వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చదువురాని ఐటం గర్ల్ రాఖీ సావంత్ ఆస్తులు 15 కోట్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: రాష్ట్రీయ ఆమ్ పార్టీని స్థాపించిన బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ తన ఆస్తులను ప్రకటించారు. ఆమె వాయువ్య ముంబై నుండి ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు. తన ఆస్తులు రూ.14.69 కోట్లుగా రాఖీ పేర్కొన్నారు.

ఇందులో స్థిరాస్తులు రూ.11.12 కోట్లు, చరాస్తులు రూ.3.57 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు రూ.2.52 కోట్ల అప్పులు ఉన్నాయని, తనపై ఓ చీటింగ్ కేసు నమోదయిందని వెల్లడించింది. కాగా, తాను నిరక్షరాస్యురాలినని ఎన్నికల అఫిడవిట్లో రాఖీ పేర్కొనడం గమనార్హం.

తన చేతిలో రూ.96,427 ఉన్నాయని, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ.39.13 లక్షలు, పోస్టల్ మరియు ఇన్సురెన్స్ కంపెనీల్లో రూ.2.12 కోట్లు, బాండ్స్ అండ్ షేర్లలో రూ.61.26 కోట్లు, రూ.21 లక్షల విలువైన ఫోర్డ్ ఎండీవర్ కారు, రూ.7.55 లక్షల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు.

రాఖీ సావంత్

రాఖీ సావంత్

బాలీవుడ్ ఐటెం భామ రాఖీ సావంత్ రాజకీయ పార్టీ స్థాపించిన మరీ ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తన పార్టీ పేరు రాష్ట్రీయ ఆమ్ పార్టీ(రాప్).

రాఖీ సావంత్

రాఖీ సావంత్

ఇటీవలే ముంబైలో తన పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. తన వ్యక్తిత్వానికి అనుగుణంగానే తన పార్టీ గుర్తును పచ్చి మిరపకాయగా నిర్ణయించారు.

రాఖీ సావంత్

రాఖీ సావంత్

మహారాష్ట్రలోని వాయువ్య ముంబై నుంచి లోకసభ ఎన్నికలకు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతేగాక తాను ప్రస్తుతం అనాథ రాజకీయ నాయకురాలిని లేదా స్వతంత్ర అభ్యర్థిని అని చెప్పుకున్నారు.

రాఖీ సావంత్

రాఖీ సావంత్

ప్రస్తుతం తాను తన సొంత పార్టీని కలిగి ఉన్నానని తెలిపారు. తాను తన పార్టీకి ఉపాధ్యక్షురాలినని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీని పోలివుంది కదా అని మీడియా ప్రశ్నించగా.. తన పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా తేడా ఉంటుందని చెప్పారు.

రాఖీ సావంత్

రాఖీ సావంత్

తాను త్వరలోనే తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తానని రాఖీ సావంత్ తెలిపారు. తాను పేద ప్రజల కోసం, మహిళల భద్రత కోసం కృషి చేస్తానని చెప్పారు.

రాఖీ సావంత్

రాఖీ సావంత్

అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే తన చివరి రక్తంబొట్టు పోయే వరకూ పేద ప్రజల అభివృద్ధికి కోసం పాటుపడతానని తెలిపారు. కాగా, రాఖీ సావంత్ పార్టీకి ఆఫీస్ బేరర్లుగా, ఫండ్ రైజర్లుగా స్థానిక వ్యాపారులే ఉండటం గమనార్హం. ఆ వ్యాపారుల భార్యలు పార్టీ మహిళా విభాగానికి నాయకత్వం వహించనున్నట్లు తెలిసింది.

English summary
Lok Sabha Election 2014 - Bollywood starlet Rakhi Sawant who is contesting from Mumbai Northwest seat has declared herself an "illiterate" with total assets of Rs 14.69 crore. Rakhi (36), who is taking on heavyweights like Gurudas Kamat of Congress and Gajanan Kirtikar of Shiv Sena from the constituency, has movable property worth Rs 3.57 crore and immovable assets worth Rs 11.12 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X