పాక్‌పై ప్రధాని మోదీ అనుసరించిన రణతంత్రం ఏదైతే ఉందో..?
India Pakistan War: పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన సైనిక చర్య.. ప్రపంచ దేశాలకు ఓ కొత్త దిక్సూచి చేసినట్టయింది. భారత్‌పై ఎప్పుడు దాడి చేసినా.. తమ ప్రతిస్పందన ఇలాగే ఉంటుందని పాకిస్తాన్, ఆ దేశ ప్రోత్సహిస్తోన్న ఉగ్రవాదులకు స్పష్టంగా తెలియజేసిందీసారి.
ఈ దఫా భారత్ ఉగ్రవాదులను మాత్రమే వెంటాడ లేదు. ఏకంగా పాము తలపై గురిపెట్టింది. అ సారి అనుసరించిన వ్యూహాలు. భారత్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను సూచిస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వాళ్లే కాదు.. దాన్ని నడిపించే సూత్రధారులనూ నిర్మూలిస్తామనే హెచ్చరికలను పంపించింది.

భారత సాయుధ దళాలు చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా అమలు చేసిన మిషన్- ఆపరేషన్ సింధూర్. ఇది- పాకిస్తాన్ సంప్రదాయ యుద్ధ వ్యూహాలను సమూలంగా తుడిచిపెట్టింది. ఈ ఆపరేషన్ పాకిస్తాన్‌ను దౌత్యపరంగా ఒంటరిని చేసింది. యుద్ధంలోకి దిగిన కొన్ని గంటల్లోనే అత్యవసరంగా కాల్పుల విరమణ కోరేలా చేసింది.
ఈ ఆపరేషన్‌కు ప్రధాన కారణం- ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి. ఈ మారణహోమం ఆ తర్వాత ప్రతీకార చర్యకు పూనుకుంది భారత్. ఈ నెల 9న పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారీగా వైమానిక దాడులు సాగించింది. భారత ఎదురుదాడి అనేది హఠాత్తుగా చోటు చేసుకున్నది కాదు. పక్కా ప్లానతో మల్టీ లెవెల్ అటాక్ చేపట్టింది. శతృవులను దనుమాడింది.
మే 10 తెల్లవారు జామున, 11వ తేదీన పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై ఖచ్చితమైన సమాచారంతో మెరుపుదాడి చేసింది. దీన్ని ప్రతీకార చర్యగా మాత్రమే భావంచలేదు కేంద్రం. పాకిస్తాన్ వైమానిక యుద్ధ సామర్థ్యాన్ని వ్యూహాత్మకంగా విచ్ఛిన్నం చేయడం, దాని రక్షణ వ్యవస్థను నిర్వీర్యపరిచింది.
రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, జనరల్ హెడ్‌క్వార్టర్స్.. పాక్‌కు కీలకమైనవి. దీన్ని విజయవంతంగా ధ్వంసం చేయగలిగింది భారత వైమానిక దళం. ఇది- పాక్ నడ్డి విరిచినట్టయింది. అలాగే- పాకిస్తాన్ అణ్వాయుధాలకు గుండెకాయగా భావించే సర్గోధా, ఎయిర్ వింగ్ ట్రైనింగ్ కేంద్రాన్ని భారత్ ధ్వంసం చేయడం పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌ను దిక్కుతోచని స్థితిలో పడేసినట్టయింది.
రఫీకి, మురిద్, సియాల్‌కోట్, స్కర్దు, జకోబాబాద్, సుక్కూర్, పస్రూర్, చునియన్, భోలారి వంటి ఎఫ్-16, జేఎఫ్-17 థండర్స్, మిరాజ్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ యూనిట్లను దెబ్బకొట్టడం ద్వారా వైమానికంగా తీవ్రంగా నష్టపోయింది పాకిస్తాన్. ఈ దాడులు స్క్వాడ్రన్లు, డ్రోన్ స్థావరాలు, రాడార్ నెట్‌వర్క్, యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్‌లను న్యూట్రలైజ్ చేయగలిగాయి.
