ఒకేసారి 30 స్థానాలు ఎగబాకిన భారత్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 100వ స్థానం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభ వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో భారత్ గత ఏడాది నుంచి ఈ ఏడాదికి ఏకంగా 30 స్థానాలు ఎగబాకింది.

ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన డూయింగ్ బిజినెస్ 2018: రీఫార్మింగ్ టు క్రియేట్ జాబ్స్ తాజా జాబితాలో భారత్ 100వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 130వ స్థానంలో ఉన్న భారత్‌లో ఈసారి గణనీయ మెరుగుదల కనిపించింది.

ఒక ఏడాదిలో ఇన్ని స్థానాలు మెరుగుపడడం ఇదే తొలిసారి. పన్ను చట్టాల్లో సంస్కరణలు, లైసెన్సింగ్ విధానం, పెట్టుబడుదారులకు భద్రత, దివాళా చట్టం వంటివి భారత్ ర్యాంకు మెరుగుదలకు దోహదం చేశాయి.

India jumps 30 places, breaks into top 100 of World Bank's Ease of Doing Business rankings

టాప్ 100లో నిలిచిన భారత్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంకు. మొత్తం 190 దేశాలకు సంబంధించిన వివరాలు వెల్లడించగా అందులో భారత్ గతంలో కంటే మెరుగైన స్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో న్యూజిలాండ్ తొలి స్థానంలో నిలిచింది. సింగపూర్, డెన్మార్క్, సౌత్ కొరియా, హాంకాంగ్‌, అమెరికా, బ్రిటన్ దేశాలు వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. రష్యా 35వ స్థానంలో, చైనా 78వ స్థానంలో నిలిచాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India leapfrogged into the 100th rank in the World Bank's Ease of Doing Business rankings, jumping 30 notches from last year, in an endorsement of the string of reforms implemented by the Narendra Modi government.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి