Illegal affair: భార్యకు హ్యాండ్, ప్రియురాలితో గోవా జంప్, పారిపోయిందని లవర్ అక్క హత్య !
బెంగళూరు/ బళ్లారి/ గోవా: భార్యతో కాపురం చేసిన వ్యక్తి ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. భార్యతో కాపురం చేస్తున్న సమయంలో ఓ మహిళ అతనికి పరిచయం అయ్యింది. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి భార్య, పిల్లలను నిర్లక్షం చేశాడు. భార్య, పిల్లలను వదిలేసిన వ్యక్తి అతని ప్రియురాలితో గోవా వెళ్లిపోయి అక్కడ ఆమెతో కాపురం పెట్టాడు. కొన్ని సంవత్సరాల పాటు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో ఎంజాయ్ చేశాడు. తరువాత ప్రియురాలి మీద మోజు తీరిపోవడంతో ఆమెతో గొడవలు మొదలైనాయి. ప్రియుడి చిత్రహింసలు పెట్టడంతో సంవత్సరం పాటు ఓపికగా ఉన్న మహిళ తరువాత కర్ణాటకలో నివాసం ఉంటున్న అంగన్ వాడి కార్యకర్త అయిన సోదరి ఇంటికి పారిపోయింది. ఒక్కసారిగా ప్రియురాలు దూరం కావడంతో రగిలిపోయిన ప్రియుడు గోవా నుంచి కర్ణాటకలో ప్రియురాలు తలదాచుకున్న ప్రాంతానికి వెళ్లి పెద్ద గొడవ చేశాడు. ఆ సమయంలో ప్రియురాలి అక్కను దారుణంగా పొడిచి చంపేసిన ప్రియుడు ఆమె కూతురిని లాక్కొని అటవి ప్రాంతంలోకి వెళ్లిపోవడం కలకలం రేపింది.

గోవాలో వ్యాపారం
కర్ణాటకలోని శిరిసికి చెందిన సుబ్బా నాయక్ (46) అనే వ్యక్తికి వివాహం అయ్యింది. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి సుబ్బా నాయక్ మొదట సంతోషంగా ఉండేవాడు. ఇదే సమయంలో సుబ్బా నాయక్ కు మంగళా నాయర్ అనే మహిళ పరిచయం అయ్యింది. భార్యతో కాపురం చేస్తున్న సమయంలో పరిచయం అయిన మంగళాతో సుబ్బా నాయక్ ఎక్కువ పరిచయం పెంచుకున్నాడు. సుబ్బా నాయక్ గోవాలో వ్యాపారం చేస్తున్నాడు.

ప్రియురాలితో ఎస్కేప్
పరిచయం అయిన మంగళా అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న సుబ్బా నాయక్ భార్య, పిల్లలను నిర్లక్షం చేశాడు. భార్య, పిల్లలను వదిలేసిన సుబ్బా నాయక్ అతని ప్రియురాలు మంగళాతో గోవా వెళ్లిపోయి అక్కడ ఆమెతో కాపురం పెట్టాడు. కొన్ని సంవత్సరాల పాటు అక్రమ సంబంధం పెట్టుకున్న మంగళాతో సుబ్బా నాయక్ ఎంజాయ్ చేశాడు.

ప్రియురాలికి టార్చర్
ప్రియురాలు మంగళా మీద మోజు తీరిపోవడంతో సుబ్బా నాయక్ కు ఆమెతో గొడవలు మొదలైనాయి. ప్రియుడు సుబ్బా నాయక్ ను నమ్ముకుని భర్తను వదిలేసి గోవా వెళ్లిన మంగళా చిత్రహింసలకు గురైయ్యిందని సమాచారం. ప్రియుడు సుబ్బా నాయక్ చిత్రహింసలు పెట్టడంతో సంవత్సరం పాటు ఓపిగా ఉన్న మహిళ తరువాత కర్ణాటకలోని యల్లాపుర తాలుకాలోని విశాల నగరలో నివాసం ఉంటున్న అంగన్ వాడి కార్యకర్త అయిన సోదరి సరోజా (45) ఇంటికి పారిపోయింది.

వెతుక్కుంటూ వచ్చిన ప్రియుడు
తన ప్రియురాలు మంగళా మాయం కావడంతో ఆమె ఆచూకి కోసం సుబ్బా నాయక్ చాలా ప్రయత్నాలు చేసి చివరికి యల్లాపురలోని అంగన్ వాడి కార్యకర్త సరోజా అడ్రెస్ తెలుసుకున్నాడు. గోవా నుంచి కర్ణాటకలోని యల్లాపురలో ఉంటున్న ప్రియురాలు మంగళా తలదాచుకున్న ప్రాంతానికి వెళ్లిన సుబ్బా నాయక్ అక్కడ పెద్ద గొడవ చేశాడు.

చెల్లి కోసం అడ్డుపడిన అక్క
ప్రియురాలు మంగళాను పట్టుకున్న సుబ్బానాయక్ ఆమెను చితకబాదేశాడు. తనతో పాటు గోవా రావాలని మంగళా మీద ఒత్తిడి చేశాడు. నేను నీతోపాటు రాను అని మంగళా అడ్డం తిరిగింది. ఆ సమయంలో రెచ్చిపోతున్న సుబ్బా నాయక్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని మంగళా అక్క సరోజా హెచ్చరించింది.

అంగన్ వాడి కార్యకర్త హత్య
ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకుని సుబ్బా నాయక్ రెచ్చిపోయాడు. సహనం కోల్పోయిన సుబ్బా నాయక్ అతని ప్రియురాలు మంగళా అక్క సరోజాను కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. అదే సమయంలో మంగళా కూతురు అక్షయ అనే యువతిని లాక్కొని సమీపంలోని అడవిలోకి పారిపోయిన సుబ్బా నాయక్ అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు.

గోవా పారిపోవడానికి స్కెచ్
అటవి ప్రాంతం సమీపంలో అక్షయాను వదిలేసిన సుబ్బ నాయక్ తప్పించుకుని గోవా పారిపోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అటవి ప్రాంతంలో గాలించి అంగన్ వాడి కార్యకర్త సరోజాను హత్య చేసిన సుబ్బా నాయక్ ను అరెస్టు చేశారు. ప్రియురాలి కోసం వెళ్లిన సుబ్బా నాయక్ ఆమె అక్కను దారుణంగా హత్య చెయ్యడం యల్లాపురలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications