Illegal affair: ప్రియుడు రాజాతో భార్య రాణి వన్స్ మోర్, పాపం భర్త తంగవేల్, భార్య స్కెచ్ తో !

చెన్నై/కాంచీపురం/సేలం: పెద్దలు చూసిన సంబంధం కావడంతో యువతి, యువకుడు సంతోషంగా వివాహం చేసుకున్నారు. భర్తతో చక్కగా కాపురం చేసుకోవాలని పుట్టింటి వాళ్లు అమ్మాయికి చెప్పి పంపించారు. భర్తతో బుద్దిగా కాపురం చేసిన భార్య కూడా ఆరు సంవత్సరాల క్రితం కొడుక్కి జన్మనిచ్చింది. భార్య, కొడుకుతో కలిసి అతను సంతోషంగా జీవిస్తున్నాడు. ఉదయం ఉద్యోగానికి వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుని భార్యతో, కొడుకుతో హ్యాపీగా ఉంటున్నాడు. భార్య నెలకు ఒకసారి పుట్టింటికి వెళ్లి మూడు నాలుగు రోజులు అక్కడే ఉండేది. ప్రతినెల తన భార్య పుట్టింటికి ఎందుకు వెలుతోందని భర్తకు అనుమానం మొదలైయ్యింది. సంవత్సరం పాటు భార్య తీరుపై భర్త నిఘా వేశాడు.

అప్పుడు భార్య రాణి గురించి అసలు విషయం తెలుసుకున్న భర్త షాక్ అయ్యాడు. పుట్టింటి దగ్గర తన రాణికి ఓ రాజా ఉన్నాడని తెలుసుకున్న భర్త తంగవేల్ అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. కొంతకాలం పెద్దలు పంచాయితీలు చేశారు. తీరు మార్చుకుంటున్నట్లు నటించిన భార్య ఆమె భర్త తంగవేల్ కు సినిమా చూపించాలని డిసైడ్ అయ్యింది. ప్రియుడు రాజాతో కలిసి భార్య రాణి ఆమె భర్త తంగవేలును పైలోకాలకు పంపించేసింది. హత్య జరిగిన ఆరు వారాలకు భార్య స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోవడంతో కథ మలుపు తిరిగింది.

 8 ఏళ్ల క్రితం పెళ్లి

8 ఏళ్ల క్రితం పెళ్లి

తమిళనాడులోని సేలంలో నివాసం ఉండే తంగవేల్ (35), సేలం జిల్లాకు చెందిన విమలారాణి (31) అనే మహిళకు వివాహం చెయ్యాలని 8 సంవత్సరాల క్రితం వారి కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. పెద్దలు చూసిన సంబంధం కావడంతో తంగవేల్, విమలారాణి అప్పట్లో సంతోషంగా వివాహం చేసుకున్నారు. భర్త తంగవేల్ తో చక్కగా కాపురం చేసుకోవాలని పుట్టింటి వాళ్లు విమలారాణికి చెప్పి పంపించారు.

 సంతోషంగా ఉన్నారు..... కాని ?

సంతోషంగా ఉన్నారు..... కాని ?

భర్త తంగవేల్ తో బుద్దిగా కాపురం చేసిన భార్య విమలారాణి ఆరు సంవత్సరాల క్రితం కొడుక్కి జన్మనిచ్చింది. తంగవేల్ అతని భార్య విమలారాణి, కొడుకుతో కలిసి చెన్నై శివార్లలోని కాంచీపురం జిల్లాలోని ఓరగడం చేరుకుని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. తంగవేల్ అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

 సాయంత్రం పూట షికార్లు

సాయంత్రం పూట షికార్లు

భార్య విమలారాణి, కొడుకుతో కలిసి తంగవేల్ ఏడాది క్రితం వరకు చాలా సంతోషంగా జీవించాడు. ఉదయం ఉద్యోగానికి వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్న తంగవేల్ అతని భార్య విమలారాణితో, కొడుకుతో హ్యాపీగా ఉంటున్నాడు. సమయం చిక్కినప్పుడు సాయంత్రం పూట తంగవేల్ అతని భార్య విమలారాణి, కొడుకును బయటకు పిలుచుకుని వెలుతున్నాడు.

 నెలకు మూడు రోజులు పుట్టింటిలో భార్య

నెలకు మూడు రోజులు పుట్టింటిలో భార్య

భార్య విమలారాణి నెలకు ఒకసారి సేలం జిల్లాలోని పుట్టింటికి వెళ్లి మూడు నాలుగు రోజులు అక్కడే ఉండేది. ప్రతినెల తన భార్య విమలారాణి పుట్టింటికి ఎందుకు వెలుతోంది, నెలలో నాలుగు రోజులు అక్కడ ఆమెకు ఏం పని అంటూ భర్త తంగవేల్ కు అనుమానం మొదలైయ్యింది. సంవత్సరం పాటు భార్య విమలారాణి తీరుపై భర్త నిఘా వేశాడు. అప్పుడు భార్య విమలారాణి గురించి అసలు విషయం తెలుసుకున్న భర్త తంగవేల్ షాక్ అయ్యాడు.

