కొత్త కరోనా వైరస్ ఎఫెక్ట్ .. డిసెంబర్ 31 వరకు యూకే, బ్రిటన్ ల నుండి విమానాలు రద్దు
కరోనా కొత్తరకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుందని , పాత వైరస్ తో పోల్చుకుంటే 70 శాతం వేగంగా ఇది విస్తరిస్తుంది అని , సూపర్ స్పైడర్ వైరస్ గా కరోనా కొత్తరకం వైరస్ మారిందని నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్, యూకేలో కరోనా కొత్త రకం వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా యూకే , బ్రిటన్ ల నుండి విమానాలు డిసెంబర్ 31 వరకు నిషేధించింది భారత ప్రభుత్వం.

యూకే , బ్రిటన్ లకు ఫ్లైట్స్ రద్దు చేసిన ఏవియేషన్ రెగ్యులేటర్
ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే కొత్త రకం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా యుకె, బ్రిటన్ ల నుండి భారతదేశానికి వచ్చే అన్ని విమానాలను డిసెంబర్ 31 వరకు నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది అని ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. పర్యవసానంగా భారతదేశం నుండి యుకెకు, బ్రిటన్ కు విమానాలు పైన పేర్కొన్న కాలంలో తాత్కాలికంగా నిలిపివేయబడతాయి అని తెలుస్తోంది. ఈ నిషేధం బుధవారం నుండి అమల్లోకి వస్తుంది .

రేపు అర్దరాత్రి నుండి నిషేధాజ్ఞలు అమలు .. ఈ లోపు వచ్చే వారికి కరోనా పరీక్షలు
అంతకుముందు యుకె నుండి వచ్చే ప్రయాణీకులందరూ విమానాశ్రయాలలో కరోనా నిర్ధారణ పరీక్షలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ఉమ్మడి పర్యవేక్షణ బృందం ఈ ఉదయం సమావేశమై యునైటెడ్ కింగ్డమ్ లో వేగంగా వ్యాపించిన రూపాంతరం చెందిన కరోనావైరస్ గురించి చర్చించింది. కొన్ని రోజుల్లోనే ఈ కొత్త కరోనా వైరస్ జెట్ స్పీడ్ తో కేసులను పెంచిందని గుర్తించింది. కెనడా, సౌదీ అరేబియా మరియు అనేక యూరోపియన్ దేశాలు యూ కె నుండి విమానాలను అనుమతిస్తే కరోనా సూపర్ స్ప్రెడర్ గా మారుతుందని ఇప్పటికే పలు దేశాలు యూకే విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు .

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ .. డిసెంబర్ 31 వరకు విమానాలు నిలిపివేత
ఇదే సమయంలో యూకే నుంచి విమానాలను నిషేధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉదయం ట్వీట్ చేశారు. యూకే లో కరోనా మ్యుటేషన్ ఉన్నకారణంగా, అక్కడి నుండి వచ్చే వారి ద్వారా భారతదేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా కొత్త వైరస్ గురించి ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రజలు భయాందోళనకు గురి కాకూడదని, కావలసిన రక్షణ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే యూకే నుండి వచ్చే ఫ్లైట్ లను రేపటి నుండి డిసెంబర్ 31 వరకు నిలిపివేయాలని ప్రస్తుతానికి నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం.

కరోనా వ్యాక్సిన్ వచ్చాక కూడా తగ్గని టెన్షన్ .. కొత్త వైరస్ తో మళ్ళీ భయం షురూ
కరోనా కొత్త వైరస్ రకం మొట్టమొదట ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో సెప్టెంబర్‌లో కనుగొనబడింది. ఇది త్వరగా లండన్ మరియు యూకే లోని ఇతర ప్రాంతాలలో జోరుగా పెరుగుతోంది . ఆదివారం, బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ "కొత్త వేరియంట్ నియంత్రణలో లేదు" అని అన్నారు. ఉత్పరివర్తన వైరస్ సోకిన యూకే నుండి ఇటీవల తిరిగి వచ్చిన రోగిని ఇటలీ నివేదించింది. మహమ్మారి మధ్య వారి పోరాటాన్ని పెంచడానికి యూకే మరియు యునైటెడ్ స్టేట్స్ సహా అనేక దేశాలు కోవిడ్ వ్యాక్సిన్లను క్లియర్ చేసిన సమయంలో ఈ కొత్త కరోనా వైరస్ ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేసింది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications