బెంగళూరులో నిషేధాజ్ఞాలు, దసరా పల్లకీల సందర్బంగా ముస్లీంల ఏరియాలో అమలు !
కర్ణాటక రాష్ట్రంలోని హిందువుల ఎంతో వైభవంగా జరుపుకున్న వినాయక చవితి పండుగ సందర్బంగా జరిగిన వినాకుడి విగ్రహాల ఊరేగింపు సందర్బంలో ముస్లిం సమాజానికి చెందిన ఈద్ మిలాద్ సందర్భంగా కోలార్, శివమొగ్గతో సహ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మతపరమైన అల్లర్లు జరిగాయి. వినాయక చవితి సందర్బంగా వినాయకుడి విగ్రహాల ఊరేగింపు సందర్బంగా హిందువుల, ముస్లీం సోదరుల మధ్య జరిగిన గొడవలు మళ్లీ జరగకుండా చూడాలని సిద్దరామయ్య ప్రభుత్వం అప్పట్లోనే కర్ణాటక డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
బెంగుళూరులో జరుగుతున్న దసరా పల్లకీల పండుగ సందర్భంగా ముస్లీంలు అధికంగా ఉండే ప్రాంతంలో మతఘర్షణలు జరిగే అవకాశం ఉందని, ఆ సందర్బంలో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయని తెలుసుకున్న పోలీసు అధికారులు బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ ( నిషేధాజ్ఞలు) అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

బెంగళూరు నగరంలోని పులికేశీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడ్డగుంట ప్రాంతంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు పులికేశీ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధాజ్ఞాలు ( 144 సెక్షన్ ) అమలు చేయాలని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
ఈ సమయంలో దసరా పండుగ యొక్క అన్ని పల్లకీ ఉత్సవాలు జరుగుతాయి. పల్లకీల ఉత్సవాన్ని చూసేందుకు వేలాది మంది వస్తుంటారు. అందుకే అల్లర్లు జరగకుండా కర్ఫ్యూ విధించారు. పులికేశీ నగర్ లో దసరా పల్లకీల ఉత్సవాల సందర్భంగా కొందరు మద్యం సేవించి అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందన్న అనుమానంతో నిషేధాజ్ఞలు అమలు చేశారు. ఈ నిషేధాజ్ఞల సమయంలో మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి.
దసరా పల్లకీల పండుగ పూర్తయ్యే వరకు పులికేశీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాల్లో మద్యం అమ్మకాలు నిఫేధించారు. అదే విదంగా ఇతర మతాల వారు గుమిగూడడం నిషేధించామని, ఎవరైన నియమాలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ దయానంద్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications