భారత్‌కు అవమానం, ప్రపంచ పటంలో పాక్ ఉండొద్దు: తొగాడియా

Subscribe to Oneindia Telugu

భువనేశ్వర్‌: పాకిస్థాన్ దేశంపై విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాక్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌ను చూసేందుకు వెళ్లిన ఆయన తల్లి, భార్యతో పాకిస్థాన్‌ ప్రభుత్వం అమర్యాదగా వ్యవహరించిందని, వారిని అవమానించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుల్‌భూషణ్ జాదవ్ కేసు: తాళి తీయించారు.. చెప్పులూ ఇవ్వలేదు.. ఇదీ పాక్ తీరు!

ఇది వారికి జరిగిన అవమానం కాదని, దేశంలోని కోట్లాది మంది తల్లులు, సోదరీమణులకు జరిగిన అవమానమని వ్యాఖ్యానించారు. దీనికి తగిన జవాబు చెబుతామని పేర్కొన్నారు. బుధవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో విశ్వహిందు పరిషత్‌ అంతర్జాతీయ సదస్సులో ప్రవీణ్‌ తొగాడియా మాట్లాడారు.

India must wipe Pakistan from world map to avenge insult to Kulbhushan Jadhav's family, says VHP chief Togadia

రానున్న రోజుల్లో పాకిస్థాన్‌పై భారత్‌ యుద్ధం ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ప్రపంచ పటంలో పాకిస్థాన్ ఉండకుండా చేయాలని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఓరం, బీజేపీరాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.వి.సింగ్‌దేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India should give Pakistan a "befitting reply" for insulting Kulbhushan Jadhav's mother, and "wipe Pakistan off the world map" if need be, Vishva Hindu Parishad chief Pravin Togadia said Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి