• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Illegal affair: జాతకంతో పాటు ఆంటీకి అన్నీ చూసిన జ్యోతిష్యుడు, నడిరోడ్లో ఔట్!

|
Google Oneindia TeluguNews

చెన్నై/పుత్తూరు/ఈరోడ్: దంపతులకు జాతకాలు చూపించుకునే పిచ్చి ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. తరువాత ఆంటీ తెలిసిన జ్యోతిష్యుడి దగ్గర జాతకాలు చూపించుకునే విషయం గురించి అతని దగ్గరకు వెళ్లి వస్తూ అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది. జాతకం చూసే నెపంతో మహిళ ఇంటికి వెలుతున్న జ్యోతిష్యుడు ఆంటీకి అన్నీ చూశాడు. ఇదే విషయంలో ఆంటీ బంధువులు గొడవ చెయ్యడంతో రగిలిపోయిన జ్యోతిష్యుడు కత్తితో ఏకంగా 6 మందిని పొడిచి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో గొడవ మరింతపెద్దది అయ్యి ఆరు మంది కత్తిపోట్లకు గురైనారు. పిచ్చోడి చేతిలో రాయి టైపులో జ్యోతిష్యుడి చేతిలో కత్తి ఉండటంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఆంటీతో ఎంజాయ్ చెయ్యాలని వెళ్లిన జ్యోతిష్యుడిని ఆమె బంధువులు, గ్రామస్తులు నడిరోడ్లో రాళ్లతో కొట్టికొట్టి చంపడం కలకలం రేపింది.

Khiladi: భర్తకు రూ. 3 కోట్లు ఇన్సూరెన్స్, ఆంటీ ఏం చేసిందంటే, బంధువుతో, కారులో, దేవుడా !Khiladi: భర్తకు రూ. 3 కోట్లు ఇన్సూరెన్స్, ఆంటీ ఏం చేసిందంటే, బంధువుతో, కారులో, దేవుడా !

జాతకాల పిచ్చి

జాతకాల పిచ్చి

తమిళనాడులోని ఈరోడ్ జిల్లా అప్పక్కుడాల్ సమీపంలోని ఒరిచెరి పుత్తూరు సమీపంలోని మలియూర్ గ్రామంలో వీరపళనిస్వామి, మల్లికా (46) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరపళనిస్వామి, మల్లికా దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరపళనిస్వామి, మల్లికా దంపతులకు జాతకాల పిచ్చి ఉంది.

మల్లికా భర్త చనిపోతే ?

మల్లికా భర్త చనిపోతే ?

వీరపళనిస్వామి, మల్లికా దంపతులు జాతకాలు చూపించుకోవడానికి జ్యోతిష్యులను చాలా మందిని కలిసేవాళ్లు. చాలాసార్లు పళనిస్వామి (57) అనే జ్యోతిష్యుడిని వీరపళనిస్వామి, మల్లికా దంపతులు కలిసి జాతకాలు చూపించుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం భర్త వీరపళనిస్వామి మరణించాడు. తరువాత భార్య మల్లికా ఆ జ్యోతిష్యుడు పళనిస్వామిని చాలా సార్లు కలిసింది.

జాతకం చూడమంటే ఆంటీకి అన్నీ చూశాడు

జాతకం చూడమంటే ఆంటీకి అన్నీ చూశాడు

జాతకాలు చూపించుకోవడానికి వచ్చి వెలుతున్న మల్లికా ఆంటీని జ్యోతిష్యుడు పళనిస్వామి లైన్ లో పెట్టాడు. జ్యోతిష్యుడిని నమ్ముకుంటే తనకు టైమ్ కలిసి వస్తుందని, అతనితో మంచిగా ఉంటే తనకు భర్తలేని లోటు తీరుతుందని అనుకున్న మల్లికా ఆంటీ పళనిస్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక అప్పటి నుంచి జ్యోతిష్యుడు పళనిస్వామి మల్లికా ఆంటీకి అన్నీ చూశాడు.

