హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉత్తర, ఈశాన్యంలోనూ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు దక్షిణ భారతదేశంతోపాటు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.

ఏపీ, తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

సెప్టెంబర్ 6-7 తేదీల్లో అల్పపీడన ప్రాంతం లేదా దాని అవశేష తుఫాను ప్రసరణ పశ్చిమ-వాయువ్య దిశ ప్రభావంతో దక్షిణ ఒడిశా, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో చాలా వరకు విస్తారమైన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఉత్తర మరాఠ్వాడ, ఉత్తర మధ్య మహారాష్ట్ర, ఉత్తర కొంకణ్, గుజరాత్ ప్రాంతం సెప్టెంబర్ 7-9 మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 7-8 మధ్య ఉత్తర కొంకణ్‌లో, సెప్టెంబర్ 8న మధ్య మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలలో, సెప్టెంబర్ 7 న తెలంగాణాలో కూడా భారీ భారీ వర్షపాతాలు నమోదుకావచ్చని తెలిపింది. సెప్టెంబర్ 7-9 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర పంజాబ్, జమ్మూ ప్రాంతం, తూర్పు రాజస్థాన్‌లలో భారీ వర్షాలు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో విస్తారంగా వానలతో వర్షపాతం పెరిగే అవకాశం ఉంది.

ఆగస్టులో వర్షపాతం లోటును సెప్టెంబర్ తీర్చేస్తోంది

ఆగస్టులో వర్షపాతం లోటును సెప్టెంబర్ తీర్చేస్తోంది

ఆగస్టులో వర్షపాతం తక్కువగా నమోదైన తరువాత..సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాన్ని అంచనా వేసింది భారత వాతావరణ శాఖ. ఆగస్టు 31 వరకు వర్షపాతం లోటు తొమ్మిది శాతం ఉండగా, సెప్టెంబర్ 5 వరకు లోటు తొమ్మిది శాతానికి తగ్గింది. సెప్టెంబర్‌లో తన సూచనను జారీ చేస్తున్నప్పుడు.. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృతుంజయ్ మొహపాత్రా మాట్లాడుతూ.. ఆగస్టులో నమోదైన లోటు ప్రస్తుత నెలలో అధిక వర్షపాతంతో భర్తీ చేయబడుతుందని చెప్పారు. భారతా వాతావరణ శాఖ అతి భారీ వర్షాలను అంచనా వేసిన తరువాత గోవా అధికారులు అప్రమత్తమయ్యారు. రాబోయే రెండు రోజుల్లో కోస్తా రాష్ట్రంలో చాలా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసిన ఒక రోజు తర్వాత ఆదివారం గోవా పరిపాలన విభాగం అప్రమత్తంగా ఉందని అధికారులు తెలిపారు.

Recommended Video

Ajinkya Rahane ని సైడ్ చేసి Surya Kumar Yadav ని లాగేయ్యండి!! || Oneindia Telugu
గోవాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్టాలు, అప్రమత్తం

గోవాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్టాలు, అప్రమత్తం

గోవా రాజధాని పనాజీ, రాష్ట్రంలోని ఇతర నగరాలలో ఉదయం నుంచీ ఆకాశం మేఘావృతమై ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర గోవా జిల్లా పరిపాలన విభాగం నుంచి ఒక సీనియర్ అధికారి కంట్రోల్ రూమ్‌లు యాక్టివ్ చేయబడ్డాయని తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాలలో వరదలు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

గత నెల అనుభవం తర్వాత, అనేక ప్రదేశాలు వరదలు సంభవించినప్పుడు (భారీ వర్షాల కారణంగా), తాము అప్రమత్తంగా ఉన్నామని అధికారి చెప్పారు. రానున్న 48 గంటల్లో దక్షిణ కొంకణ్, గోవాలో రుతుపవనాల కార్యకలాపాలు బలపడవచ్చునని, ఉత్తర వాతావరణంలో, మధ్య బంగాళాఖాతం చుట్టూ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. సెప్టెంబర్ 6, 7న గోవా జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల చాలా భారీ వర్షపాతం (24 గంటల్లో 11.5 సెంటీమీటర్లకు మించి) నమోదయ్యే అవకాశం ఉంది. గోవా జిల్లాల్లో సెప్టెంబర్ 4 నుంచి ఒక వారం పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గోవా తీర ప్రాంతాల్లో ఉరుములుమెరుపులు, ఈదురుగాలులతో కూడి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.

English summary
IMD forecast: Heavy rainfall in parts of south States AP, telangana, Karnataka KL, to west, north India in next 3 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X