ఈ ప్రదేశాల్లో విజ‌య‌ద‌శ‌మి నాడు రావ‌ణుడిని పూజిస్తారు.. కార‌ణం తెలుసా.?

అక్టోబ‌ర్ 24న విజ‌య‌ద‌శ‌మి... ఈ పండుగ‌ను అంద‌రూ ద‌స‌రా అని పిలుస్తారు. ద‌స‌రా పండుగ‌ను దేశంలో అంద‌రూ ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకుంటారు. ద‌స‌రా పండుగ‌ను చెడుమీద మంచిన సాధించిన విజ‌యానికి గుర్తుగా విజ‌య‌ద‌శ‌మ‌ని జ‌రుపుకుంటారు. చరిత్ర ప్ర‌కారం విజ‌య‌ద‌శ‌మి రోజున రాముడు రావ‌ణుడిపై గెలిచిన సంద‌ర్భంగా రావ‌ణుడి దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేసే ఆచారం ఉంది. అయితే, భార‌త‌దేశంలో అన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం లేదు. కొన్ని చోట్ల మాత్ర‌మే దీన్ని పాటిస్తున్నారు. మ‌రికొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా ఈ పండుగ స‌మ‌యంలో రావ‌ణుడిని ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తున్నారు. దానికి గ‌ల కార‌ణాలేంటో తెలుసుకుందాం ప‌దండి.

గడ్చిరోలి, మహారాష్ట్ర:మ‌హారాష్ర్ట‌లోని గ‌డ్చిరోలి ప్ర‌దేశంలో గోండు తెగకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు తమను తాము రావణుడికి వారసులుగా భావిస్తారు. అందువ‌ల్లే వీరు రావ‌ణాసురిడి బొమ్మ‌ను ద‌హ‌నం చేయ‌రు. అందుకు బ‌దులుగా రావ‌ణుడిని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తారు. కొందరి అభిప్రాయం ప్రకారం.. తులసీదాస్ ర‌చించ‌న రామాయణం మాత్రమే రావణుడిని చెడ్డ వ్య‌క్తిగా చూపిస్తుంద‌ని, అందుకే ఇక్క‌డివారు రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ముందుకు రార‌ని ఇక్క‌డివారు చెబుతున్నారు.

 In these places Ravana is worshiped on Vijayadashami,Do you know the reason?

మందసౌర్, మధ్యప్రదేశ్:మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మంద‌సౌర్ ప్ర‌దేశం రావణుడి భార్య మండోదరి జన్మస్థలం. అందుకే ఇక్కడి వాళ్లు రావణాసురిడిని తమ అల్లుడిగా భావిస్తారు. అందుకే ఇక్కడి ప్రజలు రావణాసురిడిని దహనం చేసేందుకు ఒప్పుకోరు. ఎందుకుంటే అల్లుడు చ‌నిపోయిన‌ప్పుడు ఎవ‌రైనా సంతోషంగా ఉంటారా..? అందుకే ఇక్క‌డివారికి ఆ రోజంతా సంతోషం ఉండ‌దు. ఈ ప్రాంత ప్ర‌జ‌లు విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఆ రోజంతా రావ‌ణాసురిడికి సంతాపం తెలుపుతూ ఉంటారు. ఈ మంద‌సౌర్ ప్రాంతంలో రావ‌ణుడి విగ్ర‌హం కూడా ఉంది. ఈ విగ్రహం 35 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ విగ్ర‌హాన్ని ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తారు.

బిస్రాఖ్, ఉత్తర ప్రదేశ్:ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న బిస్రాఖ్ గ్రామం రావ‌ణుడి జన్మ‌స్థ‌లం అని ఇక్క‌డివారు న‌మ్ముతారు. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడిని తమ పూర్వీకుడిగా భావిస్తారు. అందుకే దసరా రోజు రావ‌ణుడి ఆత్మకు శాంతి కలగాలని పూజ‌లు చేస్తారు. రావణుని తండ్రి విశ్రవ మహర్షి, తల్లి కైకేశి. రావణుని తండ్రి విశ్రవుడు ఇక్కడ ఒక శివలింగాన్ని స్థాపించాడని ఇక్క‌డివారి న‌మ్మ‌కం. దీనికి గౌరవార్థం ఈ ప్రదేశానికి బిస్రాఖ్ అని పేరు వ‌చ్చింది. అందుకే ఈ ప్రాంతం వాసులు రావణుడిని మహా బ్రాహ్మణుడిగా భావిస్తారు.

 In these places Ravana is worshiped on Vijayadashami,Do you know the reason?

కాంగ్రా, ఉత్తరాఖండ్:ఉత్త‌రాఖండ్‌లోని కాంగ్రాలో లంకాదీశుడు శివుని కోసం ఘోర త‌ప‌స్సు చేసిన ప్రాంతం ఇదేన‌ని ఇక్క‌డివారి న‌మ్మ‌కం. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడిని మహాదేవునిగా భావించి పూజిస్తారు. అందువలన ఇక్కడ కూడా రావణ దహనం జరగదు.

మండోర్, రాజస్థాన్:రాజ‌స్థాన్‌లోని మండోర్‌లోనే రావణుడు మండోదరిని వివాహం చేసుకున్నాడని ఇక్క‌డి వారి న‌మ్మ‌కం. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడిని తమ అల్లుడిగా భావించి పూజ‌లు చేస్తారు. విజయదశమి నాడు ఇక్కడ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు.

అందుకు బ‌దులుగా అల్లుడికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+