తండ్రి మృతదేహాన్ని 32 భాగాలు చేసి బోరు బావిలో పడేశాడు.. తర్వాత..!
దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యను మరవక ముందే ఇలాంటి హత్య మరొకటి జరిగింది. అయితే ఇక్కడ ఓ కొడుకు తండ్రిని చంపి 32 ముక్కలుగా చేశాడు. కర్ణాటకలోని ముధోల్ పట్టణ శివారు ప్రాంతానికి చెందిన పరుశరామ్ అనే వ్యక్తికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిసైన పరుశురామ్ వేధింపులకు తాళలేక భార్య, పెద్ద కుమారుడు వేరే చోటు ఉండగా.. చిన్న కుమారుడు విఠల్ కులాలీ తండ్రితో ఉంటున్నాడు.
పరుశురామ్ తాగేసి వచ్చి రోజూ విఠల్‌ను వేధించేవాడు. ఈ క్రమంలో డిసెంబరు 6న పరుశురామ్ మద్యం సేవించి వచ్చాడు.
కొడుకుని తిట్టడం ప్రారంభించాడు. దీంతో ఆవేశానికి లోనైన విఠల్ కోపంతో ఇనుప రాడ్‌తో తండ్రిపై దాడి చేశాడు.
హత్య చేశాడు. తీవ్ర గాయమైన పరుశురామ్ చనిపోయాడు. విఠల్ కు ఏం చేయాలో అర్థ కాలేదు. చివరికి మృతదేహాన్ని బయట పడేయాలని అనుకున్నాడు.

కానీ డెడ్ బాడీ తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. ఆ తర్వాత బాడీని ముక్కలుగా చేయాలని విఠల్ కు ఆలోచన వచ్చింది. ఇంట్లో రంపం కనిపించడంతో మృతదేహాన్ని రంపంతో కోసి 32 భాగాలు చేశాడు. వాటిని సంచిలో వేసి బాగల్‌కోట్ జిల్లాలోని ముధోల్, నగర శివార్లలో మంటూరు బైపాస్ సమీపంలో ఉన్న తమ పొలంలో వద్దకు తీసుకెళ్లాడు. ఆ 32 ముక్కలను బోరు బావిలో పడేశాడు.
బోరు బావి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో పరుశురామ్ కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణ చేపట్టిన పోలీసులు విఠల్ విచారించగా.. తన తండ్రి చంపింది తానేని ఒప్పుకున్నాడు. దీంతో మృతదేహం భాగాలను బోరుబావి నుంచి బయటకు తీయడానికి జేసీబీ సాయంతో సమాంతరంగా గొయ్యి తవ్వించారు. శరీర భాగాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు.












Click it and Unblock the Notifications