ఉద్యోగస్తులకు రిలీఫ్ : మరోసారి కోవిడ్ అడ్వాన్స్ తీసుకునేందుకు ఈపీఎఫ్‌ఓ అనుమతి
కరోనావేళ ఉద్యోగస్తులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం గతేడాది మార్చిలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదంతా ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజ్ కింద వెసులుబాటు కల్పించడం జరిగింది.ఇందుకోసం చట్టసవరణ కూడా చేయడం జరిగింది. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా మరోసారి దీన్ని వినియోగించుకోవాలని కేంద్రం కోరింది. దీనికింద ఉద్యోగస్తుల అడ్వాన్స్‌గా మూడు నెలలవరకు మూలవేతనం, డీఏలు లేదా వారి ఈపీఎఫ్ ఖాతాలో 75శాతం వరకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. ఈ రెండిటిలో ఏది తక్కువగా ఉంటే అదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ డబ్బులు నాన్ రీఫండబుల్ అని కేంద్రం చెప్పింది.
కరోనా సమయంలో నెలకు రూ.15వేలు లేదా అంతకంటే తక్కువగా వేతనం ఉన్న ఉద్యోగస్తులకు ఇదిచాలా ఉపయోగపడిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు కేంద్రం 7.6 మిలియన్ దరఖాస్తులకు కోవిడ్ అడ్వాన్స్‌లను చెల్లించింది. ఈ మొత్తం 18,698 .15 కోట్లుగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇక కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా మళ్లీ అదే ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో మళ్లీ కేంద్రం ముందుకొచ్చింది.

కరోనా సెకండ్ వేవ్‌లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో చాలామంది ఉద్యోగస్తులు ఆర్థికంగా చితికిపోతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే వారిని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు మరోసారి ఈ అడ్వాన్సులను చెల్లించేందుకు ఈపీఎఫ్‌ఓ ముందుకొచ్చింది. ఇప్పటికే కోవిడ్-19 ఫస్ట్ వేవ్ అడ్వాన్సులు పొందిన వారు సెకండ్ వేవ్ అడ్వాన్సులను కూడా తీసుకోవచ్చని వెల్లడించింది.
ఈ కష్టకాలంలో ఉద్యోగస్తులను ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా కోవిడ్ క్లెయిమ్స్ దరఖాస్తులను ప్రాసెస్ చేయడంలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం ఈపీఎఫ్‌ఓ ఉన్నతాధికారులకు సూచించింది. దరఖాస్తు అందిన మూడురోజుల్లోనే ఆ డబ్బులు ఉద్యోగస్తుల ఖాతాలోకి బదిలీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే ఈ సెటిల్‌మెంట్ ప్రక్రియ విజయవంతంగా పూర్తికావాలంటే కేవైసీ డాక్యుమెంట్లు ఇతరత్రా డాక్యుమెంట్లు అన్ని సరైనవిగా ఉండాలని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ఆటో క్లెయిమ్ వ్యవస్థను తీసుకొచ్చింది.












Click it and Unblock the Notifications