Top 5 Indian Villages: మేఘాల చాటున దాగిన ఆ ఐదు గ్రామాలు.. అక్కడకు ఎలా చేరుకోవాలి..?
భారత్ లో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అందరూ సాధారణంగా మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్రాంతాలకే వెళ్తుంటారు. అయితే ఎప్పుడూ అదే పర్యాటక ప్రాంతాలకు వెళ్లి బోర్ కొట్టిందా..? అయితే భారత్ లో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ ఐదు హిడెన్ గ్రామాలకు వెళ్లేందుకు ప్లాన్ చేయండి. ఈ గ్రామాలు మేఘాల చాటున దాగి ఉన్నాయి. కేరళలోని గవి గ్రామం అయినా మేఘాలయాలోని మావ్లింగ్ నా అయినా ఈ కోవకే చెందుతాయి. ఇక్కడి ప్రకృతి అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇక ఐదు హిడెన్ గ్రామాల్లో మొదటిది మేఘాలయాలోని మావ్లింగ్ నా.. ఈ గ్రామం మాసిండ్రోమ్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే షిల్లాంగ్ నుంచి 45 నుంచి 75 కిలోమీటర్ల దూరంలోని ఈస్ట్ ఖాసీ హిల్స్ లో ఉంటుంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2,244 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక ఈ గ్రామానికి ఆసియా ఖండంలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా గుర్తింపు లభించింది. అంతేకాక ఈ ప్రాంతాన్ని గాడ్స్ ఓన్ గార్డెన్ అని పిలుస్తుంటారు. ఈ మారుమూల గ్రామంలో 100 శాతం అక్షరాస్యత ఉండటం విశేషం. ఈ గ్రామాన్ని విజిట్ చేయడానికి జూన్ టూ సెప్టెంబర్ అనువైన సమయంగా చెబుతారు.
అలాగే ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని మనా గ్రామాన్ని ది ఫస్ట్ ఇండియన్ విలేజ్ గా అభివర్ణిస్తారు. సరస్వతి నది ఒడ్డున ఈ గ్రామం ఉంది. అలాగే బద్రినాథ్ ఆలయానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం సముద్రమట్టానికి 10, 500 అడుగుల ఎత్తులో ఉంటుంది. మనా ప్రాంతాన్ని విజిట్ చేయడానికి జూలై నుంచి ఆగస్టు వరకు మంచి సమయంగా చెబుతారు. ఈ గ్రామం చుట్టూ మేఘాలు అలుముకున్నాయా..? అనే అనుభూతి కలుగుతుంది. ఇక్కడే ఉన్న వసుధార ఫాల్స్ కు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది.
ఇక కేరళ పతనంతిట్ట జిల్లాలోని గవి గ్రామం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ ప్రాంతం పెరియార్ టైగర్ రిజర్వ్ లో ఉంది. గవి గ్రామం సముద్ర మట్టానికి 3,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య విజిట్ చేయడం ఉత్తమమైన సమయంగా చెబుతారు. ఇక్కడి యాలకుల తోటలు, దట్టమైన అడవులు, గవి సరస్సు ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. మరోవైపు ఈస్ట్ సిక్కింలోని జులుక్ ప్రాంతం మరో హిడెన్ విలేజ్ గా ఉంది. సిక్కింలోని గ్యాంగ్ టక్ ప్రాంతానికి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. టిబెట్ నుంచి భారత్ కు కనెక్ట్ అయ్యే ఓల్డ్ సిల్క్ రూట్ లో ఈ గ్రామం ఉంది. ఈ ప్రదేశానికి మార్చి నుంచి మే వరకు వెళ్లడం ఉత్తమమైన సమయంగా చెబుతారు. ఈ గ్రామం సముద్ర మట్టానికి 9,400 అడుగుల ఎత్తులో ఉంటుంది.

ఇక చివరగా అరుణాచల్ ప్రదేశ్ అన్ జా జిల్లాలోని కిబితు గ్రామం సముద్ర మట్టానికి 4 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గ్రామాన్ని భారత దేశ మొట్టమొదటి సూర్యోదయం ఏర్పడే ప్రదేశంగా చెబుతారు. ఈ ప్రాంతం మొత్తం దట్టమైన మేఘాలతో నిండి ఉంటుంది. ఈ గ్రామానికి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వెళ్లడం ప్రమాదకరంగా చెబుతారు.












Click it and Unblock the Notifications
