వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యలో తమ స్థలంలో మసీదు నిర్మాణానికి ఆలయ ట్రస్ట్ అంగీకారం

|
Google Oneindia TeluguNews

అయోధ్య: అయోధ్యలోని శిథిలావస్థలో ఉన్న మసీదు నిర్మాణానికి హిందువులు ముందుకు వచ్చారు. మూడు వందల ఏళ్ళనాటి ఆలంగిరి మసీదు పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు స్థానిక పురపాలక సంఘం నోటీసులు ఇచ్చింది. దీనిలోనికి ఎవరూ ప్రవేశించవద్దని చెప్పింది.

మొఘలు చక్రవర్తి ఔరంగజేబు అనుమతితో పదిహేడో శతాబ్దంలో ఈ మసీదును నిర్మించారు. ఈ మసీదు ప్రాంతం.. హనుమాన్‌గర్హి దేవాలయ స్వాధీనంలో ఉంది. ఈ మసీదు శిథిలావస్థలో ఉండటంతో చాలాకాలం నుంచి ఇక్కడ నమాజు జరగడం లేదు.

In Ayodhya, temple trust to rebuild mosque on

స్థానిక ముస్లీంలు హనుమాన్‌గర్హి దేవాలయం ప్రధాన పూజారి మహంత్ జ్ఞాన్ దాస్‌ను కలిశారు. మసీదు పునర్నిర్మాణానికి సహకరించాలని కోరారు. దీంతో ఆలయ ట్రస్ట్ ఈ ఆలయం సమీపంలో దానిని పునర్ నిర్మించాలని నిర్ణయించారు.

పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చులను భరిస్తామని దేవాలయం ట్రస్ట్ తెలిపింది. మహంత్ మాట్లాడుతూ.. మసీదును పునర్నిర్మించుకోవచ్చునని, అందుకు అయ్యే ఖర్చులు భరిస్తామని ముస్లిం సోదరులకు చెప్పానని తెలిపారు. ఇది కూడా దేవుడి ఆలయమే కాబట్టి, నమాజు చేసుకొనేందుకు అభ్యంతరం లేదన్నారు. తాను రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇస్తుంటానని చెప్పారు.

English summary
There is a twist in the Ayodhya tale, and it's one that shows that despite the Babri Masjid demolition 24 years ago by Hindutva brigades, communal harmony is alive and well in what Hindus believe to be the birthplace of Lord Ram!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X