Illegal affair: భర్త ఫ్రెండ్ ప్రియుడు, మామను షార్ప్ షూటర్స్ తో ?, కిలాడి ఏం చేసిందంటే !
లక్నో/ మీరట్/ చెన్నై: తల్లిదండ్రులు చూపించిన యువకుడిని వివాహం చేసుకున్న యువతి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. మూడు సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. తరువాత మామకు, కోడలికి ఓ విషయంలో తేడా వచ్చింది. కొంతకాలానికి పుట్టింటికి వెళ్లిన భార్య భర్త ఫ్రెండ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో పరిచయం అయిన ఆరు మందితో భార్య ఓ డీల్ మాట్లాడుకుంది. ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి మామ అడ్డుగా ఉన్నాడని కోడలు కక్ష పెంచుకుంది. అంతే ప్రియుడు, అతని ఫ్రెండ్స్ తో కలిసి కోడలు మామను రివాల్వర్లతో కాల్చి చంపించడం కలకలం రేపింది. మామను హత్య చెయ్యడానికి కోడలు ఇద్దరు షార్ప్ షూటర్లతో డీల్ మాట్లాడుకుందని వెలుగు చూడటంతో బంధువులు షాక్ అయ్యారు.

షాలిని కాపురం
ఉత్తరప్రదేశ్ లోని మీటర్ జిల్లాలోని మవానా పోలీస్ స్టేషన్ పరిధిలోని టాటినా గ్రామంలో నివాసం ఉంటున్న సంజీవ్ అనే యువకుడికి, మీరట్ జిల్లాలోని బాపట్ సమీపంలోని పాలి గ్రామంలో నివాసం ఉంటున్న షాలిని అనే యువతికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సంజీవ్, షాలిని దంపతులకు ఆరు సంవత్సరాల వయసు ఉన్న కూతురు, నాలుగు సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు ఉన్నారు.

భర్త చనిపోయాడు
భర్త సంజీవ్ తో కలిసి షాలికి అత్తారింటిలో ఉమ్మడి కుటుంబంలో కాపురం చేసింది. భర్త సంజీవ్ కు విపిన్ అనే స్నేహితుడు ఉన్నాడు. ప్రస్తుతం విపిన్ ఘాజియాబాద్ లో నివాసం ఉంటున్నాడు. భర్త సంజీవ్ స్నేహితుడు విపిన్ తో షాలిని చనువుగా ఉండేది. సంజీవ్ కుటుంబ సభ్యులకు కోట్ల రూపాయల ఆస్తి ఉంది. 2018లో అనారోగ్యానికి గురైన షాలిని భర్త సంజీవ్ మరణించాడు. భర్త సంజీవ్ చనిపోయిన తరువాత ఏడాది వరకు షాలిని అత్తారింటిలోనే ఇద్దరు పిల్లలతో కలిసి జీవించింది.

భర్త ఫ్రెండ్ తో అక్రమ సంబంధం
భర్త చనిపోయిన తరువాత షాలిని పుట్టింటికి వెళ్లి వస్తోంది. భర్త సంజీవ్ స్నేహితుడు విపిన్ తో ముందు నుంచి చనువుగా ఉంటున్న షాలిని సంజీవ్ చనిపోయిన తరువాత అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పుట్టింటికి వెళ్లి వచ్చే ముసుగులో షాలిని ఆమె ప్రియుడు విపిన్ తో ఎంజాయ్ చేసింది. ప్రియుడు విపిన్ తో కలిసి లాడ్జ్ లు, హోటల్స్, రిసార్టులకు తిరుగుతున్న షాలిని కామంతో కళ్లు మూసుకుపోయి అతనితో విచ్చలవిడిగా జల్సా చేసింది.

మామకు తెలిసి ఆస్తి ఇవ్వలేదు
కోడలు షాలిని తన కొడుకు సంజీవ్ ఫ్రెండ్ విపిన్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న సంజీవ్ తండ్రి సత్ పాల్ అతని ఆస్తిలో కోడలు షాలినికి వాటా ఇవ్వడానికి నిరాకరించాడు. నువ్వు బతికున్నంత వరకు ఆస్తి ఇవ్వనని, నా కొడుకు పిల్లలు పెద్ద అయిన తరువాత వాళ్లకు ఆస్తి రాసిస్తానని, నీకు ఆస్తి ఇస్తే నువ్వు నీ ప్రియుడితో జల్సా చేసి నా కొడుకు బిడ్డలకు అన్యాయం చేస్తావని సత్ పాల్ తేల్చి చెప్పాడు.

ప్రియుడు, ఆతని ఫ్రెండ్స్ తో షాలిని స్కెచ్
కొంతకాలం ఆస్తి కోసం మామ సత్ పాల్ గొడవపడిన షాలిని తరువాత ఇద్దరు పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఎలాగైనా ఆస్తి దక్కించుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రియుడు విపిన్ ప్రియురాలు షాలినికి మాయమాటలు చెప్పాడు. ఆస్తి కొట్టేసి ప్రియుడు విపిన్ తో జల్సా చెయ్యాలని షాలిని ప్లాన్ వేసింది. ఇదే సమయంలో విపిన్ స్నేహితులు ఐదు మందితో కలిసి మామ సత్ పాల్ ను చంపేయాలని షాలిని స్కెచ్ వేసింది.

మామను కాల్చి పారేసిన షార్ప్ షూటర్స్
జూన్ 29వ తేదీన సత్ పాల్ నివాసం ఉంటున్న గ్రామంలోకి వెళ్లిన ప్రియుడు విపిన్, అతని స్నేహితులు సత్ పాల్ ను రివాల్వర్ తో కాల్చి చంపేశారు. విషయం తెలుసుకున్న మీరట్ జిల్లా ఎస్పీ రామ్ అర్జ్ రంగంలోకి దిగారు. మొదట గుర్తు తెలియన వ్యక్తులు సత్ పాల్ ను హత్య చేశారని కేసు నమోదు అయ్యింది,

కోడలు కింగ్ పిన్
మామ సత్ పాల్ కు ఆయన కోడలు షాలినికి ఆస్తి గొడవలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇదే సమయంలో షాలిని, విసిన్ అక్రమ సంబంధం విషయం తెరమీదకు వచ్చింది. పోలీసులు షాలినిని, ఆమె ప్రియుడు విపిన్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తియ్యడంతో సత్ పాల్ ను తాము హత్య చేయించామని అంగీకరించారు. సత్ పాల్ హత్య కేసులో షాలిని, ఆమె ప్రియుడు విపిన్ తో సహ మొత్తం ఆరు మందిని అరెస్టు చేశామని, ఇంకా ఇద్దరు షార్ప్ షూటర్లు పరారిలో ఉన్నారని మీరట్ జిల్లా ఎస్పీ రామ్ అర్జ్ ఉత్తరప్రదేశ్ లోని స్థానిక మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications