ఇమ్మిగ్రేషన్‌పై యూఎస్ ఎంబసీ తాజా అప్‌డేట్: భారత్‌కు ముప్పు: చుక్కలే..

Donald Trump: అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. ఈ విషయంలో భారత్ కూడా మినహాయింపు కాదు. అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు.

అక్రమంగా నివసించే భారతీయులను వెనక్కి పంపించే కార్యక్రమానికి అమెరికా తెర తీసింది కూడా. వారిని ఆ దేశ ప్రభుత్వమే వెనక్కి పంపిస్తోంది. విదేశాంగం- రక్షణ మంత్రత్వ సంయుక్తంగా ఈ ఏరివేతను చేపట్టాయి. తొలి దశలో 205 మంది భారతీయులను మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్కించింది. ఇప్పటికే ఈ ఫ్లైట్ టెక్సాస్ నుంచి బయలుదేరింది.

illegal migration is not worth the risk says US embassy in India

అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వివిధ దేశాల పౌరులపై గతంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు ట్రంప్. వారిని రాడికల్స్‌గా, టెర్రరిస్టులుగా అభివర్ణించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతాననీ తేల్చి చెప్పారు. అలాంటి వాళ్లు అమెరికా గడ్డపై నివసించడానికి ఏ మాత్రం అర్హులు కారనీ స్పష్టం చేశారు.

ట్రంప్ చర్యల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి అనుమతులు లేకుండా అమెరికాలో 18,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తోన్నట్లు గుర్తించింది. ఈ సంఖ్య మరింత అధికంగా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో వాళ్లందరినీ కూడా వెనక్కి పిలిపించుకోవాలని భావిస్తోంది.

తాజాగా- 205 మందిని స్వదేశానికి పంపించడం పట్ల భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. అక్రమ వలసదారులను అరికట్టే క్రమంలో దేశ సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేసుకుంటోన్నామని తెలిపింది. ఇమ్మిగ్రేషన్స్ చట్టాలను మరింత కఠినతరం చేస్తోన్నామని పేర్కొంది.

అక్రమంగా తమ దేశంలో నివసించే వారి పట్ల ఉపేక్షించదలచుకోవట్లేదని తమ ప్రభుత్వం భావిస్తోందని వివరించింది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా నివసిస్తోన్న వారిని వెనక్కి పంపించే ప్రక్రియ మరింత వేగవంతమౌతుందని, ఈ చర్య అక్రమ వలసదారులకు ఓ స్పష్టమైన సందేశాన్ని పంపించాయని అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+