Tomato Price: కిలో రూ.160 లకు చేరిన టమాటా.. తినడం కష్టమే..!
సామాన్యులకు కూరగాయల ధరలు చూసి భయపడి పోతున్నారు. ముఖ్యంగా టమాటా, పచ్చి మిర్చి రేట్లు చూసి వణికిపోతున్నారు. తాజాగా ఓ చోట కిలో టమాటా రూ.160 లకు చేరింది. మధ్యప్రదేశ్ లోని రాయ్ సెన్ జిల్లాలో ఆదివారం కిలో టమాటా రేటు రూ.160 పలికింది. ఇతర ప్రాంతాల్లో రూ.110 నుంచి 140 లకు చేరింది. దిగుబడి తగ్గడంతో టమాటాల కొరత ఏర్పడిందని రాయ్ సెన్ జిల్లా పాలనాధికారి అరవింద్ దూబే తెలిపారు.
గత గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధర రికార్డు ధర పలికింది. కిలో టమాటా రూ.124 లకు పెరిగింది. సాధారణంగా మదనపల్లె మార్కెట్ కు రోజుకు 1500 టన్నుల టమాటా వస్తుంది. పచ్చి మిర్చి అయితే ఏకంగా రూ.160 చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు మార్కెట్లలో పచ్చి మిర్చి ధర రూ.140 నుంచి రూ.160 పలుకుతోంది. జనలు పచ్చి మిర్చి కొనడమే మానేశారు.

కాకరకాయ రూ. 100, వంకాయ రూ. 80, బీరకాయ రూ.80, క్యారెట్ రూ.80, దొండకాయ రూ.80, ఉల్లిగడ్డ రూ.30, బెండకాయ రూ. 80, అలచంద రూ.80, దోసకాయ రూ.60, గోరుచిక్కుడ రూ. 80 గా ఉన్నాయి. అటు కోడికూర, కోడి గుడ్డు ధరలు కూడా బాగానే ఉన్నాయి. కిలో చికెన్ రూ.280 నుంచి రూ.300 పలుకుతోంది. కోడి గుడ్డు ఒకటి రూ.6 నుంచి రూ.7 గా ఉంది. కూరగాయల ధరలే కాదు.. ఉల్లి ధరలు కూడా పెరిగాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీతో రైతులకు టమాటాలు అందిస్తోంది. 50 రాయితీతో రైతు బజార్ల ద్వారా టమాటాలను అమ్ముతోంది. కడప, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చారు. కాగా త్వరలోనే ఈ పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించనుంది.












Click it and Unblock the Notifications