భారత్ ఊహించని నిర్ణయం - పాక్ ఉక్కిరి బిక్కిరి, నెక్స్ట్ ఇదే..!!
భారత్ యుద్ద తంత్రానికి పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దౌత్య పరంగా పాక్ ను ఏకాకి చేస్తున్న భారత్.. ఇప్పుడు కీలక రంగాల ను దెబ్బ కొట్టే వ్యూహాలు అమలు చేస్తోంది. సింధూ నది నీటిని నిలిపివేసిన భారత్.. పాక్ సైన్యానికి నిద్ర లేకుండా రంగంలోకి దిగింది. భారత్ వ్యూహాలు అంతు చిక్కక.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పాక్ సైన్యం దీనంగా చూస్తోంది. సరిహద్దుల్లో మాత్రం కాల్పులకు తెగ బడుతోంది. కొద్ది గంటల్లోనే ఉగ్రవాద శిబిరాల పైన విరుచుకుపడటానికి భారత్ సైన్యం సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో భారత్ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది.
పాక్ ఉక్కిరి బిక్కిరి
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదులు.. వారికి మద్దతుగా నిలుస్తున్న పాక్ పైన గురి పెట్టింది. పాకిస్థాన్ ను ముందుగా అన్ని రంగాల్లోనూ బలహీన పర్చే వ్యూహం అమలు చేస్తోంది. అటు సైనిక చర్యకు సిద్దం అవుతోంది. అందులో భాగంగా ఇప్పటికే కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్ ఎయిర్‌లైన్లకు ఇది మరింత శరాఘాతం కానుంది. దీని ద్వారా పాక్ బంగ్లాదేశ్, శ్రీలంక మీదుగా తమ విమానాల రాకపోకలను కొనసాగించాల్సి ఉంటుంది. ఇది మరింత భారంగా మారనుంది.

భారత్ నిర్ణయాలతో
రెండు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలోనే పాక్ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించడంపై భారత్ కూడా దీటుగా స్పందించింది. పాక్ విమానయాన సంస్థలకు భారత గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు సంబంధించి నోటమ్ జారీ చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమలులో ఉండనుంది. దీంతో పాక్‌కు సంబంధించిన కమర్షియల్, లీజుకు తీసుకున్న, సైనిక విమానాలు భారత గగనతలాన్ని ఉపయో గించుకోవవడానకి అవకాశం లేదు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్థాన్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ విమానాలు కౌలాలంపూర్ సహా మలే షియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూరప్రయాణం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
సర్వం సిద్దం
అటు త్రివిధ దళాలు ఏ క్షణమైనా ఎలాంటి ఆదేశాలు అయినా అమలు చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి. సరిహద్దుల్లో పరిస్థితులు పర్యవేక్షించేందుకు ఆర్మీ చీఫ్ మరోసారి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ రోజు నుంచి ప్రధాని రెండు రోజుల పాటు మూడు రాష్ట్రాల్లో పర్యటనలకు బయలు దేరుతున్నారు. సైనిక పరంగా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పాక్ ను ఆర్దికంగా కోలుకోని దెబ్బ కొట్టేందుకు భారత్ మంత్రాంగం సాగిస్తోంది. మద్దతుగా నిలుస్తున్న దేశాలతో చర్చలను కొన సాగిస్తోంది. ఐఎంఎఫ్ నుంచి పాక్ కు దక్కాల్సిన రుణం నిలుపుదల దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నిధులను పాక్ ఉగ్రవాదానికి మళ్లిస్తోందని భారత్ నిరూపించేందుకు సిద్దమైంది. దీంతో, ఈ రాత్రికి భారత్ సైన్యం విరుచుకుడే అవకాశం ఉందని పాక్ ఆందోళన చెందుతోంది.












Click it and Unblock the Notifications