అటారీ సరిహద్దులో గర్వంగా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం..అమరవీరులకు కజారియా సెల్యూట్
అమృత్‌సర్:దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమృత్‌సర్‌లోని అటారీ-వాఘా సరిహద్దు వద్ద జరిగిన చారిత్రాత్మక బీటింగ్ రిట్రీట్ వేడుకలు దేశభక్తిని మరోసారి చాటిచెప్పాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సైనికుల అద్భుతమైన క్రమశిక్షణ, కచ్చితమైన కవాతు, దేశభక్తి ప్రదర్శనలు అక్కడి వేల మంది ప్రజలను ఉర్రూతలూగించాయి.
ఈ గొప్ప సందర్భంలో, భారతదేశపు ప్రముఖ టైల్స్ బ్రాండ్ అయిన కజారియా.. "దేశ్ కీ మిట్టీ సే దేశ్ కో బనాతే హై" (దేశపు మట్టితోనే దేశాన్ని నిర్మిస్తాం) అనే నినాదంతో భారత సైనికుల సేవ, త్యాగాలను గౌరవించింది.

"దేశపు మట్టితోనే బలమైన భారత్"
స్వాతంత్ర్య సమరయోధుల పోరాటం నుంచి సరిహద్దులను కాపాడుతున్న నేటి సైనికుల వరకు.. దేశపు మట్టి ఎప్పుడూ విజయాలకు పునాదిగా నిలిచింది. కజారియా ఈ వారసత్వం నుంచి ప్రేరణ పొందుతుంది. అందుకే ఆ సంస్థ మన దేశపు మట్టితోనే బలం, అందం, నాణ్యత కలబోసిన అంతర్జాతీయ స్థాయి టైల్స్‌ను తయారుచేస్తోంది.

కజారియా ప్రతినిధి మాట్లాడుతూ.. "మన సాయుధ దళాలు మన దేశాన్ని, ప్రజలను, ఐక్యతను కాపాడే రక్షకులు. వారి ధైర్యం, అంకితభావం మా విలువలకు నిదర్శనం. మా నినాదం ప్రకారం, దేశపు మట్టితోనే బలమైన భారతదేశాన్ని నిర్మిస్తున్నాం" అని అన్నారు.

ఎర్రకోటపై త్రివర్ణ పతాకం గర్వంగా ఎగురుతున్న ఈ ప్రత్యేక రోజున, అటారీ సరిహద్దులో దేశభక్తి ప్రతిధ్వనించింది. కజారియా.. బీఎస్ఎఫ్ సైనికులకు, దేశ ప్రగతికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క భారతీయుడికి సెల్యూట్ చేసింది. దేశం మరింత బలంగా, ఐక్యంగా, గర్వంగా నిలబడటానికి కృషి చేస్తామని మరోసారి కజారియా తమ నిబద్ధతను తెలియజేసింది.












Click it and Unblock the Notifications