Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈసారి నార్థ్‌ఈస్ట్ బీజేపీకి పెద్ద సవాలే: ప్రత్యర్థులతోపాటు మిత్రపక్షాలతోనూ పోరాటం!

ఈశాన్య రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి పెద్ద సవాళ్లనే విసురుతున్నాయి. ఎందుకంటే.. ఈసారి త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ప్రత్యర్థులతోపాటు మిత్రపక్షాలతోనూ బీజేపీ పోరాడాల్సి వస్తోంది.

గౌహతి: ఈశాన్య రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి పెద్ద సవాళ్లనే విసురుతున్నాయి. ఎందుకంటే.. ఈసారి త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ప్రత్యర్థులతోపాటు మిత్రపక్షాలతోనూ బీజేపీ పోరాడాల్సి వస్తోంది. ఎందుకంటే.. మిత్రపక్షంగా ఉన్న పలు పార్టీలు ఇప్పుడు బీజేపీని వదిలి పోటీ చేస్తున్నాయి.

బీజేపీకి సవాలుగా ఈశాన్య రాష్ట్రా ల ఎన్నికలు

బీజేపీకి సవాలుగా ఈశాన్య రాష్ట్రా ల ఎన్నికలు

మూడు ఈశాన్య రాష్ట్రాలు - త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.త్రిపురలో రాజ కీయ వారసుడు ప్రద్యోత్ మాణిక్య దెబ్బర్మ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన టిప్ర మోతాతో పాటు లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా అధికార బీజేపీ పోరాడుతోంది. అయితే, మేఘాలయలో బీజేపీ.. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని మిత్రపక్షం ఎన్‌పీపీతో పోటీపడనుంది.

చీకటినిచ్చారంటూ త్రిపురలో అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు

చీకటినిచ్చారంటూ త్రిపురలో అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు

దక్షిణ త్రిపురలోని శాంతిర్‌బజార్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ప్రసంగించారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం)తో టిప్ర మోతాకు రహస్య అవగాహన ఉందని, రెండేళ్లుగా ప్రాంతీయ పార్టీలు "రహస్య అవగాహన" కలిగి ఉన్నాయని అమిత్ షా ఆరోపించారు. స్వదేశీ ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా రాష్ట్రంలో కమ్యూనిస్టు పాలనను తిరిగి తీసుకురావాలని చూస్తున్నారన్నారు. 'కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మోతా అంతా అవినీతిపరులు. కాంగ్రెస్ మీకు అంధకారాన్ని" (చీకటి) ఇచ్చింది; మేము మీకు 'అధికార్' (హక్కులు) ఇచ్చాము అని ప్రత్యర్థి పార్టీలపై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరంతా త్రిపురలో మళ్లీ కమలం వికసించేలా చేస్తారు అని ప్రజలనుద్దేశించి అన్నారు.

త్రిపురలో తిప్ర మోత అలజడి

త్రిపురలో తిప్ర మోత అలజడి

కాగా, తిప్ర మోత.. బీజేపీకి, కాంగ్రెస్-వామపక్ష కూటమికి నిజమైన సవాల్‌గా మారే అవకాశం ఉంది. ఈ పార్టీ 2021 త్రిపుర గిరిజన ప్రాంతాల అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (TTAADC) ఎన్నికల్లో విజయం సాధించింది. త్రిపురలోని 60 నియోజకవర్గాల్లో 42 స్థానాల్లో పోటీ చేయనుంది. దాదాపు 20 గిరిజన ఆధిపత్య స్థానాలు ఉన్నాయి. ఇవి రాష్ట్రంలో అధికారానికి కీలకం కానున్నాయి.

మేఘాలయలో.. మిత్రపక్ష సీఎంపైనే బీజేపీ పోరు

మేఘాలయలో.. మిత్రపక్ష సీఎంపైనే బీజేపీ పోరు


గత ఐదేళ్లుగా తాను సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన బీజేపీపై ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సోమవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో తన ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రాయోజిత పథకాలపై బ్యాంకింగ్ చేసిందని ఆరోపించారు. ఈసారి బీజేపీ, ఎన్‌పీపీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. వేలాది మంది రైతులకు భూమి పత్రాలు లేనందున ప్రతిష్టాత్మకమైన పీఎం కిసాన్ పథకం కూడా విఫలమైందన్నారు. తన ప్రభుత్వం ఫోకస్, ఫోకస్ ప్లస్ పథకాలను తీసుకువచ్చిందని, ప్రతి రైతుకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు కేటాయించాలని కాన్రాడ్ మేఘాలయలో చెప్పారు. ఫోకస్ ప్లస్‌లో, ఉత్పత్తిదారుల సమూహంలో భాగమైన రైతులకు ఒక్కొక్కరికి రూ.5,000 లభిస్తుంది. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పార్టీలే వేరుపడిఇప్పుడు ఆ పార్టీకి సవాలుగా మారాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+