అఖండ భారత్‌కు అహింసతోనే స్వాతంత్య్రం... తెల్ల దొరలకు చెమటలు పట్టించిన ఉద్యమాలు
న్యూఢిల్లీ: భారత దేశం 75వ స్వాతంత్ర దినోత్సవంను ఆగష్టు 15న జరుపుకోనుంది. ఏటా ఆగష్టు 15వ తేదీన దేశం ఘనంగా స్వాంతంత్ర్య వేడుకలను నిర్వహిస్తుంది. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి 1947 ఆగష్టు 15న భారత్ స్వాతంత్ర్యం పొందింది. దేశం తెల్లదొరల పాలన నుంచి సొంత పాలన వైపు అడుగులు వేసిన రోజు ఇది. అంతేకాదు దేశం రెండుగా విడిపోవడం కూడా జరిగింది. ఒకటి భారత దేశంగా మిగిలిపోగా మరొకటి పాకిస్తాన్‌గా ఏర్పాటు కావడం జరిగింది.
భారత్‌లో బ్రిటీష్ పాలన 1757 నుంచి ప్రారంభమైంది. ప్లాసీ యుద్ధం విజయంతో భారత్‌లో తెల్లదొరల పాలన ప్రారంభమైంది. క్రమంగా ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని తన అధీనంలోకి తీసుకోవడం ప్రారంభించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్‌ను 100 ఏళ్లకు పైగా పాలించింది. ఆ తర్వాత 1857-58 మధ్య జరిగిన యుద్ధం ద్వారా బ్రిటీష్ రాజ్యం చేతిలోకి భారత్ వెళ్లిపోయింది. మొదటి ప్రపంచ యుద్దం సమయంలో భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రారంభమైంది. దీనికి మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ నాయకత్వం వహించారు. అహింసా మార్గాన్ని ఎంచుకుని తెల్ల దొరలను ఎదిరించాడు. తను నమ్ముకున్న శాంతి అహింసా మంత్రాలతోనే అఖండ భారత్‌కు స్వాతంత్ర్యం తీసుకురావడంలో సఫలీకృతుడయ్యాడు.

ఇక భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశం మొత్తం జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేస్తుంది. జాతీయ గీతంను ఆలపించి జెండా వందనం చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాటి త్యాగమూర్తులను స్మరించుకుంటుంది. అంతేకాదు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ఢిల్లీలోని చారిత్రాత్మకమైన ఎర్ర కోటపై భారత ప్రధాని జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఎర్రకోట వద్ద త్రివిధ దళాలు మార్చ్‌పాస్ట్ నిర్వహిస్తాయి. ప్రధాని తన ప్రసంగంలో దేశం సాధించిన విజయాల గురించి చెబుతారు. అంతేకాదు భవిష్యత్తులో దేశం ఎదుర్కోబోయే సవాళ్లపై కూడా మాట్లాడుతారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications