వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుబ్రతా: ప్రేమ పెళ్లి, వైట్‌హౌస్‌ని మరిపించేలా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సహారా ఇండియా పరివార్ వ్యవస్థాపకులు, చైర్మన్ సుబ్రతా రాయ్‌కి కూడా మంగళవారం చేదు అనుభవం ఎదురయింది. గతంలో పలువురు నాయకులపై నల్లటి ఇంక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చల్లారు.

మంగళవారం సుబ్రతా పైన ఓ లాయరు బ్లాక్ ఇంక్ చల్లారు. 65 ఏళ్ల సుబ్రతాను సుప్రీం కోర్టులో పోలీసులు ప్రవేశ పెడుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

మరోవైపు సుబ్రతా పైన సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకు గ్యారంటీ ఇస్తాం.. సెబి(స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కి సహకరిస్తామంటూ సుబ్రతా రాయ్ చేసిన తాజా ప్రతిపాదనలను కోర్టు తోసిపుచ్చింది. కాగా, సహారా ఇండియా 1.1 మిలియన్ ఉద్యోగులు ఉన్న పెద్ద ప్రయివేటు కంపెనీ. సుబ్రతా తన విలాస జీవన శైలితోను అప్పుడప్పుడు మీడియాలో ఉంటారు.

తల్లిదండ్రులు

తల్లిదండ్రులు

సుబ్రతా రాయ్ తల్లిదండ్రులు సుధీర్ చంద్ర రాయ్, శ్రీమతి చాబీ రాయ్. సుబ్రతా 1948 జూన్ 10వ తేదన బీహార్‌లో జన్మించారు. తొలుత ఆయనకు చదువుపై ఆసక్తి లేదు. కోల్‌కతాలో చదివారు.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

గోరక్ పూర్‌లోని ప్రభుత్వ కళాశాలలో సుబ్రతా మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్యాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇతని స్వప్న రాయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

సహారా

సహారా

సుబ్రతా రాయ్ 1978లో సహారా స్థాపించారు. సహారా సంస్థను స్థాపించినప్పుడు అతని వద్ద కేవలం రెండువేల రూపాయలు, ఓ స్కూటర్ ఉంది. రోజుకు వంద రూపాయలు సంపాదించే కొందరు సుబ్రతా వద్ద ఇరవై రూపాయలను డిపాజిట్ చేసేవారు.

రాజకీయాలతో..

రాజకీయాలతో..

సుబ్రతా రాయ్ రాజకీయంగా పలుకుబడి ఉంది. అతను లగ్జరీ జీవితంతో కూడా పలుమార్లు మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి.

కపిల్ దేవ్

కపిల్ దేవ్

సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ అరెస్టుపై కపిల్ దేవ్ రెండు రోజుల క్రితం స్పందించారు. సుబ్రతా దేశభక్తి గల వ్యక్తి అని కపిల్ కితాబిచ్చారు.

కోర్టుకు వస్తూ...

కోర్టుకు వస్తూ...

సుబ్రతా రాయ్ మంగళవారం కోర్టుకు వస్తూ విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం. విలేకరులు అడుగుతుండగా.. కోర్టుకు హాజరై వచ్చి మాట్లాడుతానని సుబ్రతా చెప్పారు.

సరెండర్ సమయంలో...

సరెండర్ సమయంలో...

సుబ్రతా రాయ్ సరెండర్ అయిన తర్వాత అతనిని పోలీసు ఎస్కార్టుతో వస్తున్న దృశ్యం. అంతకు రెండు రోజుల ముందు అతనికి అరెస్టు వారెంట్ జారీ అయింది.

సరెండర్...

సరెండర్...

సుబ్రతా రాయ్ సరెండర్ అయిన తర్వాత అతనిని పోలీసు ఎస్కార్టుతో వస్తున్న దృశ్యం. అంతకు రెండు రోజుల ముందు అతనికి అరెస్టు వారెంట్ జారీ అయింది. శుక్రవారం సరెండర్ అయ్యారు.

బ్లాక్ ఇంక్

బ్లాక్ ఇంక్

సుబ్రతా రాయ్ ముఖం పైన మంగళవారం ఓ న్యాయవాది నల్లటి ఇంకు పోశాడు. సుబ్రతా రాయ్ దోంగ అని నినాదాలు చేస్తూ ఇంక్ పోశాడు.

