వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణ భారత్ నుంచి చైనా మొత్తాన్ని టార్గెట్ చేసేలా..!: ఇదీ ఇండియా 'లక్ష్యం'

భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా న్యూక్లియర్ నిపుణులు భారత్ గురించి కీలక విషయాలు వెల్లడించారని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా న్యూక్లియర్ నిపుణులు భారత్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. అమెరికాకు చెందిన హన్స్‌ ఎం క్రిస్టెన్సన్‌, రాబర్ట్‌ ఎస్‌ నోరిస్‌ అనే ఇద్దరు నిపుణులు 'ఇండియన్‌ న్యూక్లియర్‌ ఫోర్స్‌ 2017' పేరుతో కథనం రాశారు. ఇందులో భారత అణుశక్తిపై రాశారు.

'ఇలాంటివెన్నో చూశాం', భూటాన్‌కు చైనా ఆఫర్.. భారత్‌కు చిక్కు కానీ'ఇలాంటివెన్నో చూశాం', భూటాన్‌కు చైనా ఆఫర్.. భారత్‌కు చిక్కు కానీ

భారత్ తన అణుశక్తిని ఆధునికీకరిస్తోందని, సరికొత్త అణ్వాయుధ వ్యవస్థను ఏర్పర్చుకుంటుందని వారు చెప్పారు. సాధారణంగా భారత్ అణ్వాయుధ వ్యూహాలు పాకిస్తాన్‌కు అనుగుణంగా ఉంటాయని, ఇప్పుడు చైనాపై కూడా దృష్టి సారించిందంటున్నారు.

మరో ఆసక్తికరం.. సౌత్ బేస్‌గా చైనా టార్గెట్

మరో ఆసక్తికరం.. సౌత్ బేస్‌గా చైనా టార్గెట్

భారత దేశం దక్షిణాది కేంద్రంగా మిసైల్స్‌ను అభివృద్ధి చేస్తుందని కూడా పేర్కొన్నారని చెబుతున్నారు. దీనికి కారణం మొత్తం చైనా దేశాన్ని టార్గెట్ చేయడమే కావొచ్చునని అంటున్నారు. చైనా మొత్తాన్ని టార్గెట్ చేసేలా సౌత్ బేస్‌గా మిసైల్ అభివృద్ధి చేస్తోందని చెబుతున్నారు.

వాటర్ హెడ్స్

వాటర్ హెడ్స్

భారత దేశం 150 నుంచి 200 న్యూక్లియర్ వాటర్ హెడ్స్ ప్లూటోరియంను ఉత్పత్తి చేస్తున్నట్లుగా అంచనా వేసినప్పటికీ, 120 నుంచి 130 వాటర్ హెడ్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తోందని హాన్స్ ఎం క్రిస్టెన్సన్, రాబర్ట్ ఎస్ నోరిస్ అనే న్యూక్లియర్ నిపుణులు ఆర్టికల్‌లో పేర్కొన్నారు.

భారత్ ఏడు అణ్వాయుధ వ్యవస్థలను నిర్వహిస్తోందని..

భారత్ ఏడు అణ్వాయుధ వ్యవస్థలను నిర్వహిస్తోందని..

భారత్ సాధారణంగా పాకిస్తాన్‌పై దృష్టి పెడుతుంది. కానీ ఇప్పుడు చైనాపై ఎక్కువ కన్నేసిందని వారు పేర్కొన్నారు. భారత్ సరికొత్త అణ్వాయుధ వ్యవస్థలతో తన ఆయుధ సంపత్తిని మెరుగుపరుచుకుంటుందని తెలిపారు. భారత్ ప్రస్తుతం ఏడు అణు సామర్థ్యం గల వ్యవస్థలను ఆపరేట్ చేస్తోందని సదరు అమెరికా న్యూక్లియర్ నిపుణులు అంచనా వేశారు. మరో నాలుగు అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. వీటిని వేగవంతంగా పూర్తి చేసే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

రానున్న దశాబ్దంలో..

రానున్న దశాబ్దంలో..

రానున్న దశాబ్ద కాలంలో భారత్ సుదూర భూమి, సముద్రం బేస్డ్ మిసైల్స్‌ను తయారు చేయవచ్చునని పేర్కొన్నారు. సమాచారం మేరకు భారత్‌కు 120-130 న్యూక్లియర్ వార్ హెడ్స్‌తో మరిన్ని అవసరమని అంచనా వేశారు. భారత్ తయారు చేస్తున్న అగ్ని 2, అగ్ని 1‌లు 2,000 కిలో మీటర్ల టార్గెట్‌ను చేధించగలవని పేర్కొన్నారు. అంటే వెస్టర్న్ చైనా, సౌత్ చైనా, సెంట్రల్ చైనాలను టార్గెట్ చేయగలవని చెప్పారు.

దక్షిణాది నుంచి టార్గెట్ చేయగలిగే అగ్ని 5

దక్షిణాది నుంచి టార్గెట్ చేయగలిగే అగ్ని 5

భారత్ తయారు చేయనున్న అగ్ని 4 అయితే నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి చైనా మొత్తాన్ని టార్గెట్ చేయగలదని, బీజింగ్, షాంఘై పట్టణాలు కూడా అందులోకి వస్తాయని పేర్కొన్నారు. భారత్ సుదూర లక్ష్యాలను ఛేదించే అగ్ని 5ని తయారు చేస్తోందని, ఇది 5000 కిలోమీటర్ల దూరాన్ని టార్గెట్ చేయగలదని పేర్కొన్నారు. సెంట్రల్, దక్షిణ భారత్ నుంచి చైనాను టార్గెట్ చేయగలదని చెప్పారు.

English summary
India continues to modernise its atomic arsenal with an eye on China and the country's nuclear strategy which traditionally focused on Pakistan now appears to place increased emphasis on the Communist giant, two top American nuclear experts have said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X