భారత్ మరిన్నిఆధారాలు: షరీఫ్, మోడీ భేష్: ఒబామా
న్యూఢిల్లీ/లాహోర్: పంజాబ్‌లోని పఠాన్‌కోట ఉగ్రదాడి పైన భారత్ మరిన్ని ఆధారాలు సమర్పించిందని పాకిస్తాన్ అధ్యక్షులు నవాజ్ షరీఫ్ ఆదివారం నాడు చెప్పారు. వీటిని తాము పరిశీలిస్తున్నామని, నిందితులను న్యాయస్థానం ఎదుట నిలబెడతామని చెప్పారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, ఈ బృందం భారత్ వచ్చి మరిన్ని ఆధారాలు సేకరిస్తుందని, నిందితులను ఎలాగైనా పట్టుకుంటామన్నారు. తాను భారత్ ప్రధాని మోడీతో మాట్లాడనని, తమ వైపు నుంచి సాయం చేస్తామని షరీఫ్ ఇంతకుముందే చెప్పారు. కాగా, భారత్‌పై జరిగిన ఉగ్ర దాడి క్షమించరానిదని ఒబామా హెచ్చరించిన రోజే నవాజ్ స్పందించడం గమనార్హం.
కాగా, పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఘటన అనంతరం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో సమన్వయానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కృషి అభినందనీయమని బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. మోడీ చర్యలు బాగున్నాయని చెప్పారు.

మరోవైపు, ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసేందుకు, ఉగ్ర సంస్థల అన్ని రకాల వనరులను దెబ్బతీసేందుకు కొత్త వ్యూహం రూపకల్పన చేయాలని భారత్, అరబ్ కూటమి ప్రతినబూనాయి. ఆదివారం బహ్రెయిన్ రాజధాని మనామాలో అరబ్-భారత్ సహకారం వేదిక మొదటి మంత్రిత్వ స్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసేందుకు, ముఖ్యంగా ఉగ్రసంస్థల ఆర్థిక వనరులను నిర్మూలించేందుకు కొత్త వ్యూహం రూపొందించాలన్నారు. ఉగ్రవాద, అరాచక శక్తులు సమాజాలను అస్థిరపరచాలని చూస్తున్నాయని, ఇవి మన సమాజ వ్యవస్థకు నష్టం కలిగిస్తాయన్నారు.
ఇదే సమయంలో ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరు చేయాలని, మానవత్వంపై నమ్మకం ఉన్నవారు, లేనివారుగానే గుర్తించాలన్నారు. ఉగ్రసంస్థలకు గుట్టుగా సహకరిస్తున్న వారు దాని ఫలితాలను అనుభవిస్తారని పరోక్షంగా పాకిస్థాన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరుకు ప్రాంతీయంగా, అంతర్జాతీయ శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications