2 గంటల్లోనే యాసిడ్ దాడి బాధితురాలికి రూ. 16.5 లక్షల సహయం
ఓ యాసిడ్ బాధితురాలికి ఫేస్‌బుక్ వేదికగా చేసిన వినతికి రెండు గంటల్లోనే రూ. 16.5 లక్షల ఆర్థిక సహయం అందింది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకొంది.
ముంబై: ఓ యాసిడ్ బాధితురాలికి ఫేస్‌బుక్ వేదికగా చేసిన వినతికి రెండు గంటల్లోనే రూ. 16.5 లక్షల ఆర్థిక సహయం అందింది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకొంది.
ముంబైలోని నేరుల్ నివాసి మబియా మండల్‌పై ఐదేళ్ళ క్రితం ఆమె భర్తే యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. శ్రేయోభిలాషులు, స్నేహితులు అందించిన సహకారంతో ఆమె ప్రాణాపాయం నుండి బయటపడింది.
స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం కూడ ఆమెకు ఉచితంగా చికిత్స చేశారు. ఆమె వయస్సు 25 ఏళ్ళు. అయితే మరిన్ని సర్జరీలు చేయాల్సి రావడంతో దాతల కోసం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

హ్యమన్స్ ఆఫ్ బాంబే గ్రూప్ ఈ ఫేస్‌బుక్‌లో ఈ పోస్టు చేసింది. దీంతో రెండున్నర గంటల్లోనే బాధితురాలికి రూ. 16.5 లక్షల సహయం అందింది.
వీటిలో సర్జరీ ఖర్చులు పోను ఇంకా నిధులు కావాల్సి ఉంటే మరోసారి ప్రచారం నిర్వహిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.












Click it and Unblock the Notifications