భారత్‌కు సెక్యులరిజం అవసరం లేదు.. తమిళనాడు గవర్నర్ వివాదస్పద వ్యాఖ్యలు!
నిజానికి, సెక్యులరిజం అనేది యూరప్ భావన, దానికి మనదేశంలో స్థానం లేదు అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన మరో మరోసారి వార్తల్లో నిలిచారు. కన్యాకుమారిలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ''లౌకికవాదం(సెక్యులరిజం)'' పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెరలేపాయి. సెక్యులరిజం అనేది యూరప్ భావన, భారతదేశంలో దానికి స్థానం లేదు. ఈ దేశ ప్రజలపై చాలా మోసాలు జరిగాయి. వాటిలో ఒకటి లౌకికవాదం. దీనికి తప్పుడు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. సెక్యులరిజం అంటే ఏమిటి..? సెక్యులరిజం అనేది యూరోపియన్ భావిన. ఇది భారతీయ భావన కాదు.. అని భారత దేశానికి సెక్యులరిజం అవసరం లేదన్నట్లుగా ఆయన ఓ బహిరంగ కార్యక్రమంలో అన్నారు.

తీవ్రంగా ఖండించిన ప్రతిపక్షాలు..
నిజానికి, భారత రాజ్యాంగ ప్రవేశికలో సెక్యులర్ అనే పదాన్ని 1976లో 42వ సవరణ ద్వారా చేర్చారు. అయితే, దేశంలో సెక్యులరిజం అవసరం లేదని ఆయన చేసిన ప్రసంగాన్ని దేశంలోని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. భాతర రాజ్యాంగం సైతం విదేశీ భావన అని భవిష్యత్తులో ఆయన చెప్పవచ్చని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇది ముమ్మాటికీ ఆర్ఎస్ఎస్ భావన అని, అలాంటి గవర్నర్‌ని నియమించడం సిగ్గు చేటని సీపీఎం నేత బృందా కారత్ అన్నారు. ఇక ఇదే అంశంపై సీపీఐ నేత డీ రాజా తీవ్రంగా స్పందించారు. ఫెడరలిజం, ఒక వ్యక్తి ఒకే ఓటు, ప్రజాస్వామ్య అనేవి కూడా యూరప్ నుంచే ఉద్భవించాయనే వాస్తవాన్ని గవర్నర్ మర్చిపోతే ఎలా అని కాంగ్రెస్ నేత పి. చిదంబరం సెటైర్ వేశారు. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా చదవాలని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ గవర్నర్‌కు హితవు పలికారు.












Click it and Unblock the Notifications