వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం అమరీందర్‌కు సింగ్ మరో షాక్: 62 మంది ఎమ్మెల్యేలు నవజోత్ సింగ్ సిద్ధు ఇంటికి!

|
Google Oneindia TeluguNews

అమృత్‌సర్: పంజాబ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను నవజోత్ సింగ్ సిద్ధూకు ఇచ్చిన అనంతరం రాష్ట్రంలో ఆ పార్టీ పాలనకు ఢోకా ఉండదని, సాఫీగా సాగుతుందని భావించినప్పటికీ.. తాజా పరిణామాలు అలా కనిపించడం లేదు. బుధవారం స్వర్ణ దేవాలయం సందర్శనకు పెద్ద ఎత్తున నేతలు తరలి రావాలన్న సిద్ధూ పిలుపునకు ఎమ్మెల్యేల నుంచి భారీ స్పందన వచ్చింది.

అమరీందర్ సింగ్‌కు మరో షాక్.. సిద్ధు ఇంటికి 62 మంది ఎమ్మెల్యేలు

అమరీందర్ సింగ్‌కు మరో షాక్.. సిద్ధు ఇంటికి 62 మంది ఎమ్మెల్యేలు

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దూ నివాసానికి సుమారు 62 మంది ఎమ్మెల్యేలు వచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఓ విధంగా చెప్పాలంటే ఇది సిద్దూ బలప్రదర్శనలా కనిపించింది. అయితే, తనపై గతంలో చేసిన వ్యాఖ్యలకు గానూ నవజోత్ సింగ్ సిద్ధూ క్షమాపణలు చెప్పిన తర్వాత తాను ఆయనతో మాట్లాడతానంటూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధు వెంటే..

మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధు వెంటే..

117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 77 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వీరిలో 62 మంది సిద్ధు వెంటే ఉన్నారు. అయితే, ఈ కార్యక్రమంతో మెజార్టీ ఎమ్మెల్యేలు మాత్రం సిద్ధూకు మద్దుతగానే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక, అమృత్‌సర్‌లో భారీ ఎత్తున సిద్దూ కటౌట్లు వెలిశాయి. స్వర్ణదేవాలయానికి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. మంత్రులు సుక్బీందర్ సింగ్, త్రిప్త్ రాజీందర్ సింగ్ బజ్వా, పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖద్ కూడా పాల్గొన్నారు.

2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సిద్ధు నేతృత్వంలోనే..

2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సిద్ధు నేతృత్వంలోనే..


2022 ఎన్నికల్లోనూ సిద్దూ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆపార్టీ ఎమ్మెల్యే మదన్ లాల్ జల్పూర్ ఈ సందర్భంగా మీడియాతో చెప్పారు. పంజాబ్ మొత్తం సిద్దూ కావాలని కోరుకుంటోందన్నారు. సిద్దూ నియామకంతో పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొందన్నారు. సీఎం అమరీందర్ కూడా సిద్దూ నియామకాన్ని స్వాగతించాలన్నారు. ఇది ఇలావుండగా, సిద్దూతో భేటీ విషయంలో అమరీందర్ సింగ్ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని ఆయన సలహాదారు వ్యాఖ్యానించడం గమనార్హం. తాజా రాజకీయ పరిణామాలు పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా నవజోత్ సింగ్ సిద్ధునే అవుతారనే ప్రచారం జరుగుతోంది.

English summary
In show of strength: 62 Congress MLAs turn up at Navjot singh Sidhu’s Amritsar home, tussle with Amarinder continues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X