పాకిస్తాన్‌కు భారత్ షాక్.. దిగుమతులపై పూర్తి నిషేధం!
భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తత మరింత తీవ్ర రూపం దాల్చింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కశ్మీర్ లోయలోని పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అమాయక పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి, మరోసారి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పట్ల భారత్ ఆగ్రహాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో, భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేవలం మాటల ఖండనతో సరిపెట్టకుండా, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగు దేశంపై ఆంక్షలు కఠినతరం చేసింది.
ఇప్పటికే పాక్‌తో ఉన్న సిందు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇండియాలో ఉన్నా పాకిస్తాన్ పౌరులను తిరి వెళ్లేలా డెడ్ లైన్ విధించింది. భారత గగనతలంపై పాక్ విమానాలను నిషేధించింది. తాజాగా పాక్‌ను ఆర్థికంగా గట్టి బుద్ధి చెప్పేందుకు మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. పాక్ దుర్చర్యలకు ప్రతీకారంగానూ, ఉగ్రవాదానికి ఆర్థిక వనరులను అడ్డుకునే ప్రయత్నంలోనూ, భారత్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి వచ్చే అన్ని రకాల దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. ఇది కేవలం పాక్షిక ఆంక్షలు కాదు, మొత్తం వాణిజ్య సంబంధాలపై పడిన గొడ్డలిపెట్టు.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారికంగా ఒక కీలక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం, పాకిస్తాన్ నుంచి ఏ ఒక్క వస్తువును కూడా ఇకపై భారతదేశంలోకి దిగుమతి చేసుకోవడానికి అనుమతి లేదు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంటే, ఈ నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచే, పాక్ నుంచి వచ్చే ప్రతి వస్తువు భారత సరిహద్దుల వద్ద నిలిచిపోతుంది.
గతంలో కొన్ని నిర్దిష్ట వస్తువులు, లేదా పరిమిత స్థాయిలో మాత్రమే వాణిజ్యం జరిగేది. అయితే, పహల్గాం దాడి వంటి ఘటనలు చోటుచేసుకోవడంతో భారత్ కఠినమైన వైఖరి తీసుకుంటుంది. ఇప్పుడు విధించిన ఈ పూర్తి నిషేధం, ఉగ్రవాదం పట్ల భారత్ వైఖరి ఎంత కఠినంగా ఉందో తెలియజేస్తుంది. పాకిస్తాన్ తమ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకునే వరకు, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వాణిజ్య సంబంధాలు పునరుద్ధరణ కష్టమేననే బలమైన సంకేతాన్ని భారత్ ఈ చర్య ద్వారా ఇచ్చింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications