పాక్ జెట్స్ నేలమట్టం, ఈ సారి S-400 కాదు - అర్ద్రరాత్రి ఆపరేషన్..!!

ఆపరేషన్ సింధూర్ లో పాక్ సైన్యానికి మరో భంగపాటు. భారత్ లోని సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల పైన పాక్ డ్రోన్లతో దాడికి ప్రయత్నిస్తోంది. భారత్ సమర్దవంతంగా తిప్పి కొడుతోంది. ఇదే సమయంలో జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ సమీపంలోని గగనతలంలోకి పాకిస్తాన్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది. ఇప్పుడు ఈ జెట్స్ ను ఎస్ 400 తో కాదు.. ఆకాశ్ అనే మరో ఆధునిక ఢిపెన్స్ వ్యవస్థను రంగంలోకి దించింది. అటు పాక్ లోని ఢిపెన్స్ కేంద్రాల పైన భారత్ దాడికి దిగింది అక్కడి సైన్యం గగ్గోలు పెడుతోంది. భారత్ ఏ స్థాయిలో అయినా పాక్ కు ధీటుగా బదిలుస్తోంది.

జెట్స్ కూల్చివేత
దుస్సాహసానికి ఒడిగట్టిన పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. జమ్మూకశ్మీర్ నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకూ 26 ప్రాంతాల్లో డ్రోన్‌ దాడులకు యత్నించగా భారత్‌ సమర్థంగా తిప్పికొట్టింది. శ్రీనగర్‌ సహా పలు విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై డ్రోన్లను ప్రయోగించగా, భారత్‌ వాటిని నిర్వీర్యం చేసింది. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్, అవంతీపొరా ఎయిర్‌బేస్‌ సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. డ్రోన్‌ దాడుల తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్‌ ప్రకటించారు. సరిహద్దు గ్రామాల్లో జనం ఇళ్లలోనే ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి గుజరాత్‌లోని భుజ్‌ వరకు 26 ప్రాంతాలపైకి వరసగా డ్రోన్లు సంధించింది. అయితే వాటిని భారత్ సైన్యం విజయవంతంగా కూల్చివేసింది. ముఖ్యంగా శ్రీనగర్‌ విమానాశ్రయం, అవంతీపొరా వైమానిక స్థావరం లక్ష్యంగా వదిలిన డ్రోన్లను నేలకూల్చింది.

india-is-retaliating-to-the-series-of-drone-and-missile-attacks-by-pakistan-in-jammu-and-srinagar

జనావాసాలపై దాడికి
జమ్ము, ఫిరోజ్‌పుర్, పఠాన్‌కోట్, జైసల్మేర్, బాడ్‌మేడ్, భుజ్‌ ప్రాంతాలపైకి వచ్చిన డ్రోన్లను భారత సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి. అయితే పంజాబ్‌లోని ఫిరోజ్‌ పూర్‌లో జనావాసాలపై పాకిస్థాన్ డ్రోన్‌ దాడి చేయగా, అది ఓ భవనంపై పడింది. అందులో ఉన్న ముగ్గురు కుటుంబసభ్యులకు గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారత్ జెట్స్ పైన ఈ సారి భారత్ ఆకాష్‌ మిసైల్‌, L-70, Zu-33, షిల్కా వినియోగించింది. దీంతో, పాక్ పన్నాగం బెడిసి కొట్టింది. శ్రీనగర్‌లో ఉదయం రెండు పేలుళ్లు జరిగాయి. రాత్రంతా సరిహద్దు గ్రామాలపై పాక్‌ కాల్పులు జరిగాయి. భారత్ దాడులతో పాక్ వైమానిక వ్యవస్థ ధ్వంసం అయినట్లు పాక్ ఆరోపిస్తోంది. తమ దేశంలోని మూడు ఎయిర్‌బేస్‌లపై విరుచుకుపడిందని పాక్ సైన్యం ప్రతినిధులు చెబుతున్నారు.

భారత్ సీరియస్
భారత్ రావల్పిండిలోని నూర్‌ఖాన్‌ వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే, భారత్ నుంచి వీటి పైన స్పష్టత రావాల్సి ఉంది. చక్‌వాల్‌లోని మురిద్‌ ఎయిర్‌బేస్‌ తో పాటుగా షార్‌కోట్‌లోని రఫీకీ ఎయిర్‌వేస్‌పై విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌ తో పాటు, లాహోర్‌, పెషావర్‌..రావల్పిండిలోని ఎయిర్‌బేస్‌లను పాక్ మూసేసింది. 4 వైమానిక స్థావరాల తోపాటు, మొత్తం పాక్‌ గగనతలం మూసి వేసారు. ఈ ఉదయ శ్రీనగర్ సమీపంలోని గగనతలంలోకి పాకిస్తాన్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను భారత్ కూల్చివేయటంతో పాక్ సైన్యం తోక ముడిచింది. నిన్నటి వరకు డిఫెన్స్‌ సిస్టమ్‌ ఎస్‌400 గురించి మాట్లాడుకున్నాం.. కానీ, ఇప్పుడు ఈ రెండు జెట్స్‌ను కూల్చింది ఆకాశ్‌ అనే మరో డిఫెన్స్‌ సిస్టమ్‌.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+