిరమ్మ, రాజశేఖర్ కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ విధించే ముందు వరకు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేశారు.

 ఆర్థిక సమస్యలు

ఆర్థిక సమస్యలు

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ అమలు కావడంతో ఇందిరమ్మ ఉద్యోగం పోయింది. గత నాలుగు నెలల నుంచి ఇందిరమ్మ ఇంటి అద్దె చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతోంది. రాజశేఖర్ కూడా అనేక వ్యాపారాలు చెయ్యాలని ప్రయత్నించి స్నేహితుల దగ్గర కొన్ని లక్షల రూపాయలు అప్పు తీసుకుని వడ్డీ చెల్లించలేక ఇబ్బందలు పడుతున్నాడు.

 పక్కింటి మహిళ దగ్గర భారీగా నగలు, నగదు

పక్కింటి మహిళ దగ్గర భారీగా నగలు, నగదు

ఇందిరమ్మ ఇంటి పక్కనే రంజిత (27) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఒకేచోట నివాసం ఉంటున్న ఇందిరమ్మ, రంజిత దగ్గర అయ్యారు. రంజిత దగ్గర బంగారు నగలు, నగదు ఉందని ఇందిరమ్మకు తెలిసింది. ఒక శుభకార్యానికి హాజరుకావడానికి రంజిత ఆమె బంధువు దగ్గర పెద్ద బంగారు నెక్లెస్ తీసుకు వచ్చింది. తన బంధువు దగ్గర నేను బంగారు నెక్లెస్ తెచ్చుకున్నానని రంజిత కొన్ని రోజుల క్రితం పక్కింటి ఆంటీ ఇందిరమ్మకు చూపించింది.

 చంపేస్తే జల్సాలకు చాన్స్ చిక్కుతుందని ప్లాన్

చంపేస్తే జల్సాలకు చాన్స్ చిక్కుతుందని ప్లాన్

రంజిత దగ్గర బంగారు నగలు ఉన్నాయని ఇందిరమ్మ ఆమె ప్రియుడు రాజశేఖర్ కు చెప్పింది. రంజితను చంపేసి ఆమె బంగారు నగలు, నగదు దోచుకుంటే మన సమస్యలు తీరిపోతాయని రాజేశేఖర్ ఆమెకు చెప్పాడు. అక్రమ సంబంధం పెట్టుకున్న ఇందిరమ్మ, రాజశేఖర్ రంజిత్ హత్యకు స్కెచ్ వేశారు.

 గొంతు కోసి చంపేసిన ఆంటీ లవర్

గొంతు కోసి చంపేసిన ఆంటీ లవర్

పక్కింటిలో నివాసం ఉంటున్న రంజితతో మాట్లాడటానికి ఇందిరమ్మ వెళ్లింది. రంజిత ఇంట్లోనే కుర్చున్న ఇందిరమ్మ ఆమెతో మాట్లాడింది. కొంతసేపటి తరువాత తాను స్నానం చేసుకుని వస్తానని, నువ్వు ఇక్కడే ఉండాలని రంజిత బాత్ రూమ్ లోకి వెళ్లింది. అదే సమయంలో ఇందిరమ్మ ఇంటికి రాజశేఖర్ వెళ్లాడు. రాజశేఖర్ మొబైల్ చార్జింగ్ వైర్ తీసుకుని రంజిత గొంతు బిగించేశాడు తరువాత వంట గదిలోని కత్తి తీసుకెళ్లి రంజిత గొంతు కోసి చంపేశారు. రంజిత చేతిలో కత్తి పెట్టిన రాజశేఖర్ ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు.

 ఆత్మహత్య చేసుకున్నట్లు సీన్ క్రియేట్ చేసి ?

ఆత్మహత్య చేసుకున్నట్లు సీన్ క్రియేట్ చేసి ?

రంజితను హత్య చేసిన తరువాత ఇల్లు మొత్తం గాలించిన ఇందిరమ్మ, ఆమె ప్రియుడు రాజశేఖర్ రంజిత ఇంట్లో ఉన్న బంగారు గొలుసు లూటీ చేసి అక్కడి నుంచి పరారైనారు. సాయంత్రం 4. 45 గంటల సమయంలో రంజిత మరిది ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంటో రక్తపు మడుగులో రంజిత శవమై కనిపించడంతో అతను గట్టిగా కేకలు వేశాడు.

 డ్రామాలు వేసిన ఇందిరమ్మ

డ్రామాలు వేసిన ఇందిరమ్మ

రంజిత ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురైయ్యిందని పోలీసులకు అనుమానం పెరిగిపోయింది. రంజిత పక్కింట్లో నివాసం ఉంటున్న ఇందిరమ్మ మీద పోలీసులకు అనుమానం వచ్చింది. ఇందిరమ్మకు బెండ్ తియ్యడంతో రంజితను తామే హత్య చేశామని రంజిత అంగీకరించింది, ఇందిరమ్మ ఇచ్చిన సమాచారం మేరకు రాజశేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నగలు నగదు కోసం పక్కింటిలో నివాసం ఉంటున్న రంజితను ఇందిరమ్మ, ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడు రాజశేఖర్ హత్య చేశారని వెలుగు చూడటం ఐటీ హబ్ బెంగళూరులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+