Illegal affair: పిట్టకథ చెప్పిన ప్రియుడు, తల్లి ఇంట్లో అర్దకేజీ నగలు చోరీ చేసిన కూతురు, క్లైమాక్స్ !

బెంగళూరు: తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న మహిళ చేసిన పనికి ఆమె కుటుంబ సభ్యులు బిత్తరపోయారు. తండ్రికి అనారోగ్యంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ తండ్రికి వైద్యులు చికిత్స అందించారు. కావలసిన మందులు తీసివ్వడానికి, తండ్రికి తోడుగా ఉండటానికి ప్రతిరోజు కూతురు వెళ్లింది. చాలా రోజుల పాటు తండ్రికి తోడుగా ఆసుపత్రిలో ఉంటున్న కూతురికి అక్కడ పని చేస్తున్న సెక్యూరిటీగార్డు పరిచయం అయ్యాడు. సెక్యూరిటీ గార్డు పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. తండ్రికి ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి వెళ్లిపోయారు. తరువాత కూడా సెక్యూరిటీ గార్డుతో కలిసి ఎంజాయ్ చేసింది. తాను మంచి ఉద్యోగం చెయ్యాలని ఉందని, అందుకు డబ్బు అవసరం ఉందని, మీ ఇంటిలోని నగలు తెచ్చి ఇస్తే వాటిని కుదువపెట్టి తరువాత ఉద్యోగం చేసి నీ నగలు నీకు తెచ్చిస్తానని సెక్యూరిటీగార్డు ప్రియురాలికి చెప్పాడు. అంతే ఇంట్లో ఉన్న బంగారు నగలు ఒక్కొక్కటి చోరీ చేసింది. ఇంట్లో నగలు మొత్తం మాయం చేసి ప్రియుడికి ఇచ్చేసింది. రూ. 23 లక్షలకు పైగా విలువైన బంగారు నగలు బీరువాలో మాయం కావడంతో బిత్తరపోయిన తల్లి కూతురు, ఆమె ప్రియుడి మీద కేసు పెట్టడంతో కథ రసవత్తరంగా మారింది.

 తండ్రికి అనారోగ్యం

తండ్రికి అనారోగ్యం

బెంగళూరులోని భారతీనగర్ లో ఫిరోజా బాను అనే మహిళ నివాసం ఉంటున్నది. ఫిరోజా బానుకు ఆయేషా అర్షీన్ అనే కుమార్తె ఉంది. వివాహం చేసుకుని అత్తారంటిలో ఉంటున్న ఆయేషా తల్లి ఇంటికి వచ్చి వెలుతున్నది. కొన్ని నెలల క్రితం ఆయేషా తండ్రి అనారోగ్యానికి గురైనాడు. తండ్రిని చూడటానికి ఆయేషా ఎక్కువగా ఇంటికి వచ్చి వెలుతోంది.

 ఆసుపత్రిలో తండ్రికి చికిత్స

ఆసుపత్రిలో తండ్రికి చికిత్స

ఆయేషా తండ్రి ఎక్కువ అనారోగ్యానికి గురి కావడంతో అతన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో తల్లి ఫిరోజా బాను ఆసుపత్రికి వెళ్లి రావడానికి ఇబ్బందిపడింది. ఆసుపత్రిలో తండ్రిని చూసుకోవడానికి ఆయేషా వెళ్లింది. ఆసుపత్రిలో అక్కడ ఆయేషా తండ్రికి వైద్యులు చికిత్స అందించారు. కావలసిన మందులు తీసివ్వడానికి, తండ్రికి తోడుగా ఉండటానికి ప్రతిరోజు ఆయేషా అక్కడే ఉంది.

 సెక్యూరిటీ గార్డుతో ?

సెక్యూరిటీ గార్డుతో ?

ప్రైవేటు ఆసుపత్రిలో అమీనుల్లా ఇస్లామ్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. రాత్రిపూట తండ్రికి తోడుగా ఉంటున్న ఆయేషాతో సెక్యూరిటీగార్డు అమీనుల్లాకు పరిచయం అయ్యింది. రాత్రిపూట ఆసుపత్రిలో జనం తక్కువగా ఉండటంతో ఆయేషా సెక్యూరిటీగార్డు అమీనుల్లాతో చనువు పెంచుకుంది.

 అక్రమ సంబంధంతో కళ్లు మూసుకుపోయి ?

అక్రమ సంబంధంతో కళ్లు మూసుకుపోయి ?

