పాకిస్తాన్ కు తాజా హెచ్చరికలు ఇచ్చిన భారత్..!!
భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమౌతోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలు ఉక్కిరిబిక్కిరికి గురి అవుతున్నాయి. క్లౌడ్ బరస్ట్ వంటి ఆకస్మిక వరదలతో అల్లాడిపోతున్నాయి. వరద పోటు బారిన పడిన ఒక్క నది కూడా లేదక్కడ. భారీ నివాసాలు సైతం పేకమేడల్లా కూలిపోతున్నాయి. నదుల్లో కొట్టుకుపోతున్నాయి.
ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, బిహార్.. ఇలా దాదాపుగా అన్ని రాష్ట్రాలు వరద తాకిడి గురయ్యాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. జాతీయ రహదారులు కోసుకుపోయాయి. కొన్ని చోట్ల ఇక్కడ రోడ్డు ఉండేదా? అనే అనుమానాలు తలెత్తే విధంగా తయారయ్యాయి.

జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటివరకు 32 మంది మరణించారు. త్రికూట పర్వతంపై వెలిసిన ఉన్న మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో పలువురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. హిమాలయాల నుండి ప్రవహించే నదులు పొంగిపొర్లడంతో డ్యామ్‌లు, బ్యారేజీల నుండి నీటిని విడుదల చేయాల్సి వచ్చింది.
ఇది పంజాబ్‌లోని దిగువ ప్రాంతాలలో వరదలను మరింత ప్రభావితం చేసింది. పంజాబ్, జమ్మూ ప్రాంతంలోని పాఠశాలలను మూసివేశారు. మాతా వైష్ణో దేవి యాత్రను నిలిపివేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో 680 రోడ్లు మూసివేశారు. మండి, కుల్లు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
జమ్మూలో వందలాది ఇళ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. దాదాపు అన్ని జల వనరులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించాయి. అధికారులు ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. 18 రైళ్లను రద్దు చేశారు. ఆప్టికల్ ఫైబర్ దెబ్బతినడం వల్ల ఈ ప్రాంతం అంతటా మొబైల్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది.
జమ్మూ కాశ్మీర్ సహా ఇతర ప్రధాన డ్యామ్‌ల నుంచి అదనపు వరద నీటిని విడుదల చేయాల్సి రావడంతో కేంద్ర ప్రభుత్వం.. పాకిస్తాన్ కు ఫ్లడ్ వార్నింగ్ ఇచ్చింది. తావి నదికి వరదలు వచ్చే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ విషయాన్ని బుధవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మానవతా దృక్పథంతో ఈ హెచ్చరికలను జారీ చేసినట్లు తెలిపాయి.
పరీవాహక, ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల తావి నదీకి భారీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని పాకిస్తాన్ కు సూచించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మంగళ, బుధవారాల్లో ఇస్లామాబాద్ కు ఈ హెచ్చరికలు ఇచ్చామని వివరించాయి. అధిక వర్షాల కారణంగా కొన్ని డ్యామ్‌ల గేట్లు తెరవాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు.
హిమాలయాల్లో పుట్టి జమ్ము డివిజన్ గుండా ప్రవహించి పాకిస్తాన్‌లోని చీనాబ్‌లో కలుస్తుంది.. ఈ తావి నది. ఇది ఉప్పొంగడం వల్ల దాని ప్రభావం చీనాబ్ పై పడుతుందని తెలిపాయి. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడానికి ఈ ఫ్లడ్ వార్నింగ్ ఇచ్చినట్లు స్పష్టం చేశాయి. సట్లెజ్, బియాస్, రావి నదులు, వాటి ఉపనదులు ఇప్పటికే ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోన్నట్లు తెలిపాయి.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications