సీఎస్ 8.. కమిషనర్ 789... మరణాల సంఖ్యలో తేడా.. హైకోర్టు సీరియస్

యూపీ తర్వాత బీహర్‌లో గల గంగానదీ తీరం గుండా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు కొట్టుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ దుమారం కొనసాగుతోన్న వేళ.. మృతదేహాలకు సంబంధించి ఒక్కో దర్యాప్తు సంస్థ ఒక్కో సంఖ్య చెబుతోంది. దీనిపై పాట్నా హైకోర్టు సీరియస్ అయ్యింది. దీనిపై నివేదిన సమర్పించాలని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది. రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని స్పష్టంచేసింది.

In Bihar, Court Slams Glaring Discrepancies In Covid Death Numbers

కరోనా మరణాలకు సంబంధించి చీఫ్ సెక్రటరీ తిరుపతి శరణ్, పాట్నా డివిజనల్ కమిషనర్ ఒక్కొ రిపోర్ట్ అందజేశారు. బక్సర్‌లో 70 మృతదేహాలు కొట్టుకువచ్చాయి. కానీ నివేదిక మాత్రం మరోలా ఉంది. దీనిపై చీఫ్ జస్టిస్ సంజయ్ కరోల్ అసహనం వ్యక్తం చేశారు. మార్చి 1వ తేదీ నుంచి బక్సర్‌లో 8 మృతదేహలు మాత్రమే కొట్టుకువచ్చాయని సీఎస్ పేర్కొన్నారు. డివిజనల్ కమిషనర్ మాత్రం 789 అని చెప్పారు. ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు అని పేర్కొన్నారు.

దీంతో కరోనా మరణాలకు సంబంధించి క్లారిటీ లేకుండా పోయింది. బక్సర్‌లో 17 లక్షల మంది ఉన్నారు. 10 రోజుల్లో 789 మంది చనిపోతే.. జిల్లా వ్యాప్తంగా ఎందరు చనిపోతారని ప్రశ్నించారు. ఆరుగురు మాత్రం కరోనాతో చనిపోయారని సీఎస్ పేర్కొన్నారు. 789 మంది నాన్ కోవిడ్ అని కమిషనర్ ఎక్కడ చెప్పలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+