మళ్లీ ఆసియా అపర కుబేరుడిగా ముఖేశ్ అంబానీ.. వెల్లడించిన ఫోర్బ్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మళ్లీ ఆసియా అత్యంత ధనవంతుడిగా తన సత్తా చాటారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో ఆయన సంపద 88 బిలియన్ డాలర్లు దాటింది. దీంతో ఇప్పటివరకు టాప్‌లో ఉన్న చైనా బైట్‌డ్యాన్స్ సహ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్‌ను వెనక్కి నెట్టేసి టాప్ 1 పొజిషన్ లోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ వచ్చారు.

గతంలో టాప్ లో ఉన్న జాంగ్ సంపద ప్రస్తుతం 84 బిలియన్ డాలర్లుగా ఉంది.ఇది ఒక్కసారిగా జరిగిన మార్పు కాదు. నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్ కారణంగా 10 శాతం పైగా పెరిగాయి. ఆ ఒక్క రోజులోనే అంబానీ సంపదకు దాదాపు 8 బిలియన్ డాలర్లు యాడ్ అయ్యాయి. రోజువారీ సంపద పెరుగుదలలో ఎలాన్ మస్క్ తర్వాత రెండో స్థానం అంబానీదే.

Mukesh Ambani richest in Asia Mukesh Ambani Back on Top as Asia s Richest Person Forbes list

ఆసియాలో ఉన్న అపర కుబేరుల జాబితాలో మూడో స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన సంపద 79.1 బిలియన్ డాలర్లు. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టాప్ పొజిషన్ లో నిలిచారు. ఆయన నికర సంపద విలువ 878.5 బిలియన్ డాలర్లు. 366 బిలియన్ డాలర్ల నికర సంపదతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు.

మూడో స్థానంలో నిలిచిన గూగుల్ సహవ్యవస్థాపకుడు లారీ పేజ్ సంపద విలువ 232.2 బిలియన్ డాలర్లు.రిలయన్స్ గ్రూప్ ఇప్పుడు కేవలం పెట్రోలియం కంపెనీగా మాత్రమే కాదు. జియో ద్వారా టెలికామ్‌లో, రిటైల్‌లో, డిజిటల్ సేవల్లో కూడా దూకుడును కొనసాగిస్తోంది. ఈ కారణాలు అంబానీ సంపదను స్థిరంగా పెంచుతున్నాయి . గత కొన్నేళ్లుగా అంబానీ, అదానీల మధ్య ఆసియా టాప్ స్థానం కోసం పోటీ నడుస్తూనే ఉంది.

గరీబ్‌రథ్ లో బెంగళూరు వెళ్ళాలంటే 15గంటలు..ప్రయాణికుల లేటెస్ట్ డిమాండ్!
గరీబ్‌రథ్ లో బెంగళూరు వెళ్ళాలంటే 15గంటలు..ప్రయాణికుల లేటెస్ట్ డిమాండ్!

ఒకసారి అదానీ ముందుకు వస్తే, మరోసారి అంబానీ దాటేస్తున్నారు.షేర్ మార్కెట్ ఎప్పుడూ హెచ్చుతగ్గులతోనే ఉంటుంది. కానీ రిలయన్స్ లాంటి పెద్ద సంస్థల బలం ఉన్నవారికి దీర్ఘకాలికంగా సంపద పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం అంబానీ మళ్లీ ఆసియా టాప్‌లో ఉండటం భారతీయ పారిశ్రామికవేత్తల బలాన్ని చూపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+