భారత అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం- హైదరాబాద్‌లో తయారీ

DRDO: దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం వచ్చి చేరింది. ఇప్పటివరకు లేని సరికొత్త తరహా క్షిపణిని ఇది. డీఆర్డీఓ విజయవంతంగా దీన్ని పరీక్షించింది. డీఆర్డీఓ- భారత ఆర్మీ సంయుక్తంగా ఈ రాకెట్ మిస్సైల్ ప్రయోగాన్ని చేపట్టారు. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలండ్‌ నుంచి పరీక్షించారు. ఈ మిస్సైల్ టెస్ట్ విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించారు.

లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ మిస్సైల్ ఇది. ఆర్మీ కోసం డీఆర్డీఓ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. 1,500 కిలోమీటర్లకు పైగా దూరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. అదే సమయంలో ఇతర వివిధ రకాల పేలోడ్స్‌ను కూడా తన వెంట మోసుకెళ్లగలదు.

India conducts successful test of long-range hypersonic missile in Odisha

హైదరాబాద్‌ రియాసత్ నగర్‌లో గల డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లో జీవం పొసుకుందీ మిస్సైల్. డీఆర్డీఓ దీన్ని అభివృద్ధి చేసింది. దేశంలో ఇతర ప్రాంతాల్లో గల డీఆర్డీఓకు చెందిన ల్యాబొరేటరీలు, రక్షణ రంగానికి సంబంధించిన పరికరాలను ఉత్పత్తి చేసే కొన్ని పరిశ్రమలు సంయుక్తంగా ఈ లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ క్షిపణి తయారీలో పాలుపంచుకొన్నాయి.

ఈ మిస్సైల్ పరీక్ష విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీన్ని చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. మరో మైలురాయిని అందుకున్నామని అన్నారు. డీఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించారు. వారికి శుభాకాంక్షలను తెలియజేశారు.

ఈ లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ మిస్సైల్ పరీక్ష.. దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసిందని అన్నారు. దేశ రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టమైనదో ప్రపంచానికి చాటి చెప్పిందని పేర్కొన్నారు. అందరి కృషితో గగన- సముద్రతలం, పదాతి దళాలు శతృదుర్బేధ్యంగా మార్చగలిగామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యున్నత ప్రమాణాలతో ఈ మిస్సైల్‌ను అభివృద్ధి చేశామని, ఇది నిర్దేశిత లక్ష్యాన్ని.. నిర్దేశించిన షెడ్యూల్‌లోనే ఛేదించిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇప్పటికే అత్యాధునిక నెట్‌వర్క్-సెంట్రిక్ యాంటీ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేశామని, ఈ విషయంలో స్వావలంబనను సాధించామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+