పాక్‌కు ప్యాంట్ తడిచిపోయే వార్నింగ్: ఏడాది తర్వాత మళ్ళీ..
"మానవత్వం హద్దులు దాటితే.. మా స్పందన అత్యంత కఠినంగా ఉంటుంది. న్యాయం జరిగి తీరుతుంది. భారతదేశం ఎప్పటికీ మర్చిపోదు." - ఇది సరిహద్దులో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శత్రువులకు భారత సైన్యం పంపిన తాజా హెచ్చరిక. గతేడాది పహల్గామ్ అడవుల్లో జరిగిన పిరికిపంద ఉగ్రదాడికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా, భారత సైన్యం తన 'పటిష్ట సంకల్పాన్ని' సోషల్ మీడియా వేదికగా మరోసారి చాటిచెప్పింది. ప్రతీకారం అంటే ఎలా ఉంటుందో చూపించిన 'ఆపరేషన్ సిందూర్' దృశ్యాలను గుర్తు చేస్తూ ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించింది.
పహల్గామ్ గాయం.. ఆపరేషన్ సిందూర్ మంట!
సరిగ్గా ఏడాది క్రితం, ఏప్రిల్ 22, 2025న పహల్గామ్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. అయితే, భారత్ ఈసారి కేవలం ఖండనలతో సరిపెట్టుకోలేదు. దాడి జరిగిన రెండు వారాలకే.. అంటే మే 6-7 తేదీల్లో అర్ధరాత్రి వేళ భారత సైన్యం ' ఆపరేషన్ సిందూర్' పేరుతో ప్రళయంలా విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించి, శత్రువు కోటలను మట్టికరిపించింది.

100 మంది ఉగ్రవాదుల ఖతం.. పక్కా స్కెచ్!
'ఆపరేషన్ సిందూర్' భారత సైన్యం యొక్క వ్యూహాత్మక విజయానికి నిదర్శనంగా నిలిచింది. తొమ్మిది ప్రధాన ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో కేవలం ఉగ్రవాదులే కాకుండా, వారికి శిక్షణ ఇచ్చే మాస్టర్ మైండ్లు, సూత్రధారులు కూడా ఉండటం గమనార్హం. పౌరులకు ఎటువంటి హాని కలగకుండా, కేవలం ఉగ్రవాద స్థావరాలనే ధ్వంసం చేయడం ద్వారా భారత్ తన సైనిక పటిమను ప్రపంచానికి చాటింది.
When boundaries of humanity are crossed, the response is decisive.
— ADG PI - INDIAN ARMY (@adgpi) April 21, 2026
Justice is Served.
India Stands United.#SindoorAnniversary #JusticeEndures #NationFirst pic.twitter.com/rtgYu9Hg11
"కొన్ని హద్దులు దాటకూడదు"
సైన్యం తాజాగా షేర్ చేసిన పోస్ట్‌లో "కొన్ని హద్దులను ఎప్పటికీ దాటకూడదు" (Some lines should never be crossed) అనే సందేశం పాకిస్థాన్‌కు నేరుగా ఇచ్చిన వార్నింగ్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నా, ఉగ్రవాదంపై పోరులో భారత్ అణుమాత్రం కూడా వెనక్కి తగ్గదని, మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని సైన్యం స్పష్టం చేసింది.
భారతదేశం ఏకతాటిపై నిలబడి ఉగ్రవాదాన్ని తుదముట్టించే వరకు విశ్రమించదని సైన్యం చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కేవలం స్మరణ మాత్రమే కాదు.. శత్రువుకు హెచ్చరిక!














Click it and Unblock the Notifications