వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బురఖా ధరించి డ్యాన్స్ చేసిన విద్యార్థినిలు.. సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్..

|
Google Oneindia TeluguNews

ఓ కాలేజీకి చెందిన నలుగురు విద్యార్థులు బురఖా ధరించి డ్యాన్స్ చేయడంతో హిజాబ్ పై మళ్లీ చర్చ మొదలైంది. మంగుళూరులోని సెయింట్ జోసెఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో నలుగురు విద్యార్థులు బురఖా ధరించి డ్యాన్స్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్


ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరు బురఖాలు ధరించి డ్యాన్స్ చేయడం.. ప్రజల మధ్య మతసామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ఇంత జరుగుతుంటే కళాశాల యాజమాన్యం ఏం చేస్తోందని మండిపడుతున్నారు. బురఖా ధరించి డ్యాన్స్ చేసిన విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు

ట్వీట్

ట్వీట్


సెయింట్ జోసెఫ్ ఇంజినీరింగ్ కాలేజ్, మంగళూరు వారు తమ అధికారిక ట్విట్టర్ లో గురువారం ట్వీట్ చేశారు. "సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియో క్లిప్, ముస్లిం సమాజానికి చెందిన విద్యార్థుల నృత్యం చేశారు. విద్యార్థుల సంఘం ప్రారంభోత్సవంలో అనధికారిక భాగం. ఇది ఆమోదించబడిన ప్రోగ్రామ్‌లో భాగం కాదు. పాల్గొన్న విద్యార్థులను సస్పెండ్ చేశాం " అని ట్వీట్ చేసింది.

పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్


"కమ్యూనిటీలు, అందరి మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే ఏ కార్యకలాపాలకు కళాశాల మద్దతు ఇవ్వదు అని ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధీర్ ఎం కూడా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ హౌరాలోని ధులాగోరిలో ఉన్న ఒక ప్రభుత్వ విద్యాసంస్థలో ఇంటర్​ సెకండియర్​ చదువుతున్న పలువురు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు.

కండువాలు

కండువాలు


తమను తరగతి గదిలోకి అనుమతించాలని పాఠశాల నిర్వాహకులను కోరారు. హిజాబ్ ధరించిన పలువురు విద్యార్థినులను తరగతి గదిలోకి అనుమతించినప్పుడు.. కాషాయ కండువాలతో తమను కూడా అనుమతించాలని వారు ప్రశ్నించారు. ఈక్రమంలో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు.

English summary
The debate on hijab started again when four students from a college danced wearing burqa. Four students of St. Joseph's Engineering College in Mangalore danced wearing burqas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X