Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశంలోనే టాప్ టూరిస్ట్ ప్లేస్‌ లు.. తక్కువ ఖర్చుతో ఇలా చూసేయండి..

వేసవికాలంలో ఫ్యామిలీతో కలిసి మంచి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? దేశంలోని టాప్ టూరిస్ట్ ప్రాంతాలను చుట్టేయాలని ఉందా..? అయితే వేలకు వేలు అవసరం లేకుండా తక్కువ ఖర్చుతోనే భారత్ లోని చారిత్రక ప్రాంతాలు, ప్రకృతి రమణీయమైన తీర ప్రాంతాలు, పర్వతాలను చుట్టేసి రావచ్చు. కేవలం రూ. 10,000 తోనే దేశంలో అత్యంత పేరుపొందిన పర్యటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది.

దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది రాజస్థాన్ లోని జైపూర్. జైపూర్ ను పింక్ సిటీగా కూడా పిలుస్తుంటారు. బడ్జెట్ లో టూర్ చేయాలనుకునేవారికి జైపూర్ బెస్ట్ ఎంపిక అని చెప్పొచ్చు. జైపూర్ లో రోజువారీ ఖర్చులు సగటున 1,200 నుంచి 1,500 మేర మాత్రమే ఉంటాయి. నైట్ హాస్టల్స్ రూ. 400 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే బడ్జెట్ హోటల్స్ రూ. 700 నుంచి రూ. 1200 మధ్య ఉంటాయి. జైపూర్ ఎంతో ప్రాచీనమైన నగరం. ఇక్కడి చరిత్ర, సంస్కృతి , ఆహారాన్ని ఆస్వాదించడానికి పింక్ సిటీకి వెళ్లవచ్చు.

ఇక బడ్జెట్ లో వెళ్లగలిగే మరో టూరిస్ట్ ప్రాంతం పాండిచ్చేరి. బస్సులు, రైళ్లలో పాండిచ్చేరికి చేరుకోవచ్చు. పాండిచ్చేరిలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువే. ఇక్కడి వైట్ హౌజ్, అరబిందో ఆశ్రమం చుట్టూ డార్మ్ బెడ్ లు 400 నుంచి 600 మధ్య అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రైవేట్ రూమ్ లు 900 నుంచి 1500 వరకు లభ్యం అవుతాయి. పర్యటకులు ఓ సైకిల్ ను అద్దెకు తీసుకుని పర్యటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. ఇక్కడ స్థానిక రెస్టారెంట్లు, బేకరీలు, కేఫ్స్ లో రోజుకు రూ. 300 నుంచి రూ. 500 లోపు రుచికరమైన భోజనం లభిస్తుంది. ఇక రాక్ బీచ్ లో సూర్యోదయం, ఫ్రెంచ్ క్వార్టర్స్ ఎనలేని అనుభూతిని అందిస్తాయి.

అలాగే చిరంపుంజి పర్యటక ప్రాంతం ప్రకృతి రమణీయమైనది ఉంటుంది. ఇక్కడి సహజసిద్ధమైన పచ్చని అడవులు, కొండలు కోనలు పర్యటకులను ఆకట్టుకుంటాయి. చిరంపుంజి లో నిత్యం వర్షం పడుతూ ఉంటుంది. ఇక్కడి జలపాతాలు, గుహలు, పచ్చని ప్రకృతిని విడిచి రావాలని అనిపించదు. ఈ ప్రాంతానికి సరిగ్గా ప్లాన్ చేస్తే కేవలం రూ. 7000 నుంచి రూ. 9000 మధ్యలో వెళ్లి రావచ్చు. ఇక్కడ హోమ్ స్టేలు, గెస్ట్ హౌజ్ లలో వసతి ఒక్కో రాత్రికి రూ. 1200 నుంచి రూ.2 వేల మధ్య ఉంటుంది.

India Must-Visit Tourist Places Budget Travel Tips and Tricks must visit places in India lowbudget

బడ్జెట్ లో వెళ్లగలిగే మరో పర్యాటక ప్రదేశం మనాలి. దేశంలోని అత్యంత ప్రజాదరణ కలిగిన పర్యాటక ప్రాంతాల్లో మనాలి ఒకటిగా చెబుతారు. మనాలి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్. ఇక్కడ హాస్టల్స్, హోమ్ స్టే లు తక్కువ ధరలోనే లభిస్తాయి. రూ. 1500 నుంచి రూ. 2000 మధ్య సౌకర్యవంతమైన గదులను తీసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ మనాలి, హిడింబా ఆలయం, బియాస్ నది, పైన్ అడవులు, సోలాంగ్ వ్యాలీ ఇలా చాలా పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+