Loan App: రుణ యాప్ లో లోన్ తీసుకున్న బ్యాంక్ ఉద్యోగి.. కట్ చేస్తే రైలు పట్టాలపై శవమై కనిపించాడు..
లోన్ యాప్ సిబ్బంది బరితెగిస్తున్నారు. లోన్ తీసుకున్న వారిని వేధిస్తూ వేయించుకు తింటున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వారి పద్ధతి మాత్రం మారడం లేదు. దీంతో లోన్ యాప్ వేధింపులతో బాధితులు ఆత్మహత్యాలు చేసుకుంటున్నారు. 20 రోజుల క్రితం ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ వివాహిత లోన్ యాప్ లో రుణం తీసుకుంది.

పెరుగుతోన్న ఆత్మహత్యలు..
లోన్ మొత్తం చెల్లించినా రుణ యాప్ ఏజెంట్లు వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో లోన్ యాప్ వేధింపులు బరించలేకు అగ్నిమాపక శాఖలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా లోన్ యాప్ వేధింపులకు గతంలో చాలా మంది బలైపోయారు. తాజాగా పక్క రాష్ట్రంలో కర్ణాటకలో లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి బలవన్మరణం చెందాడు.

మొదటగా రూ.3 వేల లోన్..
కెంగరీ జిల్లాలోని దొడ్డగొల్లారహట్టి గ్రామానికి చెందిన టీ నంద కుమార్(52) అనే వ్యక్తి కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక మొదట లోన్‌యాప్ ద్వారా రూ.3వేలు అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత లోన్ మరో లోన్ యాప్ లో లోన్ తీసుకున్నాడు. ఇలా రుణ యాప్ ల ఉచ్చులో పడ్డాడు.

మహిళ వద్ద రూ.3.6 లక్షల అప్పు..
నంద కుమార్ ఇలా వివిధ యాప్‌ల ద్వారా మొత్తం రూ.36,704 రుణం తీసుకున్నాడు. వాటిని వసూలు చేసుకునేందుకు యాప్ ప్రతినిధులు అసభ్యకర మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ట్రైన్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతను లోన్ యాప్ లో కాకుండా ఓ మహిల వద్ద కూడా అప్పు చేసినట్లు ఆమె కేసు పెట్టింది. తన వద్ద రూ.3.6 లక్షల అప్పు చేశాడని, కేవలం రూ.1.5 లక్షలు చెల్లించినట్లు
ఆమె తెలిపింది.

46 లోన్‌యాప్‌లు
నంద కుమార్ యాప్‌తో పాటు తనకు డబ్బులు ఇచ్చిన స్థానికుల వేధింపులు తట్టుకోలేకే జీవితాన్ని ముగిస్తున్నానని సూసైడ్ నోట్ రాశాడు. పోలీసులు 46 లోన్‌యాప్‌లు సహా మహిళపై కేసు నమోదు చేశారు. నలుగురికి చెప్పాల్సిన ఓ బ్యాంకు ఉద్యోగి లోన్‌యాప్ ఉచ్చులో పడి చనిపోవటం గమనార్హం.












Click it and Unblock the Notifications