 ప్రియుడు రాజాతో జల్సా చేస్తున్న రాణి

ప్రియుడు రాజాతో జల్సా చేస్తున్న రాణి

పుట్టింటి దగ్గర నివాసం ఉంటున్న రాజాతో విమలారాణికి చాలా సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం ఉంది. కొడుకును తల్లిదండ్రుల దగ్గర పెట్టి విమలారాణి ప్రియుడు రాజాతో కలిసి నిర్జనప్రదేశాలకు వెళ్లి అతనితో జల్సా చేసింది. ప్రతినెల జీతం తీసుకున్నట్లు ప్రియురాలు విమలారాణి దగ్గర ఆమె ప్రియుడు రాజా రొమాన్స్ చెయ్యడానికి మూడు రోజులు టైమ్ తీసుకుంటున్నాడు.

 రాజాతో రాణి వన్స్ మోర్

రాజాతో రాణి వన్స్ మోర్

సేలం జిల్లాలోని పుట్టింటి దగ్గర తన భార్య విమలారాణికి ప్రియుడు రాజా ఉన్నాడని తెలుసుకున్న భర్త తంగవేల్ అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఎలాగు తన భర్త తంగవేల్ కు తన అక్రమ సంబంధం గురించి తెలిసిపోయిందని విమలారాణి ఇంకా రెచ్చిపోయింది. భర్త తంగవేల్ ఇంట్లో లేని సమయంలో ప్రియుడు రాజా కాంచీపురం చేరుకుని ప్రియురాలు విమలారాణితో వన్స్ మోర్ అంటూ జల్సాలు చేశాడు. కొంతకాలం క్రితం వరకు తంగవేల్, విమలారాణి విషయంలో ఇరు కుటుంబాల పెద్దలు పంచాయితీలు చేశారు.

 భర్తను చంపేసి శవం మాయం చేసిన భార్య, ప్రియుడు

భర్తను చంపేసి శవం మాయం చేసిన భార్య, ప్రియుడు

పెద్దలు పంచాయితీ చేసిన తరువాత తన తీరు మార్చుకుంటున్నట్లు నటించిన భార్య విమలారాణి అతని భర్త తంగవేల్ కు సినిమా చూపించాలని డిసైడ్ అయ్యింది. ప్రియుడు రాజాతో కలిసి భార్య రాణి కలిసి జూన్ 28వ తేదీన ఆమె భర్త తంగవేలును హత్య చేసి పైలోకాలకు పంపించేసింది. తరువాత తంగవేల్ శవాన్ని తీసుకెళ్లి కాంచీపురం సమీపంలోని సరస్సు దగ్గర పూడ్చిపెట్టిన భార్య విమలారాణి అతని కొడుకుని పిలుచుకుని ప్రియుడు రాజాతో కలిసి పారిపోయింది.

 ఆరు వారాలకు లొంగిపోయిన భార్య

ఆరు వారాలకు లొంగిపోయిన భార్య

తంగవేల్ కు అతని సోదరుడు శక్తివేల్ జూన్ 30వ తేదీ, ఆగస్టు 2వ తేదీ అనేకసార్లు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తంగవేల్ ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో శక్తివేల్ నేరుగా కాంచీపురంలోని అతని ఇంటి దగ్గరకు వెళ్లాడు. కాంచీపురంలోని తంగవేల్ ఇంటికి తాళం వేసి ఉండటం, అతనితో పాటు భార్య విమలారాణి, కొడుకు కనపడకపోవడంతో శక్తివేల్ కాంచీపురంలో మిస్సింగ్ కేసు పెట్టాడు. కేసు నమోదు చేసిన కాంచీపురం పోలీసులు అప్పటి నుంచి తంగవేల్, విమలారాణిల కోసం గాలిస్తున్నారు. అయితే ఆరు వారాల తరువాత కొడుకుతో కలిసి కాంచీపురం పోలీసుల ముందు ప్రత్యక్షం అయిన విమలారాణి తన భర్త తంగవేల్ ను తానే హత్య చేశానని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

Recommended Video

    Revant Reddy has strongly criticized Ktr for illegally entering funds into Mrs. Shailima's account
     మాది చాలా పాత లవ్ స్టోరీ

    మాది చాలా పాత లవ్ స్టోరీ

    వివాహం కాకముందు నుంచి రాజాతో తనకు అక్రమ సంబంధం ఉందని, వివాహం జరిగిన తరువాత మా అక్రమ సంబంధం కొనసాగుతోందని, తన భర్త తంగవేల్ మాకు అడ్డు రావడంతో తన ప్రియుడు రాజాతో కలిసి తన భర్తను చంపేశామని విమలారాణి పోలీసుల ముందు అంగీకరించింది. తంగవేల్ శవం పూడ్చిపెట్టిన ప్రాంతంలో పరిశీలించి శవాన్ని బయటకు తీసి కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు. తంగవేల్ హత్య కేసులో విమలారాణి లొంగిపోయినా ఆమె ప్రియుడు రాజా తప్పించుకున్నాడని పోలీసులు అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+