ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ, జెండా ఎత్తేసిన బడ్జెట్ లోని నిధులు, ఎన్నికల వరకు అయినా ?
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన శక్తి పథకం ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది, దీని ద్వారా ఇప్పటికే కోట్లాది మంది మహిళలు కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సేవలను పొందుతున్నారు. ప్రతిష్టాత్మక శక్తి ప్రాజెక్టు పథకానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్‌లో కేటాయించిన సొమ్ము కేవలం ఆరు నెలల్లోనే ఖాళీ అయిపోయిందని వెలుగు చూసింది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్‌లో శక్తి పథకం కోసం రూ. 2,800 కోట్లు కేటాయించినప్పటికీ నవంబర్ 5వ తేదీ వరకు మహిళా ప్రయాణికుల జీరో టిక్కెట్ ప్రయాణం చెయ్యడంతో రూ. 2,143 కోట్లు ఖర్చు అయిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కావడానికి ఇంకా ఐదు నెలల సమయం ఉందని, బడ్జెట్‌లో కేటాయించిన నిధులు డిసెంబరు వరకు మాత్రమే వస్తాయని కేఎస్ఆర్ టీసీ, బీఎంటీసీ రవాణా సంస్థలు అంటున్నాయి.

శక్తి పథకం నిధులు కేటాయించకపోవడంపై కర్ణాటక రవాణా శాఖా మంత్రి రామలింగా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శక్తి పథకం కోసం డిసెంబర్‌లో మరిన్ని నిధులు కేటాఇస్తామని, డిసెంబర్ వరకు ఇచ్చే మొత్తం టిక్కెట్ల విలువను పరిగణనలోకి తీసుకుని మరిన్ని నిధులు కేటాయిస్తాం అని, ఎవ్వరూ ఆందోళన చెందనవసరం లేదని ఆయన వివరించారు.
ఈ విషయం గురించి కేఎస్ఆర్ టీసీకి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ శక్తి పథకం అమలులోకి వచ్చిన కొద్ది నెలల తర్వాత ఉచిత బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గవచ్చని మాతో పాటు చాలా మంది అంచనా వేశామని, కానీ మహిళా ప్రయాణికుల సంఖ్య స్థిరంగా ఉందని, శక్తి పథకానికి ఇంత మంచి స్పందన వస్తుందని ఎవ్వరూ ఊహించలేదని, ఈ పథకానికి ఇంకా నిధులు పెంచాలని అంటున్నారు.
కాంగ్రెస్ శక్తి పథకం కోసం సిద్దరామయ్య ప్రభుత్వం కేటాయించిన నిధులు ఆరు నెలల్లో ఖాళీ అయిపోయాయని, ఈ లెక్కన చూస్తే అనుమానం వస్తోందని కర్ణాటక బీజేపీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ శక్తి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తిమింగలాలు ఆరు నెలల్లోనే ముగించాయని, ఒక సంవత్సరానికి కేటాయించిన శక్తి పథకం డబ్బు ఆరు నెలల్లో అయిపోయింది అంటే కాంగ్రెస్ లో ఎంత పెద్ద తిమింగలాలు ఉన్నాయో అర్థం అవుతోందని బీజేపీ నాయకులు ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలపై కర్ణాటక బీజేపీ నాయకత్వం దుయ్యబట్టింది. వరుస ట్వీట్లు చేసిన కర్ణాటక బీజేపీ సిద్దరామయ్య ప్రభుత్వంలోని మంత్రులు, నాయకుల మీద విరుచుకుపడింది. కర్ణాటకలో ఇప్పటి వరకు 10 కిలోల ఉచిత రేషన్ అమలు చేయలేదని, కేంద్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న 5 కిలోల బియ్యంలో 2 కిలోల బియ్యాన్ని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకున్నదని కర్ణాటక బీజేపీ ఆరోపించింది.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంటింటికీ 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని ఉచిత హామీలు ఇచ్చారని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరో కండిషన్ పెట్టారని, ఇప్పుడు సరైన కరెంటు ఇవ్వకుండా కర్ణాటక అంధకారంలో ఉందని బీజేపీ ఆరోపించింది. సార్ మీఫ్రీకరెంట్ మాకు వద్దు, మా కరెంటు మాకు ఇవ్వకండి అంటూ ప్రజలు నెత్తినోరు కొట్టుకుంటున్నారని బీజేపీ ఆరోపించింది.
కరెంట్ కోతలతో కర్ణాటక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రజల చెవిలో పూలు పెట్టి అధికారంలోకి వచ్చిందని, సిద్దరామయ్య ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చకపోతే ప్రజలతో కలిసి ఆందోళనకు దిగుతామని కర్ణాటక బీజేపీ శాఖ హెచ్చరించింది. అయితే లోక్ సభ ఎన్నికల పూర్తి అయ్యే వరకు శక్తి పథకం కొనసాగించాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని సమాచారం.
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications