దేశంలోని ఈ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్: IMD

న్యూఢిల్లీ: వేసవి కాలం ప్రారంభమైన క్రమంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. మరింత ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతాం మినహా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవయ్యే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ(IMD) శనివరాం వెల్లడించింది.

ఈ కాలం మధ్య తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంచాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.

IMD says, most parts of India to witness above normal temperature from April-June

ఏప్రి్ల నుంచి జూన్ వరకు దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. మిగితా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే ఉంటాయని పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ నెలలో వర్షపాతం సాధారణంగానే ఉండనుందని తెలిపారు.

మధ్య వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని.. తూర్పు, ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+