వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకుల రుణాల ఎగవేత, ఆర్థిక మోసాలు: కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వరుస బ్యాంక్ రుణాల ఎగవేత కేసులు, ఆర్థిక మోసాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ 50 కోట్ల పైబడిన రాని బాకీలపై దృష్టి సారించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక శాఖ కోరింది.

రుణాలు తీసుకున్న వారు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినట్టు గమనిస్తే దర్యాప్తు ఏజెన్సీల సహకారం తీసుకోవాలని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకు మోసాలు, ఉద్దేశపూరిత ఎగవేతలను ఎప్పటికప్పుడు గుర్తించి, ఆయా కేసులను సీబీఐకి నివేదించాలని కోరారు.

నిరర్థక ఆస్తులుగా మారిన ఖాతాలకు సంబంధించి సెంట్రల్‌ ఎకనామిక్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో నుంచి బ్యాంకులు రుణగ్రహాత స్టేటస్‌ రిపోర్టును పొందాలని సూచించారు. అంతేగాక, నిర్వహణ సవాళ్లు, సాంకేతిక రిస్క్‌లను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యేలా ప్రభుత్వ రంగ బ్యాంకులు 15 రోజుల్లోగా బ్లూప్రింట్‌ను రూపొందించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ పీఎస్‌యూ బ్యాంకులకు స్పష్టం చేసింది.

English summary
All bad loan cases above Rs. 50 crore at public sector banks will be examined for fraud. This was said in a tweet by Financial Services Secretary Rajeev Kumar. "PSB (public sector bank) MDs directed to detect bank frauds & consequential wilful default in time and refer cases to CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X