పైకి నటించి బెడ్ రూమ్ లో జీవించాడు

పైకి నటించి బెడ్ రూమ్ లో జీవించాడు

మల్లికా ఆంటీ మస్త్ మజా ఇస్తుండటంతో పళనిస్వామి ఆమెకు పూర్తిగా దాసోహం అయ్యాడు. తాను జాతకం చెప్పడానికి వచ్చానని మల్లికా ఆంటీ కుటుంబ సభ్యులు, బంధువులను జ్యోతిష్యుడు పళనిస్వామి చెబుతూ వాళ్ల ముందు నటిస్తూ వారిని అలాగే నమ్మించాడు. జాతకం చెప్పే ముసుగులో మల్లికా ఆంటీ బెడ్ రూమ్ లో దూరుతున్న పళనిస్వామి ఆమెతో మస్త్ మజా చేస్తూ స్వర్గంలో తేలిపోయాడు.

వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్

వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్

పదేపదే జాతకాలు చూడటానికి వచ్చి వెలుతున్నానని జ్యోతిష్యుడు పళనిస్వామి మల్లికా ఆంటీ ఇంట్లో దూరి ఎంజాయ్ చెయ్యడం ఆమె బంధువులకు నచ్చలేదు. పగలు, రాత్రి అని తేడా లేకుండా పళనిస్వామి మల్లికా ఆంటీ ఇంటి చుట్టూ గిర్రున తిరిగేశాడు. విషయం చెయ్యిదాటిపోతుందని బావించిన మల్లికా బంధువులు ఇంకోసారి ఇటు వైపు రాకూడదని జ్యోతిష్యుడు పళనిస్వామికి వార్నింగ్ ఇచ్చారు.

ఆంటీ దెబ్బతో ఆరు మందికి కత్తిపోట్లు

ఆంటీ దెబ్బతో ఆరు మందికి కత్తిపోట్లు

బంధువులు వార్నింగ్ ఇచ్చినా మల్లికా ఆంటీ సపోర్ట్ చెయ్యడంతో పళనిస్వామి ఏమాత్రం పట్టించుకోలేదు. మల్లికా ఆంటీతో ఎంజాయ్ చేసి ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చిన జ్యోతిష్యుడు పళనిస్వామిని ఆంటీ బంధువులు పట్టుకుని చితకబాదేశారు. ఆ సమయంలో చచ్చిపోతానని భయపడిన జ్యోతిష్యుడు పళనిస్వామి సేఫ్టీ కోసం బ్యాగ్ లో వెంట తెచ్చుకున్న కత్తి తీసుకుని మల్లికా ఆంటీ బంధువులైన చెన్ననాయక్కర్, గోవిందన్, సూర్య, ప్రకాష్, చిన్నమ్మాల్, కుమార్ అనే ఆరు మందిని ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు.

రాళ్లదాడితో జ్యోతిష్యుడి జాతకం రివర్స్....... ఔట్

రాళ్లదాడితో జ్యోతిష్యుడి జాతకం రివర్స్....... ఔట్

జ్యోతిష్యుడు పళనిస్వామి కత్తితో దాడి చెయ్యడంతో ఆరు మందికి తీవ్రగాయాలు కావడంతో గ్రామస్తులు అందరూ ఒక్కటైపోయారు. చేతికి చిక్కిన రాళ్లు తీసుకుని నలువైపుల నుంచి జ్యోతిష్యుడు పళనిస్వామి మీద రాళ్లవర్షం కురిపించారు. పెద్దపెద్ద రాళ్లతో దాడి చెయ్యడంతో మల్లికా ఆంటీ ప్రియుడు పళనిస్వామి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

బిత్తిరి మల్లికా ఆంటీ విచారణ

బిత్తిరి మల్లికా ఆంటీ విచారణ

విషయం తెలుసుకున్న పోలీసులు కత్తిపోట్లకు గురైన ఆరు మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇంత గొడవలు, జ్యోతిష్యుడు పళనిస్వామి హత్యకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణం అయిన మల్లికా ఆంటీని పోలీసులు విచారణ చేస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా ఓ ఫేమస్ జ్యోతిష్యుడు ప్రియురాలి బంధువుల చేతిలో దారుణ హత్యకు గురికావడం కలకం రేపింది.

English summary
Illegal relationship: The incident in which an astrologer was stoned to death in a fake love affair has caused great shock. Tamil Nadu Erode Police have registered a case and are investigating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X