సెక్యూరిటీ గార్డు అమీనుల్లా, ఆయేషాల పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఆయేషా తండ్రికి ఆరోగ్యం కుదుటపడటంతో భారతీనగర్ లోని ఇంటికి వెళ్లిపోయారు. తరువాత కూడా ఆయేషా ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు అమీనుల్లాతో కలిసి ఎంజాయ్ చేసింది. ప్రతినిత్యం కలుసుకుంటున్న అమీనుల్లా, ఆయేషా పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు.

 పిట్టకథ చెప్పిన ప్రియుడు

పిట్టకథ చెప్పిన ప్రియుడు

ఆయేషా ఇంటిలో భారీగా బంగారు నగలు ఉన్నాయని సెక్యూరిటీగార్డు అమీనుల్లాకు తెలిసింది. తనను కలవడానికి వస్తున్న ప్రియురాలు ఎక్కువగా బంగారు నగలు పెట్టుకుంటున్న విషయం అమీనుల్లాకు తెలుసు. సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం మానేసి తరువాత తాను మంచి ఉద్యోగం చెయ్యాలని ఉందని, అందుకు డబ్బు అవసరం ఉందని, మీ ఇంటిలోని నగలు తెచ్చి ఇస్తే వాటిని కుదువపెట్టి తరువాత ఉద్యోగం చేసి నీ నగలు నీకు తెచ్చిస్తానని సెక్యూరిటీ గార్డు అమీనుల్లా అతని ప్రియురాలు ఆయేషాకు చెప్పాడు.

 ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు

ప్రియుడు అమీనుల్లా మోజులో పడిపోయిన ఆయేషా అమ్మ ఫిరోజా బాను నగలు చోరీ చేసి ప్రియుడికి ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అంతే ఇంట్లో ఉన్న బంగారు నగలు ఆయేషా ఒక్కొక్కటి చోరీ చేసి ప్రియుడు అమీనుల్లాకు ఇవ్వడం మొదలు పెట్టింది. ఫిరోజా బాను ఇంట్లో ఉన్న సగభాగం నగలు మాయం చేసిన ఆయేషా ఆమె ప్రియుడు అమీనుల్లాకు ఇచ్చేసింది.

 అర్దకేజీ నగలు కనపడకపోవడంతో తల్లికి షాక్

అర్దకేజీ నగలు కనపడకపోవడంతో తల్లికి షాక్

ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనే సామత లాగా ఆయేషా బంగారు నగలు చోరీ చేస్తున్న విషయం ఆమె కుటుంబ సభ్యులు గుర్తించలేకపోయారు. రెండు రోజుల క్రితం పెళ్లికి వెళ్లాలని ఫిరోజా బాను బీరువాలోని బంగారు నగల బాక్స్ బయటకు తీసింది. అంతే 470 గ్రాముల బంగారు నగలు మాయం కావడంతో ఫిరోజా బాను బిత్తరపోయింది.

 పోలీసు కేసు పెట్టిన తల్లి

పోలీసు కేసు పెట్టిన తల్లి

ఇంట్లోకి ఎవ్వరూ రావడం లేదని, ఇంటో తన భర్త, కూతురు మాత్రమే ఉంటున్నామని, నగలు ఎవరు చోరీ చేసి ఉంటారు అంటూ ఫిరోజా బాను తలబాదుకుంది. చివరికి కూతురు ఆయేషా మీద అనుమానం రావడంతో ఫిరోజా బాను నిలదీసింది, ఆయేషా గంటకు ఒక మాట మాట్లాడటంతో ఫిరోజా బాను పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 రూ. 23 లక్షల నగలు... కూతురు, ప్రియుడు అరెస్టు

రూ. 23 లక్షల నగలు... కూతురు, ప్రియుడు అరెస్టు

ఫిరోజా బాను ఇంటిలో సుమారు రూ. 23 లక్షలు చోరీ కావడంతో భారతీనగర పోలీసులు కూడా అనేక కోణాల్లో విచారణ చేశారు. ఇదే సమయంలో ఫిరోజా బాను కూతురు ఆయేషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ సమయంలో ఆయేషా నంగనాచి మాటలు చెప్పింది. ఆయేషా మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా సెక్యూరిటీగార్డు అమీనుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నతల్లి ఫిరోజా బాను ఇంటిలో బంగారు నగలు చోరీ చేసిన ఆయేషా, ఆ నగలు కదువ పెట్టి జల్సా చేసిన సెక్యూరిటీగార్డు అమీనుల్లాను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+