ఇలా పాకిస్తాన్ వైమానిక దళాన్ని జస్ట్ ఒకే ఒక్క రాత్రిలో సమర్థవంతంగా నేలమట్టం చేసింది భారత్. సరిగ్గా తెల్లవారుజామున 1:04 నిమిషాలకు ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. వీటిలో బహవల్‌పూర్ అత్యంత కీలకం.
జైషె మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాలుగా గుర్తింపు పొందిన మురిడ్కె ఈ దాడిలో నామరూపాల్లేకుండా పోయింది. ఈ చర్యతో మూడు దశాబ్దాలుగా భారత గడ్డపై అత్యంత ఘోరమైన దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద గ్రూపుల వెన్ను విరిగిపోయినట్టయింది.
ఉగ్రవాద క్యాంపులను భారత్.. యాదృచ్ఛికంగా సెలెక్ట్ చేయలేదు. దీని వెనుక అత్యంత పకడ్బందీ ప్లాన్ ఉంది. తొమ్మిది ప్రదేశాలలో ప్రతి ఒక్కటి ఉగ్రవాద మౌలిక సదుపాయాల్లో కీలకమైన పాయింట్లే. ఇవన్నీ కూడా సరిహద్దు చొరబాట్లు, భారత్‌లో దాడులు, అలజడులకు కారణం అయ్యే శిక్షణ కేంద్రాలు.
సియాల్‌కోట్, కోట్లి - సరిహద్దు చొరబాటు లాజిస్టిక్స్‌కు కీలకమైనవి.
భింబర్- ఐఎస్ఐ కోఆర్డినేషన్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రం.
బహవాల్‌పూర్, మురిడ్కే - జైషె మహ్మద్, లష్కరే తొయిబాలకు సంబంధించినంత వరకు సైద్ధాంతిక, కార్యాచరణకు ప్రధాన కేంద్రాలు. 25 నిమిషాల పాటు జరిగిన ఈ దాడిలో అవన్నీ ధ్వంసం కావడం ఒక ఎత్తయితే.. పాకిస్తాన్ టెర్రర్ ఎక్స్‌పోర్ట్ యంత్రాంగం మొత్తాన్ని కూడా ఈ దాడులతో కోలుకోలేని విధంగా దెబ్బకొట్టడం మరో ఎత్తు.
ఆకాష్ టీర్- భారత అమ్ములపొదిలో గేమ్-ఛేంజర్.. ఈ ఆకాష్ మిస్సైల్. రియల్-టైమ్ టార్గెటింగ్, ఇంటర్‌సెప్షన్ సిస్టమ్ ఇది. డీఆర్డీఓ, బీఈఎల్ దీన్ని అభివృద్ధి చేశాయి. ఇస్రో లింక్ రూపొందించిన నావిక్ సిస్టమ్, శాటిలైట్-లింక్డ్ అనుసంధానమై ఉంటుంది. శతృశిబిరాలపై వంద శాతం ఖచ్చితత్వంతో దాడులు సాగించడానికి ఇది ఉపయోగపడింది.
ఆపరేషన్ సిందూర్‌తో పాటు ఆకాష్.. దేశ రక్షణ వ్యవస్థ, ఆయుధ సంపత్తిలో ఓ కీలక, నిర్ణయాత్మక మలుపుగా చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో స్వదేశీ, ఏఐ- ఆధారిత టెక్నాలజీ, శాటిలైట్- బేస్డ్‌తో ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడమే కాకుండా.. శతృదేశంపై దీన్ని సమర్థవంతంగా ఉపయోగించింది కూడా.
పాకిస్తాన్ వైమానిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా ఏఐ-ఆధారిత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ.. మున్ముందు భారత యుద్ధ రణనీతి ఎలా ఉంటుందో ఆకాష్ ఓ ట్రైలర్ చూపించగలిగింది. రియల్-టైమ్ ఉపగ్రహ చిత్రాలు, నావిక్ నావిగేషన్, డ్రోన్లను ఉపయోగించడం ద్వారా వైమానిక దాడులను సమర్థవంతంగా అడ్డుకోగలదు.
నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేయడం ద్వారా భారత్.. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు అతి సమీపంలో దాడి చేసినట్టయింది. ఇది- పాకిస్తాన్ సైనిక, రాజకీయ రంగంలో ప్రకంపనలు పుట్టించింది. భారత్ దృష్టి నుంచి పాక్ ఎంతమాత్రమూ తప్పించుకోలేదనడానికి తాజా ఉదాహరణ.. గిల్గిట్-బాల్టిస్తాన్‌లో వంటి ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం. భారత నిఘా వ్యవస్థ ఎంత సమర్థవంతంగా ఉందో స్కర్దుపై బాంబు దాడి స్పష్టం చేసింది.
ఇది సాధారణ వైమానిక దాడి కాదనడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. వాయుసేనతో దేశ ఇంటెలిజెన్స్, రా వంటి ఇతర సంస్థలు ఎంత పకడ్బందీగా తమ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయో తెలియజేశాయి. వ్యూహాత్మక, ప్రణాళికబద్ధంగా సాగిన ఈ దాడులు ఆయా విభాగాల మధ్య ఉన్న కోఆర్డినేషన్‌ను శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.
ప్రతి లక్ష్యాన్ని ఛేదంచడం అనేది యాదృచ్ఛికం ఎంతమాత్రం కాదని.. అత్యంత పకడ్బందీ ప్రణాళికల ద్వారా మాత్రమే సాధ్యపడిందని స్పష్టం చేసింది. భారత్ చేసిన దాడులు పాకిస్తాన్ బెదిరింపుల డొల్లతనాన్ని కూడా బహిర్గతం చేసింది. ఒకదాని తర్వాత ఒకటి స్థావరాలు మంటల్లో చిక్కుకుంటుండగా- పాకిస్తాన్ కూసాలా కదిలిపోయినట్టయింది. కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ డీజీఎంఓ అభ్యర్థించేలా చేసింద.
ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్.. ఈ దాడికి పుల్ స్టాప్ పెట్టడానికి అమెరికా, సౌదీ అరేబియా, చైనాలను మధ్యవర్తిగా చేర్చుకోవడానికి విఫలయత్నం చేశారు. భారత్ మాత్రం ఇలాంటి అర్థరహిత దౌత్య చర్చల్లో పాల్గొనడానికి నిరాకరించింది. ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటూనే.. పాకిస్తాన్ ఇంధన, ఆర్థిక, రక్షణ స్థావారాలపై దాడులను మరింత తీవ్రతరం చేయడానికి సాయుధ దళాలను సిద్ధంగా ఉంచింది.
ఆపరేషన్ సింధూర్ సారాంశం సైనికపరమైనది మాత్రమే కాదు- సిద్ధాంతపరమైనది కూడా. రణతంత్రంలో సంప్రదాయ పద్ధతులు, కాలం చెల్లిన నియమాలు ఇకపై వర్తించబోవని తేల్చి చెప్పింద. ఈ రంగంలో భారత్ ఒక బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసింది.
కాల్పుల విరమణ జరిగినా, జరగకపోయినా సింధు జల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేసిందని భారత్ స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా తీసుకున్న నిర్ణయాల్లో ఏ ఒక్క దాన్ని కూడా వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ యుద్ధం ద్వారా పాకిస్తాన్ అవమానాల బారిన పడింది. దాని వ్యూహాత్మక కొరత బయటపడింది. జిహాదీ గ్రూపులపై ఆధారపడిందనేది స్పష్టమైంది.
పూర్తి విధ్వంసం జరిగే ప్రమాదం లేకుండా కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ అర్థించడంతోనే ఆ దేశ ప్రతిష్ట దిగజారినట్టయింది. ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ అమలులో ఉంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే తాము తిప్పి కొడతామని త్రివిధ దళాలు ఇప్పటికే స్పష్టం చేయడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.












Click it and Unblock the Notifications