దేశంలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. కానీ రికవరీ మాత్రం సూపర్
దేశంలో కరోనా వైరస్ ఇంఫాక్ట్ కాస్త తక్కువగానే ఉంది. రోజు రోజు స్వల్పంగా పెరగడమో.. తగ్గడమో జరుగుతుంది. నిన్న కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 10,488 కొత్త కేసులు వచ్చాయి. వైరస్ సోకిన 313 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 4,65,662కు చేరింది. మరోవైపు, రికవరీలు కూడా బాగా పెరుగుతుండటం సానుకూల అంశంగా మారింది.
12,329 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3.39 కోట్లు దాటింది. ఈ స్థాయిలో రికవరీలు పెరగడం గతేడాది మార్చి తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. యాక్టివ్ కేసులు కూడా గణనీయంగా తగ్గాయి. ఇవి 0.36 శాతానికి తగ్గి 536 రోజుల కనిష్ఠానికి పడిపోయాయి. ప్రస్తుతం 1,22,714 మంది కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 10,74,099 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.
ప్రస్తుతం కరోనా కేసులు కాస్త తక్కువగానే వస్తున్నాయి. నిపుణులు మాత్రం జనవరిలో థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి మళ్లీ వేసవి ఎలా ఉంటుందోననే ఆందోళన ఉంది. కానీ ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎక్కడో.. ఎవరో కొందరు తీసుకోలేదు. దాదాపుగా చాలా మంది రెండు డోసులు కూడా తీసుకున్నారు. అంతా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా దరి చేరదని విశ్వసించవచ్చు.












Click it and Unblock the Notifications