న్యాయవాది

న్యాయవాది

సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురయింది. విచారణ నిమిత్తం సుబ్రతాను పోలీసులు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తీసుకు వచ్చారు. ఈ సమయంలో ఓ వ్యక్తి అతని ముఖంపై నల్లని సిరా చల్లాడు. సుబ్రతా ముఖంపై సిరా చల్లిన వ్యక్తి లాయర్.

నల్లటి ఇంక్

నల్లటి ఇంక్

సుబ్రతా దొంగ అని, జాతి సంపద దోచుకున్నాడంటూ దూసుకు వచ్చి అతనిపై ఇంకు చల్లాడు. మీడియా ప్రతినిధులను దాటుకొని వచ్చి ఈ పని చేశాడు. అతనిని సుబ్రతా రాయ్ అనుచరులు చితకబాదారు. కాగా, నల్లటి ఇంకు చల్లిన వ్యక్తి గ్వాలయర్‌కు చెందిన మనోజ్ శర్మగా గుర్తించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

అమితాబ్‌తో స్నేహం

అమితాబ్‌తో స్నేహం

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో సుబ్రతా రాయ్‌కు స్నేహం ఉంది. బిగ్ బి పలు సందర్భాల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి సుబ్రతా రాయ్‌కు చెందిన వేడుకలలో కనిపించారు.

తనయుల పెళ్లి

తనయుల పెళ్లి

సుబ్రతా రాయ్ తనయుడుల సీమంతో రాయ్, సుశాంతో రాయ్‌ల పెళ్లి 2004 ఫిబ్రవరి 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగింది. 8 మిలియన్లు ఈ పెళ్లికి ఖర్చయినట్లుగా చెబుతారు. ఈ పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్స్, క్రికెట్ స్టార్స్, ఫ్యాషన్ డిజైనర్లు ఎందరో వచ్చారు.

టోనీ బ్లెయిర్‌తో...

టోనీ బ్లెయిర్‌తో...


బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌తో సుబ్రతా రాయ్ ఉన్న దృశ్యం. ఈ ఫోటో మెక్‌డోనియాలో బల్కాన్ పీస్ వేడుక సందర్భంగా తీసింది.

లైఫ్ స్టయిల్

లైఫ్ స్టయిల్


సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ లైఫ్ స్టయిల్ విలాసవంతంగా ఉంటుందంటారు. రోల్స్ రాయల్స్, బిఎండబ్ల్యూ తదితర కార్లు ఉపయోగిస్తారు.

వైట్ హౌస్‌ను మరిపించేలా...

వైట్ హౌస్‌ను మరిపించేలా...

సహారా ఫ్యామిలీ మెంబర్స్‌ది ఎక్స్‌ట్రా ఆర్డినరీ లగ్జరీయస్ లైఫ్ స్టయిల్. సుబ్రతా రాయ్ లక్నోలోని తన ఇంటిని నిర్మించే ముందు ఇద్దరు ఆర్కిటెక్చర్‌లను అమెరికా పంపించి వైట్ హౌస్‌ను పరిశీలించవలసిందిగా సూచించినట్లుగా చెబుతారు. సుబ్రతా మరో ఇళ్లు బ్రిటన్‌లోని బకింగ్ హామ్ ప్యాలెస్ వలె ఉంటుందట.

లాయర్

లాయర్


సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురయింది. విచారణ నిమిత్తం సుబ్రతాను పోలీసులు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తీసుకు వచ్చారు. ఈ సమయంలో ఓ వ్యక్తి అతని ముఖంపై నల్లని సిరా చల్లాడు. సుబ్రతా ముఖంపై సిరా చల్లిన వ్యక్తి లాయర్.

చితకబాదారు

చితకబాదారు


సుబ్రతా దొంగ అని, జాతి సంపద దోచుకున్నాడంటూ దూసుకు వచ్చి అతనిపై ఇంకు చల్లాడు. మీడియా ప్రతినిధులను దాటుకొని వచ్చి ఈ పని చేశాడు. అతనిని సుబ్రతా రాయ్ అనుచరులు చితకబాదారు. కాగా, నల్లటి ఇంకు చల్లిన వ్యక్తి గ్వాలయర్‌కు చెందిన మనోజ్ శర్మగా గుర్తించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

English summary
The founder and chairman of the Sahara India Pariwar, Subrata Roy has come a long way in his life- from being a business tycoon to a victim of "black ink" attack on his face.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X