Illegal affair: భార్య యాపిల్ పండులా ఉందని భర్తకు డౌట్, పైగా ఉద్యోగం, సెక్యూరిటీ గార్డు !

చెన్నై: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు ఆరు నెలలు మాత్రమే సంతోషంగా కాపురం చేశారు. తన భార్య చూడటానికి చాలా అందంగా ఉందని, ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువని భర్తకు అనుమానం మొదలైయ్యింది. ఇంటి నుంచి బయటకు వెలుతున్న భర్త రాత్రి ఇంటికి వెళ్లి అతని భార్యకు టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు. నేను బయటకు వెళ్లిన తరువాత ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్లారు ?, వాళ్లతో నువ్వు ఎంతసేపు గడిపావు ?, అసలు మీ మద్య ఏం జరిగింది ? ఇలాంటి చిత్రవిచిత్రమైన ప్రశ్నలు వేసి ఆమెను వేధింపులకు గురి చెయ్యడం మొదలుపెట్టాడు. ఇదే విషయంలో దంపతుల మద్య చాలా ఎక్కువగా గొడవలు జరిగాయి. వివాహం జరిగిన సంవత్సరానికే దంపతులు విడిపోయారు. భర్తతో విడిపోయిన భార్య ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. భార్య మంచి జీతం తీసుకుంటున్నదని, తనను వదిలేసి వేరే వ్యక్తితో ఎంజాయ్ చేస్తోందని ఆమె భర్త రగిలిపోయాడు. ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెలుతున్న భార్యను ఆమె భర్త అడ్డుకున్నాడు. తనతో కలిసి జీవించాలని, తన ఇంటికి రావాలని భర్త చెప్పాడు. నీతో నాకు పని లేదని, తనకు కావలసిన వాళ్లు చాలా మంది ఉన్నారని, నీ పని నువ్వు చూసుకోవాలని భార్య చెప్పింది. భార్య మాటలతో రగిలిపోయిన భర్త నడిరోడ్డులో కత్తి తీసుకుని అతని భార్యను కసకసా పొడిచేయడం కలకలం రేపింది.

మూడు సంవత్సరాల క్రితం ?

మూడు సంవత్సరాల క్రితం ?

తమిళనాడులోని కళ్లకురుచ్చిలో సౌందర్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చెన్నై సిటీలోని రామాపురంలో సంధ్య (24) అనే యువతి నివాసం ఉంటున్నది. సౌందర్, సధ్యకు వివాహం చెయ్యాలని వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం సంధ్య, సౌందర్ కు వివాహం జరిగింది.

అందంగా ఉన్న భార్య మీద అనుమానం

అందంగా ఉన్న భార్య మీద అనుమానం

సౌందర్, సంధ్య దంపతులు చెన్నైలో వేరుగా కాపురం పెట్టారు. కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న సౌందర్, సంధ్య దంపతులు ఆరు నెలలు మాత్రమే సంతోషంగా కాపురం చేశారు. తన భార్య సంధ్య చూడటానికి ఎర్రగా, సన్నగా, యాపిల్ పండులా చాలా అందంగా ఉందని, ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని ఆమె భర్త సౌందర్ కు రానురాను అనుమానం మొదలైయ్యింది. ఇంటి నుంచి బయటకు వెళ్లి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న సంధ్య భర్త సౌందర్ రాత్రి ఇంటికి వెళ్లి అతని భార్యకు టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు.

ఎవరెవరు వస్తున్నారు ? ఏమి చేస్తున్నారు

ఎవరెవరు వస్తున్నారు ? ఏమి చేస్తున్నారు

నేను బయటకు వెళ్లిన తరువాత ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్లారు ?, వాళ్లతో నువ్వు ఎంతసేపు గడిపావు ?, అసలు మీ మద్య ఏం జరిగింది ? ఇలాంటి చిత్రవిచిత్రమైన ప్రశ్నలు వేస్తున్న సౌందర్ అతని భార్య సంధ్యను వేధింపులకు గురి చెయ్యడం మొదలుపెట్టాడు. ఇదే విషయంలో సౌందర్, సంధ్య దంపతుల మద్య చాలా ఎక్కువగా గొడవలు జరిగాయి. సంధ్య చెన్నైలో పుట్టి పెరగడం, పెళ్లి అయిన తరువాత కూడా అక్కడే ఉండాలని చెప్పడంతో ఆమె భర్త సౌందర్ కు ఇంకా అనుమానాలు ఎక్కువ అయ్యాయి.

సంవత్సరానికే విడిపోయిన దంపతులు

సంవత్సరానికే విడిపోయిన దంపతులు

వివాహం జరిగిన సంవత్సరానికే సౌందర్, సంధ్య దంపతులు విడిపోయారు. భర్త సౌందర్ తో విడిపోయిన అతని భార్య సంధ్య రామాపురంలోని పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నది, సంధ్య ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. సౌందర్ వేరే కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. తన మాజీ భార్య సంధ్య ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్నదని, తనను వదిలేసి వేరే వ్యక్తితో ఎంజాయ్ చేస్తోందని సౌందర్ రగిలిపోయాడు.

నాకు చాలా మంది ఉన్నారని చెప్పిన భార్య

నాకు చాలా మంది ఉన్నారని చెప్పిన భార్య

తన భార్య సంధ్యను ఎలాగైనా కాపురానికి పిలుచుకుని వెళ్లాలని సౌందర్ స్కెచ్ వేశాడు. ఉద్యోగం ముగించుకున్న సంధ్య సాయంత్రం నడుచుకుంటూ ఇంటికి వెలుతున్న సమయంలో ఆమెను భర్త సౌందర్ అడ్డుకున్నాడు. తనతో కలిసి జీవించాలని, తన ఇంటికి రావాలని సౌందర్ అతని భార్య సంధ్యాకు చెప్పాడు. నీతో నాకు పని లేదని, తనకు కావలసిన వాళ్లు చాలా మంది ఉన్నారని, నీ పని నువ్వు చూసుకోవాలని సంధ్య తేల్చి చెప్పింది.

 భార్యను నడిరోడ్డులో దారుణంగా పొడిచేసిన భర్త

భార్యను నడిరోడ్డులో దారుణంగా పొడిచేసిన భర్త


సౌందర్, సంధ్య మధ్య మాటామాటా పెరిగిపోయింది. భార్య సంధ్య ఎగతాలి మాటలతో రగిలిపోయిన సౌందర్ నడిరోడ్డులో కత్తి తీసుకుని ఆమె కడుపులో దారుణంగా కసకసా అడిపొడిచేశాడు. తీవ్రగాయాలైన సంధ్యను స్థానికులు చెన్నైలోని స్టాల్లీ ఆసుపత్రికి తరలించారు. భార్యను దారుణంగా పొడిచేసిన సౌందర్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని చెన్నైలోని రాయల్ పోలీస్ స్టేషన్ అధికారులు అన్నారు. తనను దూరం పెట్టిన తన భార్య సంధ్యా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే వివాహం అయిన తరువాత కూడా చెన్నైలోనే ఉండాలని పట్టుబట్టిందని అనుమానం పెంచుకున్న ఆమె భర్త సౌందర్ రగిలిపోయాడని, అందుకే నడిరోడ్డులో హత్యాయత్నం చేసి ఉంటానడి బాధితురాలి సన్నిహితులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+