Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన భారత్: విశాఖ తీరంలో చైనా నౌక కలకలం

న్యూఢిల్లీ/విశాఖపట్నం: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో ఘనత సాధించింది. మిషన్‌ దివ్యాస్త్ర పేరుతో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌ (MIRV) సాంకేతికతతో పదేళ్లు శ్రమించి డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది.

కాగా, ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం MIRV సాంకేతికత కలిగిన అగ్ని-5 క్షిపణి సొంతం కావడం విశేషం. ఒకే క్షిపణి దాదాపు 10 వార్‌హెడ్ల వరకు మోసుకెళ్లగలదు. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. దేశీయంగానే ఎంఐఆర్‌వి సాంకేతికతను డీఆర్​డీఓ అభివృద్ధి చేసింది.

India Holds Agni-5 Missile Test successfully Chinese Vessel On Watch Off Vizag Coast

ఈ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఒక మహిళ అని, ఇందులో అనేక మంది మహిళల పాత్ర ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇటీవలే వెల్లడించాయి. MIRV సాంకేతికత ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌, చైనా, రష్యా, ఫ్రాన్స్‌ దేశాల వద్ద మాత్రమే ఉంది. ఇప్పుడు భారత్‌ కూడా ఆ జాబితాలో చేరడం గమనార్హం.

అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-5కు ఐదు నుంచి 7 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంటుంది. పొరుగు దేశం చైనా వద్ద డాంగ్‌ ఫెంగ్‌-41 వంటి క్షిపణులు ఉన్నాయి. వీటి పరిధి 12,000 నుంచి 15,000 కి.మీ. ఉంటుంది. ఈ నేపథ్యంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అగ్ని-5ను భారత్‌ తయారు చేసింది. ఆసియా ఖండం యావత్తు కూడా అగ్ని-5 క్షిపణి పరిధిలోకి రావడంతో చైనాకు చుక్కలు కనిపిస్తున్నాయి.

మరోవైపు, మిషన్ దివ్యాస్త్ర పేరుతో అగ్ని-5 క్షిపణి తొలి ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను ఎక్స్‌ (ట్విట్టర్​) వేదికగా అభినందించారు. మోడీపాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్​ నాథ్ సింగ్ కూడా అభినందనలు తెలియజేశారు.

విశాఖ తీరానికి కొద్ది దూరంలో చైనా నౌక

ఇది ఇలా ఉండగా.. అగ్ని-5 క్షిపణి మొదటి ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన సమయంలోనే.. చైనాకు చెందిన ఓ పరిశోధన నౌక భారత ప్రాదేశిక జలాలకు సమీపంలోకి రావడం కలకలం రేపింది. చైనాకు చెందిన జియాన్ యాంగ్ హాంగ్ 01 నౌక ఏపీలోని విశాఖపట్నం తీరానికి 480 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ సముద్ర జలాల్లో లంగరు వేసింది.

గత కొంతకాలంగా హిందూ మహా సముద్రం, బంగాళాఖాతంలో చైనా నౌకల రాకపోకలు ఎక్కువయ్యాయి. చైనా పరిశోధక నౌకల పేరిట భారత్ పై నిఘా వేస్తోందన్న అనుమానాలున్నాయి. సరిగ్గా అగ్ని-5 క్షిపణి ప్రయోగం చేపట్టే సమయంలోనే చైనా నౌక జియాన్ యాంగ్ హాంగ్ 01 భారత తీరానికి చేరువలోకి రావడం అనుమానాలను బలపరుస్తోంది.

ఈ నౌక మలక్కా జలసంధి దాటి దిశ మార్చుకుని బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. కేవలం మూడ్రోజుల వ్యవధిలోనే ఆగ్నేయ బంగాఖాతం నుంచి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. సముద్ర గర్భంలో 10 వేల అడుగుల లోతులోనూ పరిశోధించగల అత్యాధునిక రిమోట్ సెన్సింగ్ వ్యవస్థలు ఈ నౌకలో ఉన్నట్టు భావిస్తున్నారు. కాగా, భారత్‌కు చెందిన మూడు అణు బాలిస్టిక్ మిసైల్ సహిత జలాంతర్గాములు, పలు కీలక ఆయుధ వ్యవస్థలకు స్థావరంగా ఉన్న విశాఖ నావల్ బేస్‌కు సమీపానికి చైనా నౌక రావడంతో భారత్‌ అప్రమత్తమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+