దేశంలోనే రిచెస్ట్ రాజ్యసభ ఎంపీ తెలంగాణ నుంచే.. టాప్-3లో ఇద్దరు.. ఎవరో తెలుసా?

ఇండియాలో అత్యంత శ్రీమంతులైన రాజ్యసభ ఎంపీల జాబితాలో తెలంగాణ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలోని టాప్-3 అత్యంత ధనిక రాజ్యసభ ఎంపీలలో ఇద్దరు తెలంగాణకు చెందినవారే కావడం గమనార్హం.

మహిళా పారిశ్రామికవేత్తలకు బిగ్ బూస్ట్ ఇస్తున్న తెలంగాణా ప్రభుత్వం!
మహిళా పారిశ్రామికవేత్తలకు బిగ్ బూస్ట్ ఇస్తున్న తెలంగాణా ప్రభుత్వం!

దేశంలోనే అత్యంత ఎంపీలు వీరే..
బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారధి రెడ్డి రూ.5,300 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక రాజ్యసభ ఎంపీగా మొదటిస్థానంలో నిలిచారు. పంజాబ్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజీందర్ గుప్తా(రూ.5,053 కోట్లు) రెండో స్థానంలో ఉండగా.. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి రూ.2,558 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరు ఎంపీల ఆస్తులే తెలంగాణ రాజ్యసభ సభ్యుల మొత్తం ఆస్తుల్లో దాదాపు 95 శాతంగా ఉండటం విశేషం. తెలంగాణలోని ఏడుగురు రాజ్యసభ ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.8,310 కోట్లుగా నమోదై, దేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

India Richest Rajya Sabha MPs Telangana Top Country With Bandi Partha Saradhi Reddy Full Details Here

తెలుగు రాష్ట్రాల ఎంపీల ఆస్తులు, వివరాలు

తెలంగాణ ఎంపీల ఆస్తుల ర్యాంకింగ్స్

*బండి పార్థసారధి రెడ్డి(బీఆర్ఎస్): రూ.5,300 కోట్లు(చరాస్తులు: రూ.5,215 కోట్లు, స్థిరాస్తులు: రూ.84 కోట్లు)-ర్యాంక్-1
*అభిషేక్ మను సింఘ్వి(కాంగ్రెస్): రూ.2,558 కోట్లు(చరాస్తులు: రూ. 2,104 కోట్లు, స్థిరాస్తులు: రూ.453 కోట్లు, వార్షికాదాయం: రూ.374 కోట్లు)- ర్యాంక్ 3
*రేణుకా చౌదరి(కాంగ్రెస్): రూ.178 కోట్లు -ర్యాంక్ 23
*దివికొండ దామోదర్ రావు(బీఆర్ఎస్): రూ.124 కోట్లు- ర్యాంక్ 28
*వద్దిరాజు రవిచంద్ర(బీఆర్ఎస్): రూ. 99 కోట్లు-ర్యాంక్ 33
* వేం నరేందర్ రెడ్డి(కాంగ్రెస్): రూ.41 కోట్లు- ర్యాంక్ 57
*అనిల్ కుమార్ యాదవ్(కాంగ్రెస్): రూ.7 కోట్లు -ర్యాంక్ 120

ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఆస్తుల ర్యాంకింగ్స్
ఏపీకి చెందిన 11 మంది ఎంపీలలో ఐదుగురు బిలియనీర్లుగా ఉన్నారు.
*భాష్యం రామకృష్ణ(టీడీపీ): రూ.672 కోట్లు -ర్యాంక్ 6
*మేడా రఘునాథరెడ్డి(వైఎస్సార్సీపీ): రూ.475 కోట్లు - ర్యాంక్ 10
*బీద మస్తాన్ రావు(టీడీపీ): రూ.264 కోట్లు - ర్యాంక్ 19
*లింగమనేని రమేష్(జనసేన): రూ.213 కోట్లు - ర్యాంక్ 21
*వైవీ సుబ్బారెడ్డి(వైఎస్సార్సీపీ): రూ.118 కోట్లు-ర్యాంక్ 29

దేశవ్యాప్తంగా ఉన్న 32 మంది బిలియనీర్ ఎంపీలలో 28 శాతం మంది(9 మంది) తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం.

తెలంగాణా యువతకు ఎగిరి గంతేసే వార్త.. లక్షమందికి ఉచిత ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ
తెలంగాణా యువతకు ఎగిరి గంతేసే వార్త.. లక్షమందికి ఉచిత ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ

అప్పుల లెక్కింపులో ఏపీ ముందంజ
దేశంలో అత్యధికంగా అప్పులు ఉన్న టాప్-10 ఎంపీలలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ఉన్నారు.
*భాష్యం రామకృష్ణ(టీడీపీ): రూ.200 కోట్ల అప్పులతో దేశంలో రెండో స్థానం.
*లింగమనేని రమేష్(జనసేన): రూ.85 కోట్లు(5వ స్థానం).
*మేడా రఘునాథరెడ్డి(వైఎస్సార్సీపీ): రూ.82 కోట్లు(6వ స్థానం)
*బీద మస్తాన్ రావు(టీడీపీ): రూ.75 కోట్లు(7వ స్థానం).
*దివికొండ దామోదర్ రావు(బీఆర్ఎస్): రూ.49 కోట్లతో 9వ స్థానంలో ఉన్నారు.

నేర చరిత్ర కూడా తెలంగాణే టాప్
రాజ్యసభ ఎంపీల నేర చరిత్ర డిక్లరేషన్‌లో కూడా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణకు చెందిన మొత్తం ఏడుగురు రాజ్యసభ సభ్యులలో 71 శాతం మంది(5 గురు ఎంపీలు) తమపై నేర కేసులు ఉన్నట్లు స్వచ్ఛందంగా వెల్లడించారు. అంతేకాకుండా తీవ్ర నేరారోపణ కేటగిరీలో కూడా తెలంగాణ ఎంపీలు 42 శాతం(3/7)తో అగ్రస్థానంలో ఉన్నారు. తెలంగాణలోని ఎంపీల వారీగా చూస్తే.. కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మందడిపై అత్యధికంగా 17 కేసులు నమోదయ్యాయి. వీటిలో 3 తీవ్రమైన ఐపీసీ కేసులు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రపై 6 కేసులు ఉండగా.. అందులో 4 తీవ్రమైన కేటగిరీకి చెందినవి. అలాగే కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిపై 5 కేసులు ఉండగా.. అందులో ఒకటి తీవ్రమైన కేసుగా నమోదైంది.

మరోవైపు ఏపీలో 45 శాతం మంది (11 మంది ఎంపీలలో 5గురు) తమపై నేర కేసులు ఉన్నట్లు తెలిపారు. జనసేన ఎంపీ లింగమనేని రమేష్‌పై 9 కేసులు ఉన్నప్పటికీ.. వాటిలో తీవ్రమైన కేసులు ఏవీ లేవు. అయితే టీడీపీ ఎంపీ విజయ్ చింతకాయల మాత్రం తీవ్రమైన కేసు ఎదుర్కొంటున్న ఏకైక ఏపీ ఎంపీగా నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+