Crime News: గొంతు కోసి హత్య.. మూడు భాగాలు చేసి ఏం చేశాడంటే..!
నేరస్థులు తాము చేసిన నేరాల నుంచి తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. పారిపోయే లేక మరేదైన చేసి తప్పించుకోవాలని చూస్తారు. కానీ మధ్య వారి రూట్ మారింది. వారు హత్యలు చేసిన అనంతరం మృదేహాన్ని ముక్కలు చేస్తున్నారు. ఢిల్లీ శ్రద్ధా వాకర్ అనే యువతి ఆమె ప్రియుడ్ అఫ్తాబ్ హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. మృతదేహ భాగాలను 18 రోజుల పాటు ఇంట్లో ఫ్రిజ్ లో ఉంచి రోజుకో కొన్న భాగాలను మోహ్రౌలి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. శ్రద్ధ వాకర్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అఫ్తాన్ అరెస్ట్ చేశారు.

కర్ణాటక
రెండు రోజుల క్రితం కర్ణాటకలో ఓ కొడుకు తండ్రిన హత్య చేశాడు. మృత దేహాన్ని ముక్కలుగా చేసి బోరు బావిలో పడేశాడు. అయితే బోరు బావి వద్ద దర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచామిచ్చారు. బోరు బావిలో ఉన్న మృతదేహ భాగాలుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి అరెస్ట్ చేశారు. తాజాగా యూపీలో ఇలాంటి ఘటనే జరిగింది.

ఘజియాబాద్
యూపీలోని ఘజియాబాద్ జిల్లాకు చెందిన అంకిత్ ఖోకర్ తల్లిదండ్రులు మరణించినప్పటి నుండి ఒంటరిగా నివసిస్తున్నాడు. అతను లక్నోలోని ఒక విశ్వవిద్యాలయంలో PhD చేస్తున్నాడు. అంకిత్ ఖోకర్ ఫోన్ కు అతని స్నేహితులు మూడు వారాల నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. కేవలం మెసెజ్ లు మాత్రమే చేస్తున్నాడు. దీంతో ఖోకర్ ఘజియాబాద్ చేరుకున్నారు. ఖోకర్ కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. సందేశాలు మాత్రమే రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫోన్ సిగ్నల్స్
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మోడీనగర్‌కు చెందిన ఉమేష్ శర్మ అనే వ్యక్తిని బుధవారం అరెస్టు చేశారు. అంకిత్ ఖోకర్ కొద్ది నెలల క్రితం బాగ్‌పత్‌లోని తన పూర్వీకుల భూమిని విక్రయించాడు. అతనికి భూమి అమ్మగా రూ. 1 కోటి వచ్చాయి. వాటిపై కన్నేసిన ఉమేష్ శర్మ.. తనకు రూ.40 లక్షలు అప్పు ఇవ్వాల్సిందిగా ఖోకర్ ను కోరాడు. దీంతో ఖోకర్ ఉమేష్ కు రూ.40 లక్షలు ఇచ్చాడు.

డబ్బు
కొద్ది రోజుల తర్వాత ఖోకర్ ఉమేష్ ను డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. డబ్బు ఇస్తా.. రామ్మని ఉమేష్ ఖోకర్ చెప్పాడు. అక్టోబరు 6న అంకిత్ ఖోకర్ ఉమేష్ ఇంటికి వెళ్లాడు. అప్పుడే ఉమేష్, ఖోకర్ ను గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం ఒక రంపంతో మృతదేహాన్ని మూడు భాగాలుగా కత్తిరించి, వాటిని అల్యూమినియం ఫాయిల్‌లో ప్యాక్ చేశాడు. ఒక భాగాన్ని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ వద్ద ఉన్న కాలువలో, మరొక భాగాన్ని ముస్సోరీ కాలువలో, ఇంకొ భాగాన్ని ఎక్స్‌ప్రెస్‌వేపై పడేశాడు.












Click it and Unblock the Notifications