Illegal affair: శిల్పాలు చెక్కుతున్న భర్త, సింగారించుకుంటున్న భార్యను చంపిన ప్రియుడు !
చెన్నై/ తిరుప్పూర్: శిల్పాలు చెక్కుతున్న వ్యక్తి అతని భార్యతో కలిసి సుఖంగా జీవించేవాడు. ఇంటికి వచ్చి వెలుతున్న బంధువుతో శిల్పి భార్య చనువు పెంచుకుంది. గత ఐదు సంవత్సరాల నుంచి శిల్పి భార్య, ఆమె బంధువు దగ్గర అయ్యారని సమాచారం. భర్త శిల్పి లేని సమయంలో అతని ఇంటికి వెళ్లిన బంధువు సింగారించుకుని ఉన్న శిల్పి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోంది. శిల్పి ఇంటి నుంచి అతని బంధువు హడావిడిగా వెళ్లిపోతున్న విషయం చుట్టుపక్కల వాళ్లు గుర్తించారు. అంతే ఇంటికి వెళ్లిన శిల్పి అతని భార్య దారుణ హత్యకు గురైన విషయం గుర్తించి గట్టిగా కేకలు వేశాడు.

శిల్పి హ్యాపీలైఫ్
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని మూలనూరులో పొన్నుస్వామి (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 7 సంవత్సరాల క్రితం కృతిక (28) అనే యువతిని పొన్నుస్వామి వివాహం చేసుకున్నాడు. శిల్పాలు చెక్కుతున్న పొన్నుస్వామి డబ్బులు బాగానే సంపాధిస్తూ అతని భార్య కృతికతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు.

శిల్పి భార్యకు చాలాక్లోజ్
పొన్నుస్వామి నివాసం ఉంటున్న ఊరిలోనే వారి సమీప బంధువు కందస్వామి (37) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పొన్నుస్వామి ఇంటికి వచ్చి వెలుతున్న కందస్వామి అతని భార్య కృతికకు దగ్గర అయ్యాడు. పొన్నుస్వామి ఇంట్లో లేని సమయంలో కూడా అతని ఇంటికి వెలుతున్న కందస్వామి బంధువు కృతికతో చనువు పెంచుకున్నాడు.

ఐదు సంవత్సరాల నుంచి ఇద్దరూ ?
గత ఐదు సంవత్సరాల నుంచి పొన్నుస్వామి ఇంటికి వెలుతున్న కందస్వామి బంధువు భార్య కృతికతో ఎంజాయ్ చేశాడు. శిల్పాలు చెక్కడానికి వెలుతున్న పొన్నుస్వామి రెండు వారాలు, మూడు వారాలు ఇంటికి దూరంగా ఉండటంతో అతని ఇంటిలోనే కందస్వామి సెటిల్ అయిపోయి అతని భార్య కృతికతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

చంపేసి టెన్షన్ గా వెళ్లిపోయాడు
ఎప్పటిలాగే పొన్నుస్వామి భార్య కృతికను కలవడానికి కందస్వామి వెళ్లాడు. శిల్పి పొన్నుస్వామి ఇంట్లో లేని సమయంలో అతని ఇంటికి వెళ్లిన బంధువు కందస్వామి శిల్పి భార్య కృతికతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లోనే పొన్నుస్వామి భార్య కృతిక, ఆమె బంధువు కందస్వామి మద్య మాటామాటా పెరిగిపోంది. శిల్పి పొన్నుస్వామి ఇంటి నుంచి అతని బంధువు కందస్వామి హడావిడిగా వెళ్లిపోతున్న విషయం చుట్టుపక్కల వాళ్లు గుర్తించారు.

కత్తితో గొంతు కోసి ముఖం చెక్కేసిన కందస్వామి
రాత్రి పొన్నుస్వామి ఇంటికి వెళ్లి చూడగా అతని భార్య కృతిక శవమై కనిపించింది. కృతిక గొంతు కోసి, ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారని గుర్తించిన పొన్నుస్వామి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుప్పూర్ డిప్యూటీ పోలీసు కమీషనర్ ధనరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

ఇంట్లో ఏం జరిగింది ?
కృతిక ఆమె బంధువు కందస్వామితో అక్రమ సంబంధం కారణంగా హత్యకు గురైయ్యిందా ?, హత్య చేసిన కందస్వామి ఎక్కడ ఉన్నాడు అని ఆరా తీస్తున్నామని తిరుప్పూర్ పోలీసులు అంటున్నారు. శిల్పి పొన్నుస్వామి భార్య కృతిక శరీరంలో అనేక కత్తిపోట్లు పడ్డాయని, ఆమె గొంతు కోసేశారని, ఆమె ముఖం మీద కత్తితో దాడి చేశారని వెలుగు చూడటంతో తిరునల్వేలి జిల్లాలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications