Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: బాయ్ ఫ్రెండ్ ను తమ్ముడు అని చెప్పిన భార్య, ప్రియుడు, కిల్లర్స్ తో కలిసి భర్తను ?, ఇన్సూరెన్స్ !

చెన్నై/నమ్మక్కల్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసి కొడుకు, కూతురికి తల్లి అయ్యింది. రెండు సంవత్సరాల క్రితం ఓ యువకుడు దంపతుల ఇంటికి వెళ్లిరావడం మొదలు పెట్టాడు. తరువాత యువకుడితో భార్య చనువు పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అందరికి ఇతను తన తమ్ముడు అని పరిచయం చేసింది. కొన్ని రోజులకు భర్తకు అతని భార్య మ్యాటర్ తెలిసి ఆమెకు బెండ్ తీశాడు. తరువాత భర్త రోడ్డు మీద హత్యకు గురైనాడు. పోలీసుల విచారణలో అక్రమ సంబంధం మ్యాటర్, రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ మ్యాటర్, కిరాయి హంతకులతో భార్య ఆమె భర్తను హత్య చేయించిన విషయాలు బయటకు వచ్చాయి.

రోడ్డు మీద శవమైన భర్త

రోడ్డు మీద శవమైన భర్త

భార్య కిరాయి మనుషులను ఉపయోగించి భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కేరళలోని కోజికోడ్‌లోని నాథమ్‌కు చెందిన దేవా అలియాస్ దేవరాజ్ (35). దేవరాజ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. గత 19వ తేదీన తిరుచెంగోడ్ అప్పూర్‌పాళయం నుండి కైలాస పాళయం వెళ్లే రహదారిపై జకతాంపాల్ నగర్ సమీపంలో దేవరాజ్ కొందరి చేతిలో హత్యకు గురయ్యాడు. 19వ తేదీ రాత్రి 7.30 గంటల ప్రాంతంలో జగతాంబాల్ నగర్ సమీపంలో దేవరాజ్ గొంతు కోసి, రెండు చోట్ల కత్తితో పొడిచి చంపేశారు. దేవరాజ్, శరణ్య దంపతులు తమిళనాడులోని నమ్మక్కల్ లో నివాసం ఉంటున్నారు.

భార్యకు అక్రమ సంబంధం

భార్యకు అక్రమ సంబంధం

పోలీసులు కేసు నమోదు చేసి దేవరాజ్ కేసులో హంతకులు ఎవరు, దేవరాజ్ హత్యకు కారణం ఏమిటి అని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో మృతి చెందిన దేవరాజ్‌కు భార్య శరణ్య (30), కుమారుడు కృపాకరన్, కుమార్తె క్రిప్టో ఉన్నారని వెలుగు చూసింది. కోజికలాం ప్రాంతంలో తల్లిదండ్రుల వద్ద ఉండే సంగకిరి ప్రాంతానికి చెందిన విమల్ కుమార్ అలియాస్ విమల్ అనే యువకుడు దేవరాజన్ ఇంటికి తరచూ వచ్చేవాడని పోలీసులకు తేలింది. రానురాను దేవరాజ్ భార్య శరణ్య, విమల్‌ కుమార్‌ల మద్య చనువు పెరిగిందని, తరువాత ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

భార్యకు పోటీగా అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త

భార్యకు పోటీగా అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త

విమల్ కుమార్ తన తమ్ముడు అని శరణ్య అందరికి చెప్పింది. ఈ దెబ్బతో విమల్ కుమార్, శరణ్యల అక్రమ సంబంధం విషయంలో ఎవరికీ అనుమానం రాలేదు. అయితే దేవరాజ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఈ విషయంలో దేవరాజన్ అతని భార్యతో శరణ్యతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత దేవరాజ్ అతని ఫ్యామిలీని వేరే ప్రాంతానికి మార్చేశాడు. కొత్తగా వెళ్లిన ఏరియాలో దేవరాజ్ ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇదేంటని శరణ్య ఆమె భర్తను ప్రశ్నిస్తే నీ గురించి నేను పట్టించుకోను, నా గురించి నువ్వు పట్టించుకోకూడదని దేవరాజ్ అతని భార్యకు తేల్చి చెప్పాడు. నా గురించి తెలిసినా దేవరాజ్ పట్టించుకోవడం లేదని తెలుసుకున్న విమల్ కుమార్ తరచూ దేవరాజ్ ఇంటికి వెళ్లి అతని భార్య శరణయతో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు.

భర్త పేరుతో రూ. 10 లక్షలు ఇన్సూరెన్స్

భర్త పేరుతో రూ. 10 లక్షలు ఇన్సూరెన్స్

ఈ విషయంలో రగిలిపోయిన దేవరాజ్ అతని భార్య శరణ్యను చితకబాదేశాడు. ఇంకోసారి ఇలా చేస్తే చంపేస్తానని దేవరాజ్ అతని భార్య శరణ్యకు వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సమయంలో దేవరాజ్ విమల్ కుమార్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయమై దేవరాజ్, శరణ్య దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ కారణంగా, విమల్ కుమార్ శరణ్య ఇద్దరూ దేవరాజ్ ను చంపేయాలని అనుకున్నారు. రెండేళ్ల క్రితం దేవరాజ్ అతని పేరుతో రూ. 10 లక్షల రూపాయలకు బీమా చేశాడు.దేవరాజ్ ను చంపేస్తే భీమా డబ్బులు మొత్తం తనకు వస్తోందని శరణ్య అనుకుంది.

భర్త హత్యకు ప్రియుడితో స్కెచ్ వేసిన భార్య

భర్త హత్యకు ప్రియుడితో స్కెచ్ వేసిన భార్య

గతేడాది రాశిపురం ప్రాంతంలో కిరాయి హంతకుడిని పెట్టుకుని దేవరాజ్ ను హత్య చెయ్యాలని ప్లాన్ వేశారు. కిరాయి హంతకుడు మరో కేసులో అరెస్టు కావడంతో ఆ రోజు దేవరాజ్ బతికిపోయాడు. తరువాత దేవరాజ్, శర్యల గొడవ కొనసాగింది. విమల్ కుమార్ తనకు తెలిసిన కుమారపాళ్యం ప్రాంతానికి చెందిన మెకానిక్ గోపాలకృష్ణతో మాట్లాడి దేవరాజ్ హత్యకు సహకరించాల్సిందిగా కోరాడు. దేవరాజ్ ను హత్య చేసిన తరువాత అతని బీమా సొమ్ము వస్తుందని, తరువాత నీకు డబ్బులు ఇస్తానని చెప్పిన విమల్ కుమార్ అతనితే డీల్ కుదుర్చుకున్నాడు.

పక్కాప్లాన్ తో భర్త హత్య

పక్కాప్లాన్ తో భర్త హత్య

ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం పని ఉందని విమల్‌కుమార్ దేవరాజ్ ను అప్పూరుపాళ్యంలోని అటవీ ప్రాంతానికి పిలిచాడు. అక్కడికి వచ్చిన దేవరాజ్‌ను కిరాయి హంతకులు గొంతు కోసి కత్తితో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారైనారు.శరణ్య సెల్ ఫోన్ ను పరిశీలించగా, విమల్‌కుమార్‌తో ఆమె నిత్యం మాట్లాడదిందని వెలుగు చూసింది. దేవరాజ్ ఫోన్‌ను పరిశీలించగా అతను నిత్యం ఓ మహిళతో మాట్లాడుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

నాటకాలు ఆడిన భార్య అందర్

నాటకాలు ఆడిన భార్య అందర్

దేవరాజ్ ను హత్య చెయ్యడానికి అతని భార్య శరణ్య ఆమె బాయ్ ఫ్రెండ్ విమల్ కుమార్‌తో కలిసి కిరాయి హంతకులను పంపించదని వెలుగు చూసింది. దళాన్ని నియమించినట్లు తేలింది. అంతకు ముందు భర్త దేవరాజ్ మృతదేహం ఆసుపత్రిలో ఉన్నప్పుడు, అతని భార్య శరణ్య ఏడుస్తూ అక్కడ భర్త శవం పక్కన, మూర్ఛపోయినట్లు నటించింది. అయితే పోలీసుల విచారణలో మ్యాటర్ మొత్తం బయటకు రావడంతో శరణ్య, ఆమె ప్రియుడు విమల్ కుమార్, మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దేవరాజ్ ను హత్య చేసిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+